నేను ఈ రోజు spam email folder లోకి వెళ్లి చెక్ చేస్తే, ఒక dangerous రిస్క్ ఉన్న మెయిల్ చూడటం జరిగింది. అయితే ఇది నాకు అంత డేంజరస్ కాదు.
కాని ఇదే మెయిల్ ఎవరేజ్ టెక్నికల్ నాలెడ్జి ఉన్న వ్యక్తులకు వస్తే..మెయిల్ చాలా సీరియస్ రిస్క్ కలిగినది అని అనిపించింది. ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పటానికి కొద్దిపాటి టెక్నాలజీ పై అనుభవం ఉన్న వారికీ కూడా సాధ్యం కానట్లుగా వస్తున్నాయి spam mails.
పైన ఇమేజ్ లో మెయిల్ ఓపెన్ చేసేలా ఎంత attractive గా ఉంది చూడండి మెయిల్ సారంశం. అంతా చాలా నమ్మదగినట్లుగా ఉంది. నేను నిజంగా ఏదో నా పర్సనల్ బ్యాంకు అకౌంట్ అనుకోనే ఓపెన్ చేశాను, కానీ లోపల(మొదటి ఇమేజ్) సారంశం చూడగానే spam అని అర్థమైపోయింది.
ఏమి జరగవచ్చు మెయిల్ లోని లింక్ పై క్లిక్ చేస్తే?
నా బ్యాంక్ డిటేల్స్ ఎంటర్ చేస్తే, వాటిని బ్యాక్ గ్రౌండ్ లో hack చేసి, అవతల వ్యక్తీ వాటి సహాయంతో నా ఒరిజినల్ బ్యాంకు అకౌంట్ లోని అమౌంట్ తో షాపింగ్ చేయటం, లేదా transfer చేసుకోవటం వంటివి జరుగుతాయి.
నాకు ఏ విషయాలు చూడగానే fake మెయిల్ అని అర్థమైంది?
ఈ రిగార్డ్స్ క్రింద ఉన్న పేరు, అడ్రెస్ ఐడెంటిఫికేషన్ కు అస్సలు అర్థం లేదు. ఎందుకంటే ముందు పేరు విచిత్రంగా ఉంది, రెండవది Money సిస్టం సపోర్ట్. మూడవి దాని క్రింద ఉన్న IP అడ్రెస్ మాదిరి డిజిట్స్.
సో ఇలా చాలా నిజంగా అనిపించే phishing మెయిల్స్ కూడా ఉంటున్నాయి జాగ్రత్తగా ఉండండి. ఎప్పటిలానే spam అని తెలుసుకొని మెయిల్ మూసివేస్తున్నప్పుడు మీకు తెలియజేస్తే మంచిదనిపించి ఈ పోస్ట్ వ్రాయటం జరిగింది. ఫేస్ బుక్ లో నన్ను ఈ లింక్ లో ఫాలో అవ్వగలరు.