NASA శాస్త్రవేత్తలు కొనుగొన్న కొత్త భూమి, Earth 2.0
NASA శాస్త్రవేత్తలు మనుషులు నివసించేందుకు అనువుగా ఉండే మరొక భూమి ని కొనుగోన్నారు. దీనిని Earth 2.0 అని పిలుస్తున్నారు. దీని అసలు పేరు Kepler 452b. Kepler 452 అనే నక్షత్రం కు దగ్గరిలో ఉంది. నాసా స్పేస్ క్రాఫ్ట్, Kepler దీనిని కనుగొన్నాది, కాని ఫోటోగ్రాఫ్ తీయటానికి చాలా దూరంలో ఉండటం వలన కుదరలేదు. దీని గురించి కొన్ని విషయాలు..
Earth కన్నా కొంచెం పెద్దది Earth 2.0
ఎర్త్ యొక్క diameter 12,742 km, ఎర్త్ 2.0 (Kepler 452b) దానికన్నా 60% పెద్దది, 20,000km దీని diameter.
దీనిపై గ్రావిటీ ఎక్కువ
ప్లానెట్ సైజు పెద్దది అయితే గ్రావిటీ కూడా పెద్ద గానే ఉంటుంది. భూమి పై ఉన్న గ్రావిటీ కన్నా రెండు రెంట్లు ఎక్కువ దీనిపై ఉంది. అయితే మనుషుల ఉనికి కోసం మొదట్లో కష్టం ఉన్నా తర్వాత అలవాటు అయిపోతారని శాస్త్రవేత్తల మాట. సూర్యుడు చుట్టూ తిరగటానికి భూమి కన్నా 20 రోజులు ఎక్కువ తీసుకుంటుంది ఎర్త్ 2.0. అంటే Earth 2.0 పై 1 year = 385 days.
Earth 2.0 చుట్టూ తిరుగుతున్నా కేప్లేర్ 452 నక్షత్రం, సూర్యుడు కన్నా1.5 బిలియన్ సంవత్సరాలు పాతది. సో అది ఎర్త్ 1.0 అనుకోవాలి, మన ప్రస్తుత భూమి ఎర్త్ 1.0 అనుకోవాలి. నక్షత్రాల habitable రీజియన్ లో బిలియన్ సంవత్సరాల నుండి ఉండటం వలన ఇది లైఫ్ సపోర్ట్ చేస్తుంది. లేదా ఇంతకుముందు దీనిపై జీవరాసుల ఉనికి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
నాసా లెక్కలు ప్రకారం దీనిపై వాటర్ ఉండవలసిన సరైన ఉష్ణోగ్రతతో ఉంటుంది అని అంచనా. అలాగే వాల్కేనోలు కూడా ఉంటాయి అని అంటున్నారు.
సూర్యుడు కన్నా పాతది అనే కాదు.. ఈ ప్లానెట్ నక్షత్రం సూర్యుని కన్నా ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది. ఇది మొత్తం జీవరాసులుకు మంచి విషయం. కాంతి ఎక్కువ అనేది చెట్లకు మంచి చేస్తుంది, దానితో photosynthesis వలన మనుషుల survival కూడా బాగుంటుంది.
అయితే అసలు విషయం ఏంటంటే దీనిపై కాలు మోపడం చాలా కష్టం. కేప్లేర్ 1400 లైట్ years దూరంలో ఉంది మనకు. లైట్ గంటకు 670 మిలియన్ మైళ్లు దూరం వెళ్ళగలదు. ఒక లైట్ ఇయర్ అంటే ఒక సంవత్సరంలో లైట్ ట్రావెల్ అవ్వగలిగే దూరం. దానిబట్టి మీరు అంచనా వేసుకోండి ఎంత సమయం పడుతుందో దీనిపైకి వెళ్లటానికి. ఆఫ్ కోర్స్ ఉండటానికి అంత అనువుగా ఉంటే మన శాస్త్రవేత్తలు కొత్త స్పేస్ క్రాఫ్ట్ లు కొత్తగా తయారు చేస్తారు అనుకోండి.
గమనిక: ఇక్కడ చూపించిన Kepler 452b ఇమేజెస్ ఒరిజినల్ కాదు. NASA ఆర్టిస్ట్ representations. ఆశక్తి ఉన్నవారు Kepler 452b గురించి అధిక సమాచారం ఇక్కడ పొందండి.