మనం తీసుకునే ఫోటోస్ లో కొన్ని బాగుంటాయి కాని అడ్డంగా లేదా బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని ఫోటోస్ అందాన్ని పాడుచేసేలా ఉంటాయి.
వాటిని రిమూవ్ చేయటానికి చాలామంది ప్రయత్నాలు చేసి విఫలం అయ్యి ఉంటారు. ఎందుకంటే ఫోటో షాప్ అంత పెద్ద సాఫ్ట్ వేర్లు ఇంస్టాల్ చేయటం, వాటిని వాడటం అందరికీ సులువు కాదు.
సో ఫోటో షాప్ అవసరం లేకుండా, మరే ఇతర సాఫ్ట్ వేర్ కంప్యుటర్ లో ఇంస్టాల్ చేయనవసరం లేకుండా మీరు WebInpaint అనే వెబ్ సైట్ ద్వారా unwanted objects ను రిమూవ్ చేసుకోగలరు neat గా.
ఇందుకు మీరు ముందుగా ఈ లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తరువాత…
- TRY IT NOW పక్కన Upload Now అనే బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని లాగ్ in అవమని అడుగుతుంది. అన్ని ఫిల్ చేయటం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా ఫేస్ బుక్ లో లాగ్ ఇన్ అవగలరు.
- ఇప్పుడు ఇమేజ్ అప్ లోడ్ చేసిన తరువాత పైన రౌండ్ గా రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయాలి.
- దాని పక్కన ఉన్న డౌన్ arrow బటన్ పై క్లిక్ చేస్తే రెడ్ కలర్ బటన్ సైజ్ కూడా ఎంచుకోగలరు.
- ఇప్పుడు మీరు ఫోటో లో remove చేయదలచుకున్న స్పాట్ పై స్వైప్ చేయండి మౌస్ తో.
- బాగా స్వైప్ చేసిన తరువాత టాప్ లో ఉన్న play బటన్ గ్రీన్ కలర్ సింబల్ పై ప్రెస్ చేస్తే అది అప్లై అయ్యి మీకు కొత్త ఇమేజ్ చూపిస్తుంది.
- ఇలా ఎన్ని సార్లు అయినా చేసుకోగలరు స్వైపింగ్ కాని క్లీన్ గా స్లో గా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి లేదంటే ఒక దగ్గర ఉన్న బొమ్మ వేరే ప్లేస్ లోకి వచ్చేస్తుంది.