Surface ప్రో 4 తో మా ఎక్పిరియన్స్..
మేము వాడిన మోడల్ కు టైప్ కవర్ కీ బోర్డ్ ఉంది క్లోస్డ్ ఫ్లాప్ తో. అది తీయగానే, లాక్ స్క్రీన్ ఉంది, వెంటనే అకౌంట్ పై క్లిక్ చేస్తే Hello అనే మెసేజ్ తో ఓపెన్ అయ్యింది.
అకౌంట్ హోల్డర్ ఫేస్ ను ఐరిస్ స్కాన్ చేస్తే, డివైజ్ అన్ లాక్ అయ్యింది. కళ్ళు మూసి ఉంటే మాత్రం పని చేయటంలేదు. జస్ట్ ట్రై చేశాము.
చేతిలోకి డివైజ్ రాగానే ముందుగా కనిపించేది సర్ ఫేస్ పెన్. డివైజ్ కు సైడ్స్ లో వెర్టికల్ గా మాగ్నెటిక్ ద్వారా స్టిక్ అయ్యి place చేయబడింది.
దాని పైన eraser కూడా ఉంది. అంటే పైన క్లిక్ చేస్తే క్రింద వ్రాసిన దానిని erase చేస్తుంది పెన్. పెన్ లోనే రకరకాల క్లిక్స్ వివిధ యాక్షన్స్ ఉన్నాయి.
నెక్స్ట్ కార్టనా కు ఇంటర్నెట్ / calibration / ambient noise ప్రాబ్లెం తో ఉందో తెలియలేదు కాని కొన్ని రిక్వెస్ట్ లను వినటానికి నిరాకరించింది పెన్. అయితే ఇది పెద్ద విషయం కాదు, గతంలోనే సత్య నాదెళ్ళ కే స్టేజ్ పై మొరాయించింది.
పెన్ సర్ ఫేస్ పై చాలా మంచి ఫీల్ ఇస్తుంది. ఫ్రిక్షన్ బాగుంది. రియల్ పెన్ లా అనిపించకపోయినా, మంచి ఫీల్ ఇస్తుంది పెన్ తో పని చేసేటప్పుడు. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే .. ink మరింత మందంగా వస్తుంది.
మొత్తం యూనిట్ లో ఫర్స్ట్ టైమ్ పెన్ నోటిస్ చేస్తే, కీ బోర్డ్ పై ఫర్స్ట్ పని చేస్తారు చూసిన వెంటనే. tactile ఫీడ్ బ్యాక్ బాగుంది.chiclet కీ బోర్డ్ బాగా ప్లేస్ చేసింది కీస్ ను. వెనుక లైట్ కూడా వెలుగుతుంది.
బ్యాక్ లైట్ వెలిగితే దాని కోసం పవర్ టాబ్లెట్ నుండి తీసుకుంటుంది కీ బోర్డ్. కాని కొంచెం ప్రెసర్ తో టైప్ చేస్తే కీ బోర్డ్ బెండ్ అవటం కూడా జరుగుతుంది.
క్విక్ స్టాండ్ బాగుంది. మీరు angle సెట్ చేసి పెడితే వెంటనే హోల్డ్ అవుతుంది. డెస్క్ టాప్ గా బాగుంటుంది. కాని లాప్ టాప్ లా వాడటనికి కొంచెం కరెక్ట్ గా ఫిట్ అయి నట్టు అనిపించదు.
కీ బోర్డ్ కవర్ తీసి వేసిన వెంటనే, టాబ్లెట్ PC మోడ్ నుండి టాబ్లెట్ మోడ్ కు ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఫిక్సింగ్ అండ్ departing అప్పుడు మాగ్నెటిక్ బాగా వర్క్ అవుతుంది. సరిగా ప్లేస్ చేసామా అని ప్రత్యేక శ్రద్ద అవసరం లేదు.
బిల్డ్ వైజ్ గా స్ట్రాంగ్ గా ఉంది. అంతా magnesium బాడీ. ప్రేమియం గా ఉంటుంది. టచ్ చేయటానికి కూడా ఫీల్ బాగుంది. దీనిలో ఇంటెల్ 6th gen i5 or i7 CPU, 4gb నుండి 16gb ర్యామ్ 766 నుండి 786 గ్రా బరువుతో ఉంది.