ఫేస్ బుక్ Free Basics అంటే ఏంటి? అసలు దీని అవసరం ఉందా మనకు? ఫేస్ బుక్ కు దీనితో ఏమైనా లాభం ఉందా?

ఫేస్ బుక్ Free Basics అంటే ఏంటి? అసలు దీని అవసరం ఉందా మనకు? ఫేస్ బుక్ కు దీనితో ఏమైనా లాభం ఉందా?
HIGHLIGHTS

సింపుల్ అండ్ కంప్లీట్ అనాలిసిస్

ఫేస్ బుక్ రీసెంట్ గా ఫ్రీ బేసిక్స్ అని చాలా ప్రచారం చేస్తుంది. ఇంటర్నెట్ లో లేదా బయట హోర్డింగ్స్ లో టీవీ లను ఎక్కువ చూసే వారికీ ఫ్రీ బేసిక్స్ ను పరిచయం చేయనవసరం లేదు. కాని అసలు ఇది ఏంటి, ఎందుకు అనే క్లారిటీ ఇవనున్నాను.

facebook free basics అంటే ?

ఇది ఫేస్ బుక్ తయారు చేసిన ప్రాజెక్ట్. పర్టికులర్ గా ఇండియాలో దీనిని ప్రభావం ఉండాలని ఫేస్ బుక్ అధినేత పట్టుబట్టారు. ఇంటర్నెట్ ను అందరికీ అందాలి. ఇంటిలోని ఆడవారికి కూడా అనే ఉద్దేశమే ఫ్రీ బేసిక్స్. ఇందుకు ఫేస్ బుక్ ఫ్రీ ఇంటర్నెట్ ను ఇస్తుంది.

ఏలా పని చేస్తుంది?
ఫేస్ బుక్ తయారు చేసిన ఒక యాప్ ద్వారా మీరు కొన్ని వెబ్ సైట్స్ అండ్ సర్వీసెస్ ను ఫ్రీ గా ఇంటర్నెట్ చార్జెస్ ఏమీ లేకుండా వాడుకోగలరు. అయితే ప్రస్తుతానికి యాప్ రిలయన్స్ నెట్ వర్క్ లోనే పనిచేస్తుంది. అంటే రిలయన్స్ సిమ్ ఉంటేనే మీరు ఈ యాప్ ద్వారా ఫ్రీ ఇంటర్నెట్ ను ఆనందించగలరు.

అయితే ఇండియన్ టెలికాం రేగులేటరీ అథారిటీ రిలియన్స్ ను ప్రస్తుతం ఈ యాప్ సర్వీస్ ను టెంపరరీ గా నిలిపివేయమని చెప్పింది. సో రిలయన్స్ పైన కూడా పని చేయటం లేదు.

ఎందుకు ఆపేసారు?
TOI రిపోర్ట్స్ ప్రకారం.. "టెలికాం ఆపరేటర్ కు డిఫరెంట్ కంటెంట్ కొరకు డిఫరెంట్ ప్రైసెస్ పెట్టే అర్హత ఉందా అనే ప్రశ్నకు సమాధానం వచ్చే వరకూ దీనిని కొనసాగించటం సరైన నిర్ణయం కాదు" అని TRAI చెబుతుంది.

ఇది తిరిగి పని చేయటానికి TRAI డిసెంబర్ 31 లోగా ఫ్రీ బేసిక్స్ పై కామెంట్స్ అండ్ సపోర్ట్ చేసే వాళ్ళను వోట్ చేయమని డెడ్ లైన్ పెట్టింది.

పేపర్స్ లో యాడ్స్, సోషల్ నెట్ వర్కింగ్ లో స్టేటస్ అప్ డేట్స్, టీవీ యాడ్స్ అన్నీ ఈ డెడ్ లైన్ లోపు అందరికీ అవగాహన తేవటానికే. మార్క్ ఇదే విషయం కొరకు ఇండియా కూడా వద్దామని అనుకున్నారు.

అయితే ఫేస్ బుక్ నిజానికి ఇంటర్నెట్ సౌలభ్యం లేని వారి కోసం ఇంటర్నెట్ అందించే ప్రయతం చేస్తున్నప్పటికీ వారి యాడ్స్ అన్నీ ఇంటర్నెట్ లేని వారికీ కాకుండా ఆల్రెడీ ఇంటర్నెట్ ను వాడుతున్న వారికీ చేరుతున్నాయి..

అసలు మనకు ఫ్రీ బేసిక్స్ అవసరం ఉందా?

ఫ్రీ గా ఇంటర్నెట్ అందిస్తుంటే అవసరం ఉందా అనే ప్రశ్న ఏంటి అని అనుకోకండి! ఫ్రీ బేసిక్స్ యాడ్స్ లోని స్టాటిస్టిక్స్ ప్రకారం దీనిని 86 శాతం ఇండియన్స్ సపోర్ట్ చేస్తున్నారని ఫేస్ బుక్ చెబుతుంది.. అయితే వాస్తవానికి మనకు ఫ్రీ బేసిక్స్ అవసరం లేదు!

