ఆన్ లైన్ బ్యాంకింగ్ అకౌంట్ లేకుండా & చేతిలో కాష్ లేకుండా మీరు online పనులను చేసుకోగలరు ఇలా
ఇండియాలో 500 మరియు 1000 రూ నోట్స్ బాన్ కారణంగా చేతిలో నిత్యావసరాలకు కూడా కాష్ లేకపోవటం లేదా urgency అవసరాలకు మాత్రమే వాడుకునేలా తక్కువ కాష్ ఉండటం ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న పరిస్థితి.
ఆన్లైన్ పేమెంట్స్ తో ఇదివరుకే online షాపింగ్ చేసిన వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కాని online బ్యాంకింగ్ అకౌంట్ లేక డైలీ నీడ్స్ లో కొన్ని అయినా ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేయలేక బాధపడుతున్నారు కొందరు.
అయితే ఆన్ లైన్ పేమెంట్స్ చేయటానికి మీ బ్యాంకు అకౌంట్ కు online బ్యాంకింగ్ అకౌంట్ లేకపోయినా ఫర్వాలేదు. మీరు బ్యాంకు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన atm డెబిట్ కార్డ్ తో కూడా పేమెంట్స్ చేయగలరు.
కాకపొతే 98% బ్యాంక్స్ అన్నీ మీ కార్డ్ పై VISA అని వ్రాసి ఉన్న atm కార్డ్స్ కే online payments అనుమతి ఇస్తున్నాయి. సో మీ వద్ద ఉన్న కార్డ్ పనిచేయలేదు అంటే దాని పై VISA అని వ్రాసి లేదేమో చూడండి లేదా కార్డ్ expiry అయిపోయి ఉండుండాలి. అలాగని ఓల్డ్ Maestro కార్డ్ పై అస్సలు ఎటువంటి పేమెంట్స్ జరగవు అనటానికి లేదు. కాకపోతే చాలా లిమిటెడ్ ఆన్ లైన్ సేవలు మాత్రమే జరిగే అవకాశాలున్నాయి ఓల్డ్ కార్డ్స్ తో.
డెబిట్ కార్డ్ తో పేమెంట్ ఎలా చేయాలి?
మీ VISA డిబేట్ కార్డ్ పై ఉండే నంబర్, expiry month అండ్ ఇయర్ ఎంటర్ చేసిన తరువాత, కార్డ్ వెనుక కాని లేదా కార్డ్ నంబర్ లో చివర స్పెషల్ గా వ్రాసిన 3 సంఖ్యల నంబర్ ను ఎంటర్ చేస్తే చాలు. దీనిని CVV నంబర్ అని అంటారు. fill చేసి proceed అయితే మీరు ఆ బ్యాంక్ అకౌంట్ కు రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ కు OTP నంబర్ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే ఇక మీ online పేమెంట్ అయిపోయినట్లే.
Online అనే కాదు బయటకు సూపర్ మరెక్ట్ తరహా లో ఉన్న స్టోర్స్ కు వెళ్ళినా మీకు స్టోర్ లో ATM స్వైప్ చేసే మిషన్ ఉంటుంది. సో వారికి కాష్ ఇవ్వకుండా మీరు స్వైపింగ్ ద్వారా కూడా pay చేసి మీ అవసరాలను తీర్చుకోగలరు. ఇవన్నీ బ్యాంక్స్ లేదా atms కు వెళ్లి కాష్ ను తీసుకోలేని వారికి.