రిలయన్స్ LTE JioFi WiFi హాట్ స్పాట్ రివ్యూ అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్
మరలా రిలయన్స్ Jio ఎంత పాపులర్ అయ్యింది, మిగిలిన నెట్ వర్క్స్ ను ఎంతలా కంగారు పెడుతుంది వంటి ఓపెనింగ్ మాటలు ఏమి చెప్పను డైరెక్ట్ గా మేటర్ లోకి ఎంటర్.. 🙂
రిలయన్స్ సిమ్ ను తీసుకోవటానికి మరొక పద్దతి ఉంది అని గతంలో తెలిపాను మీకు. అది JioFi – WiFi హాట్ స్పాట్ పద్దతి. దీనినే dongle లేదా మొబైల్ హాట్ స్పాట్ అనొచ్చు లేదా WiPod అనొచ్చు. రిలయన్సే సొంతంగా ఈ WiPod పేరుతో 4G dongle ను ప్రవేశ పెట్టింది.
హాట్ స్పాట్ డివైజ్ తో ఏమి వస్తాయి?
దీనిలో Jio సిమ్ వేసుకొని ఇంటిలో లేదా ఆఫీస్ లో.. సాధరణ WiFi రూటర్ మాదిరిగా ప్లగ్ in చేసి లేదా unplug చేసి కూడా పాకెట్ లో పెట్టుకొని వాడుకోగలరు. ఎక్కడుకేల్లినా WiFi పద్దతిలో దీనికి కు స్మార్ట్ ఫోన్/లాప్ టాప్/టాబ్లెట్ కనెక్ట్ చేసుకొని వాడుకోవటానికి అవుతుంది. 3 నెలల unlimited ప్రివ్యూ ఆఫర్ కూడా వస్తుంది. ఆల్రెడీ దీనిని వాడటం జరుగుతుంది. సో ఇక్కడ క్విక్ రివ్యూ అందిస్తున్నాను..
బేసిక్ గా ఇది ప్లాస్టిక్ బాడీ తో వెనుక panel రిమోవ్ చేసుకునేటట్లు వస్తుంది. 16mm మందం ఉంది, బరువు 80 గ్రాలు(అంటే కొంచెం బరువుగా అనిపించే స్మార్ట్ ఫోనులో సగం బరువు). సొంతంగా 2300 mah బ్యాటరీ ఉంది లోపల. ఇంకా సిమ్ మరియు SD కార్డ్ కూడా పెట్టుకోగలరు. స్టాండర్డ్ సిమ్ సైజ్ ఉంటుంది. సిమ్ అడాప్టర్ కూడా వస్తుంది మైక్రో మరియు నానో సిమ్స్ కోసం.
ప్రాసెస్ ఏంటి? దీనిని లా యాక్టివేట్ చేయాలి?
WiPod కొన్న రిలయన్స్ షాప్ లోనే మీ డాకుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ప్రోసెస్ మొదలు పెడితే రెండు రోజుల్లో యాక్టివేట్ అవుతుంది సిమ్. కాని ప్రస్తుతం చాలా మందికి 10 రోజుల వరకూ పడుతుంది. కారణం – ఎక్కువ అప్లికేషన్స్!
డివైజ్ తో పాటు వచ్చిన సిమ్ ను మీ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్( 4G ఉన్నా లేకపోయినా మరియు బ్రాండ్ ఏదైనా ఫర్వాలేదు, WiFi ఉంటే చాలు) లో వేసి 1977 కు కాల్ చేసి యాక్టివేషన్ confirm చేయాలి. యాక్టివేట్ అయిన తరువాత dongle లో వేసి వాడుకోవటమే. LTE ఆటోమాటిక్ గా కనెక్ట్ అవుతుంది dongle లో పెడితే.
ఏ LED లైట్ దేనికి పనిచేస్తుంది?
దీనికి పైన నాలుగు LED ఇండికేటర్స్ ఉన్నాయి. క్రింద పవర్ మరియు బ్యాటరీ కోసం(3 బార్స్ సింబల్) ఇండికేటర్స్ ఉన్నాయి. పవర్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే డివైజ్ on అవుతుంది. డివైజ్ కు పై భాగంలో లెఫ్ట్ నుండి రైట్ కు మొదటిది LTE కనెక్టివిటి, రెండవది Data ON/OFF, మూడవది WiFi స్టేటస్, నాలుగవది WPS స్టేటస్ led.
