ఆండ్రాయిడ్ ఫంక్షన్స్ మరియు విండోస్ యూజర్ ఇంటర్ఫేస్ తో మార్కెట్ లోకి కొత్త OS
ఇది PC లలో ఆండ్రాయిడ్ ను అందిస్తుంది
స్మార్ట్ ఫోన్ లో ఉండే functionality ను PC లోకి తెస్తూ కంప్యుటర్ లో కూడా ఆండ్రాయిడ్ OS రన్ అవుతూ ఉంటే ఎలా ఉంటుంది. ఇందుకు కొన్ని ఉదాహరణలే బ్లూ స్టాక్స్ వంటి సర్వీసెస్.
ఇప్పుడు విండోస్ లేదా మాక్ ఓస్ వంటి యూసర్ ఇంటర్ఫేస్ తో ఆండ్రాయిడ్ functionality కలిగి ఉన్న కంప్యుటర్ ఉంటే ఏలా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఇమాజినేషన్ మరియు మరిన్ని ఫీచర్స్ తో Jide టెక్నాలజీ ముందుకు వస్తుంది.
గూగల్ నుండి ఉద్యోగాలను మానేసి కొంత మంది బృందం గా ఏర్పడి వెరీ స్పెషల్ ఆపరేటింగ్ సిస్టం ను తయారు చేశారు. దీని పేరు Remix OS for PC.
ఇంటెల్ ప్రాసెసర్లు ఉన్న pc లు మరియు ఆపిల్ మాక్ లాప్ టాప్స్ పై రన్ అవుతుంది ఇది. పేరుకు తగ్గట్టుగానే ఇది అన్నీ os లను కలుపుకొని వస్తుంది.
అన్నిటికన్నా హై లైట్ విషయం ఆండ్రాయిడ్ ఓస్ లో ఉన్న ప్లే స్టోర్ సపోర్ట్ తో రావటం. అంటే 1.6 మిలియన్ల యాప్స్ దీనిలో పని చేస్తాయి.
దీనిని పెన్ డ్రైవ్ లో ఇంస్టాల్ చేసుకొని లాప్ టాప్ కు కనేక్ట్ చేసినా ఓస్ ను లోడ్ చేయగలరు. అయితే x86 ఆర్కిటెక్చర్ చిప్ సెట్స్ పై మాత్రమే పనిచేస్తుంది.
86 ఆర్కిటెక్చర్ అనేది మొదటిలో ఇంటెల్ 8086 మరియు 8088 CPU వేరియంట్స్ పై ఉండేది, ఇప్పుడు Cyrix, AMD, via మోదలగు వాటిపై కూడా రన్ అవుతున్నాయి.
లాలిపాప్ బేస్డ్ custom వెర్షన్ తో remix 2.0 తో వస్తుంది. ఇది బాగా పనిచేయటానికి మినిమమ్ usb 3.0 ఫ్లాష్ డ్రైవ్ with FAT32 ఫార్మాట్ అండ్ 20MB/s రైటింగ్ స్పీడ్ కలిగిన 8gb స్టోరేజ్ డ్రైవ్ రిక్వైర్మెంట్స్.
ui లో టాస్క్ బార్, స్టార్ట్ మెనూ సిస్టం ట్రే తో పాటు రైట్ సైట్ డెస్క్ టాప్ లో నోటిఫికేషన్స్ కూడా ఉండనున్నాయి. టాస్క్ బార్ అనేది యాప్స్ ను switch చేసుకోవటానికి. టచ్ స్క్రీన్ లాప్ టాప్స్ ఉంటె స్వైప్స్ కూడా బాగా పనిచేస్తాయి కొత్త ఫీచర్స్ తో.
సాఫ్త్వ్ వేర్ పరంగా ఫైల్ మేనేజర్, ఆండ్రాయిడ్ ఆఫీస్, గూగల్ ప్లే సపోర్ట్ తో వస్తున్నాయి. సింప్లిసిటి, intuition అండ్ vitality ప్రిన్సిపల్స్ తో REMIX ఓస్ 2.0 తయారు చేయబడింది.
జనవరి 12 వ తారిఖు నుండి ఇది అందుబాటులోకి వస్తుంది. ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఫ్యూచర్ లో వచ్చే ఓస్ అప్ డేట్స్ కూడా ఫ్రీ గా అప్ గ్రేడ్ చేసుకోగలము. త్వరలోనే దీనిపై రివ్యూ పోస్ట్ చేస్తాము.