మీరు VLC మీడియా ప్లేయర్ బాగా వాడుతారా? అయితే ఈ useful ఫీచర్ గురించి మీకు తెలియాలి
VLC ప్లేయర్ అనేది ఎప్పటినుండో PC లలో డిఫాల్ట్ వీడియో ప్లేయర్. ఇందుకు కారణం సింపుల్ గా ఉంటుంది కాని అన్ని ఫైల్స్ ను ప్లే చేస్తుంది. ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే టైమ్ వెస్ట్ అనుకోకండి, తెలియని వారు అంటూ ఉండకుండా ఉండరు కాబట్టి షేర్ చేయగలరు.
మీరు VLC లో ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువుగా చూస్తారా? అయితే ఇది మీకు నచ్చుతుంది. హాలివుడ్ మూవీస్ ను డౌన్లోడ్ చేసుకొని చూడటం అనేది WiFi ఇంటర్నెట్ వాడే వారికి సుపరిచితం.
సో మూవీ యొక్క డైలాగ్స్ కొరకు చాలామంది opensubtitles.org వంటి సైట్స్ సహాయం తీసుకోవటం జరుగుతుంది. కాని సరైన subtitle ను వెతికి పట్టుకోవటం చాలా కష్టం.
కాని మీరు ప్రత్యేకంగా సైట్ ఓపెన్ చేసి మూవ్ నేమ్ ఎంటర్ చేసి వెతికే ప్రోసెస్ ను చేయనవసరం లేదు. VLC ప్లేయర్ లో పైన మెను ఆప్షన్స్ లో VIEW లో కి వెళ్తే..
క్రింద డ్రాప్ డౌన్ సబ్ మెను వస్తుంది కదా..ఆ లిస్టు లో లాస్ట్ లో Download subtitles అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే మీకు ఆటోమాటిక్ గా మీరు ప్లే చేస్తున్న మూవీ నేమ్ ఉంటుంది.
ఇప్పుడు సర్చ్ by name సెలెక్ట్ చేస్తే మీకు కొన్ని subtitles లిస్టు వస్తుంది. ఎదో ఒక దానిని సెలెక్ట్ చేసుకొని క్రింద ఉన్న download selection క్లిక్ చేస్తే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది.
మీరు మరలా ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ అయ్యిందో అక్కడకు వెళ్లి దానిని మూవీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటం వంటివి కూడా అవసరం లేదు. డౌన్లోడ్ అవ్వగానే మూవీ కు sync అయిపోతుంది.
అయితే కొన్ని ఆడియో తో పాటు కరెక్ట్ గా sync అవ్వవు. సో దాని కోసం మీరు ఈ లింక్ లో వ్రాసిన అద్బుతమైన టిప్ చూడగలరు. అద్భుతం అని ఎందుకు అన్న అంటే ఇంగ్లిష్ మూవీస్ అలవాటు ఉన్న వారికి ఇది ఎప్పటినుండో ఎదురుచూసే ఫీచర్ 🙂