లెఫ్ట్ లో చివరిలో WPS స్విచ్ ఒకటి ఉంటుంది. ఇది LTE నెట్ వర్క్ సెక్యూరిటీ కొరకు. ఒకసారి టాప్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. సో డివైజ్ ను ఆన్ చేయటానికి పవర్ బటన్ పై ఒకసారి లాంగ్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు కనెక్టివిటీ led బ్లింక్ అవుతుంది. సో మరలా పవర్ పై టాప్ చేస్తే బ్లూ led బ్లింక్ అయ్యి డివైజ్ ను స్టాండ్ బై మోడ్ లోకి పంపుతుంది. అంటే పనిచేస్తుంది కాని బ్యాటరీ సేవ్ అవుతుంది స్టాండ్ బై అంటే. సో ఇక మీ వద్ద ఉన్న ఫోనులో dongle యొక్క SSID ను చూడటానికి WiFi ఆన్ చేస్తే చాలు. స్కానింగ్ అయ్యి లిస్టు లో డివైజ్ యొక్క సిగ్నల్ కనిపిస్తుంది. పాస్ వర్డ్ ఎంటర్ చేసి కనెక్ట్ చేసుకోవటమే. LTE LEd గ్రీన్ కలర్ లో బ్లిక్ అయితే కనెక్ట్ అయినట్లే. కనెక్ట్ అయిన తరువాత డేటా led (రెండవది) కంటిన్యూస్ గా బ్లింక్ అవుతుంది. WiFi LED మాత్రం అలాగే ఉంటుంది స్టేబుల్ గా. పవర్ బటన్ పై మధ్యలో ఒక సారి టాప్ చేస్తే కనెక్టివిటీ స్టేటస్ మరియు బ్యాటరీ స్టేటస్ తెలుసుంది.
అసలు విషయం కనెక్టివిటీ మరియు స్పీడ్ విషయాలకు వద్దాము..
డివైజ్ మాక్సిమమ్ 31 WiFi కలిగిన డివైజెస్ కు కనెక్ట్ అవగలదు ఒకేసారి. కాని ప్రాక్టికల్ గా టెస్ట్ చేస్తే mostly 10 డివైజెస్ కు కనెక్ట్ అవుతుంది ఇబ్బందులు లేకుండా. క్రింద డివైజ్ కు 6 ఫోనులు కనెక్ట్ చేసినప్పుడు ఉన్న డౌన్లోడ్ మరియు బ్రౌజింగ్ స్పిడ్స్ మరియు 11 ఫోనులకు కనెక్ట్ చేసినప్పుడు ఉన్న స్పిడ్స్ ను చూడగలరు..
కేవలం ఒక్క డివైజ్ మాత్రమే కనెక్ట్ చేసి ఫుల్ HD వీడియో ను చూస్తుంటే బఫరింగ్ లేకుండా WiPod డౌన్లోడ్ స్పీడ్ 35.5Mbps, uplink స్పీడ్ 6.9Mbps వచ్చింది. Ping – 65ms ఉంది.
6 ఫోనులకు కనెక్ట్ చేసి FHD వీడియోస్ ప్లే చేసుకుంటే, 23.3Mbps వస్తుంది డౌన్లోడ్ స్పీడ్, uplink స్పీడ్ 4.4Mbps అండ్ Ping 65ms. ఇక్కడ ఏ ఒక్క డివైజ్ లో కూడా వీడియోస్ బఫర్ అవ్వలేదు. ఈ ఆరింటిలో ఒక డివైజ్ లో 1GB ఫైల్ కూడా డౌన్లోడ్ అవుతుంది parallel గా అదే Jio 4G కనెక్షన్ లో.
11 డివైజెస్(డివైజెస్ అని ఎందుకు అంటున్నా అంటే dongle కు కనెక్ట్ అయ్యే వాటిలో కేవలం స్మార్ట్ ఫోనులే కాదు, లాప్ టాప్స్, టాబ్లెట్స్, స్మార్ట్ టీవీ లు కూడా ఉన్నాయి) కనెక్ట్ చేసి ఫుల్ HD వీడియోస్ చూస్తే 5 డివైజెస్ పై బఫరింగ్ లేకుండా అవుతుంది. మిగిలిన 5 లో బఫరింగ్ ఉంది కొద్దిగా. మరో డివైజ్ లో అప్ లోడ్ జరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు 9.9Mbps డౌన్లోడ్ స్పీడ్ మరియు 5.8Mbps అప్ లోడ్ స్పీడ్ ఉంది. పింగ్ 158ms ఉంది.
