గూగల్ ఫ్యూచర్ ను మార్చేసే టెక్నాలజీ ని తెస్తుంది.

Updated on 01-Jun-2015
HIGHLIGHTS

గూగల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రేజేక్ట్ లతో ఈ సంవత్సరం గూగల్ I/O లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్లను అనౌన్స్ చేసింది.

గూగల్ ప్రతీ సంవత్సరం చేసే Google I/O ఈవెంట్ 2015, మే చివరి వారంలో మొదలైన మొదటి రోజున ఆండ్రాయిడ్ తరువాతి వెర్షన్, ఆండ్రాయిడ్ M ను అనౌన్స్ చేసింది. ఆండ్రాయిడ్ M కొత్త ఫీచర్స్ ఇక్కడ చూడండి.  అయితే రెండవ రోజు గూగల్ అడ్వాన్స్ టెక్నాలజీ కి సంబందించిన కొన్ని ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేసింది.  అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ప్రాజెక్ట్స్ (ATAP) పేరు మీద ప్రపంచానికి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్పింది గూగల్ టీం.

ప్రాజెక్ట్ అరా: దాదాపు ఇది పూర్తి అయిపోయినట్టే.
ప్రాజెక్ట్ అరా అనేది నిజంగా ఫ్యూచర్ అని చెప్పుకోవాలి. మొబైల్ లోని అన్ని విభాగాలను (డిస్ప్లే, కెమేరా, బ్యాటరీ, ప్రాసెసర్, ర్యామ్)  విడివిడిగా హార్డువేర్ ను మనం మనకి నచ్చినట్టుగా కలిపి జాయిన్ చేసుకొని మనకు నచ్చిన స్పెసిఫికేషన్స్ తో కొత్త మొబైల్ ని తయారు చేసుకోవడమే ప్రాజెక్ట్ అరా. ఇది ఎప్పటినుండో టెక్ ప్రియులు ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్.
 
                               

ఇప్పుడు గూగల్ ATAP టీం మార్కెట్ లో విడుదల చేయాటానికి రెడీ గా ఉన్నారు. డెవలప్మెంట్ అంతా పూర్తి అయిన ఈ ప్రాజెక్ట్ అరా మొబైల్ హాండ్ సెట్ ను డెమో చేసి చూపించారు. ఈ డెమో లో అరా ఫోన్ వాడి వదిలేసిన ఎలెక్ట్రానిక్ స్క్రాప్ నుండి ఎసేమ్బెల్ చేసి చూపించారు. బ్యాటరీ మాడ్యూల్ ను చివరిలో తగిలించి ఆన్ చేసి చూపించింది ATAP టీం. ఏది ఏమైనా ఇది త్వరలోనే మార్కెట్లోకి రానుంది అని రెండవ రోజు జరిగిన గూగల్ ఈవెంట్ లో ప్రపంచానికి తెలిసింది.

ప్రాజెక్ట్ వాల్ట్: అతి చిన్న సైజ్ సెక్యురిటి.
క్లుప్తంగా చెప్పాలంటే, మైక్రో ఎస్డి కార్డ్ సైజులో ఉండే సేక్యుర్డ్ కంప్యూటర్ ఇది. మైక్రో ఎస్డి కార్డ్ సైజ్ ఫార్మ్ ఫేక్టర్ ను ఎంచుకొని దానిని విండోస్, లైనక్స్, OS x, మరియు ఆండ్రాయిడ్ పై కూడా పనిచేసే విధంగా తయారు చేయబడింది. మీ సిమ్ కార్డ్ మీ నెట్వర్క్ కు సంబంధించి మీ డేటా ను ఎలా ప్రటేక్ట్ చేస్తుందో, ఈ వాల్ట్ కూడా మీ కంప్యూటర్ కు అదే సేక్యుర్డ్ డేటా ను మెయిన్ టెయిన్ చేస్తుంది.
                              
వాల్ట్ కి 4 జిబి స్టోరేజ్ ఉంది. ARM ప్రాసెసర్ పై పనిచేస్తుంది. దీనికి సొంత ప్రాసెసర్, NFC అతేంటికేషన్ జోడించారు. వాల్ట్ ను వాడుకునేందుకు అదనంగా ఎటువంటి డెవలప్మెంట్ అవసరం లేదని స్పష్టం చేసింది ATAP బృందం.

ప్రాజెక్ట్ సోలి: 
ఇది మనం మొబైల్స్ ను వాడే పద్దతిని మార్చనుంది. టచ్ చేయకుండా కేవలం గాలిలో చేయిని కదిపితే చాలు మీ మొబైల్ లోని పనులు జరిగిపోతాయి. ఇది కేవలం మొబైల్స్ కి మాత్రమే కాదు, అన్ని స్మార్ట్ డివైజ్ లకు పనిచేస్తుంది. క్రింద వీడియో చుస్తే మీకు అంతా అర్థమవుతుంది.

                               

ఈ సంవత్సరం చివరికి అల్లా ఇది ఆండ్రాయిడ్ వేర్ ల పై రానుంది అని చెబుతుంది గూగల్.

ప్రాజెక్ట్ జాక్వార్డ్: 
ఇది మనం వేసుకునే బట్టలను ఉపయోగించి మన స్మార్ట్ డివైజ్ లను ఆపరేట్ చేయటానికి పనిచేస్తున్న ప్రాజెక్ట్. మనం ఎటువంటి స్క్రీన్స్ మరియు హార్డ్ వేర్ లను తాక కుండా, కేవలం మనం వేసుకునే షార్ట్ ఫ్యాబ్రిక్ నుండి అన్ని పనులు చేసుకునే టెక్నాలజీ రెండవ రోజు జరిగిన ఈవెంట్ లో క్రేజిఎస్ట్ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకుంది. దీని కోసం గూగల్ లెవైస్ బట్టల బ్రాండ్ తో మంతనాలు జరుపుతుంది.
 

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably.

Connect On :