సరే సిగ్నల్ రేంజ్ ఏలా ఉంది?
concrete మరియు గ్లాస్ వాల్స్ ద్వారా 27 అడుగులు వరకూ వస్తుంది సిగ్నల్. refrigerator పక్కన పెడితే 21 అడుగులు వస్తుంది రేంజ్. అలాగే రెండు ఒక ఫ్లోర్ లో పెట్టి మరో ఫ్లోర్ లోకి వెళ్లి చూస్తె సిగ్నల్ అందటం లేదు.
బ్యాటరీ లైఫ్
అవును దీనికి బ్యాటరీ ఉంది. అంటే పాకెట్ లో పెట్టుకొని ఎక్కడికైనా వెళ్లి వాడుకోగలరు outdoor లో కూడా. అదే సిమ్ ఫోన్ లో వేసుకొని వాడుకోవచ్చుగా, సెపరేట్ గా మరొక డివైజ్ ను పాకెట్ లో పెట్టుకొని మరీ WiFi ద్వారా వాడుకోవటం ఎందుకు?
మొబైల్ ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్ వాడితే ఫోన్ బ్యాటరీ చాలా తొందరగా అయిపోతుంది. WiFi ద్వారా ఇంటర్నెట్ వాడితే మొబైల్ నెట్ కన్నా ఎక్కువ బ్యాటరీ బ్యాక్ అప్ వస్తుంది.
అయితే పూర్తిగా టెస్ట్ అవలేదు. ఇంకా ప్రోసెస్ లో ఉంది. అయితే Jio LTE WiPod ను కంటిన్యూస్ గా వాడితే 5 నుండి 6 గంటలు వస్తుంది బ్యాక్ అప్ వస్తుంది అని చెబుతుంది కంపెని. అయితే మరిచిపోకండి, మీరు డైరెక్ట్ గా పవర్ కు కనెక్ట్ చేసి కూడా వాడుకోగలరు. కాని ఆశ్చర్యంగా 5 డివైజెస్ కు కనెక్ట్ చేస్తూ వాడితే 12 గంటలు పాటు వచ్చింది బ్యాక్ అప్. చాలా బాగుంది అని చెప్పాలి. దీనిని మైక్రో USB తో చార్జింగ్ చేసుకోగలరు.
సో ఫైనల్ గా బాటం లైన్ ఏంటి?
కనెక్టివిటీ, రేంజ్ ,స్పీడ్, బ్యాటరీ అన్నీ చూస్తే Jio LTE WiPod మొబైల్ హాట్ స్పాట్ లేదా dongle అన్ని విధాలుగా చాలా బాగుంది. కేవలం ఒకే ఒక మైనస్ ఉంది. అదీ కూడా మైనస్ కాదు దీని సైజ్ ను దృష్టిలో పెట్టుకుంటే, ఒక ఫ్లోర్ నుండి మరొక ఫ్లోర్ లోకి సిగ్నల్ అంత ఫ్రీ గా అందటం లేదు. అయితే ఇది మరలా అందరికీ వర్తించదు, అందరీ home/floors ఒకేలా ఉండవుగా కదా!
ఇంతకీ దీని ప్రైస్ ఎంతో చెప్పలేదు? – దీని ప్రైస్ ప్రస్తుతం 2,899 రూ.డైరెక్ట్ గా రిలయన్స్ అన్ని స్టోర్స్ లోకి వెళ్లి డివైజ్ కొనగలరు. డివైజ్ తో పాటు సిమ్ ఇస్తారు, ఆధర్ కార్డ్ మరియు ఫోటో సబ్మిట్ చేస్తే. ఈ లింక్ లో JioFi WiPod డివైజ్ గురించి మరింత అఫీషియల్ సమాచారం తెలుసుకోగలరు. ఈ లింక్ పై క్లిక్ చేస్తే నన్ను ఫేస్ బుక్ లో ఫాలో అవగలరు.
Jio పై ఉన్న మోస్ట్ కామన్ ప్రశ్నలు వాటికీ జవాబులు – ఈ లింక్ లో తెలుసుకోండి
టోటల్ Jio అండ్ ఆఫర్ కొరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి ఈ లింక్ లోకి వెళ్ళండి
Buy Lyf Flame 8 at Rs. 4199 on Flipkart
Buy Lyf Wind 3 at Rs. 6999 on Flipkart
Buy Lyf Flame 2 at Rs. 3998 on Flipkart