ఇండియాలో ఇంటర్నెట్ వినియోగం 2015 మొదటి 6 నెలల వ్యవధిలో 17 శాతం గ్రోత్ చూసింది. 2014 లో 32% అతి fastest గ్రోత్ ను చూసింది.

గత 10 సంవత్సరాలగా ఇంటర్నెట్ శాతం నెమ్మదిగా పెరుగుతుంది. 10 నుండి 100 మిలియన్ల వరకూ వెళ్ళటానికి 10 సంవత్సరాల పట్టింది.

ఆ తరువాత 3 ఇయర్స్ లో 200 మిలియన్స్ కు వెళ్ళింది. ఇప్పుడు కేవలం ఒక్క సంవత్సరంలోనే ఇంటర్నెట్ వినియోగం 300 మిలియన్స్ కు వేల్లనుంది.

ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోషియేషన్(IMAI) రిపోర్ట్స్ ప్రకారం ఇంటర్నెట్ గ్రోత్ లో రూరల్ ఇండియా నుండి 75 శాతం పార్టిసిపేషన్ ఉంది. అర్బన్ ఇండియా నుండి 16 శాతం పార్టిసిపేషన్ ఉంది.

సో ఇండియా ఆల్రెడీ ఇంటర్నెట్ వినియోగంలో చాలా ఫాస్ట్ గ్రోత్ రేట్ తో ఉంది. ప్రత్యేకంగా ఫ్రీ ఇంటర్నెట్ అనేది అవసరం లేదు. పైన చెప్పుకున్న లెక్కలను చూస్తే ఇప్పుడున్న పరిస్తితులలో ఇండియాకు ఫేస్ బుక్ లేదా ఫ్రీ బేసిక్స్ ను వృద్ది చేయటం వంటివి అవసరం లేదు..

Low ఎండ్ cost లో స్మార్ట్ ఫోన్స్ మరియు లోకల్ లాంగ్వేజ్ కంటెంట్ వ్యాప్తి చెందటం వంటి మెయిన్ అవసరాలు ఉన్నాయి. ఇది ఒపినియన్ కాదు ఇండియన్ ఇంటర్నెట్ వినియోగం లోని గ్రోత్ లెక్కల ప్రకారం స్పష్టంగా తెలుస్తున్న విషయం. అయినా కేవలం ఫ్రీ ఇంటర్నెట్ సేవలు ఉంటే ఇండియా భవిష్యత్తు డిజిటల్ గా transform అవుతుందా?

ఫ్రీ బేసిక్స్ లో ఏమి ఏమి పని చేయవు..
1. 200KB కన్నా ఎక్కువైన VoIP, వీడియో, ఫోటోస్ అండ్ ఫైల్ ట్రాన్స్ ఫర్ పని చేయవు. 
2. మొదటి పాయింట్ లో చెప్పిన రూల్స్ అధిగమించి పోస్ట్స్ పెడితే వెబ్ సైట్స్ కూడా బ్లాక్ అవుతాయి.
3. జావా స్క్రిప్ట్ వంటి సెక్యూర్ కంటెంట్ సపోర్ట్ లేదు.
4. urls అన్నీ వేరే domian ద్వారా re written అవుతాయి. embedded content కూడా రిమూవ్ అవుతుంది.

అంటే వీడియోస్ చూడటం, వీడియో కాలింగ్, ఫైల్ షేరింగ్, క్వాలిటీ ఇమేజెస్ viewing ఏమీ ఉండవు ఫ్రీ బేసిక్స్ లో. అలాగే బ్యాంకింగ్ సెక్యూర్ మనీ రిలేటెడ్ transactions కూడా ఉండవు. అసలు ఫ్రీ బేసిక్స్ "ఇంటర్నెట్ ఫ్రీడమ్" అనే పాయింట్ నుండే గా వచ్చింది.. మరి ఈ లిమిటేషన్స్ అన్నీ ఏంటి?

మరి ఫేస్ బుక్ ఎందుకు ఇంత పట్టుబడుతుంది ఫ్రీ బేసిక్స్ కోసం?
1. దీని వలన ఫేస్ బుక్ కు ఇంటర్నెట్ ప్రపంచం పై ఎన్నడూ లేనంత పవర్ వస్తుంది. కంపెని ఫ్రీ బేసిక్స్ లో యాడ్స్ ఉండవు అని చెబుతుంది కాని గైడ్ లైన్స్ లో ఫేస్ బుక్ మార్కెటింగ్ కొరకు ఎవరి ఇన్ఫర్మేషన్ ను అయినా వాడే ముందు user ను అడిగి చేస్తామని ఉంది.

2. అంత పెద్ద ప్లాట్ఫారం పై ఫ్రీ మార్కెటింగ్ ఎవరూ కాదు అని అంటారు? అడిగినప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారు. ఇది ఫ్రీ గా జరిగే పబ్లిసిటీ అవటం వలన తరువాతి దశలో బిజినెస్ ఉన్న వారు ఫేస్ బుక్ కు డబ్బులిచ్చి మరీ యాడ్స్ ప్రియారిటీ పెంచునే ప్రయత్నాలు చేస్తారు.

3. ఫ్రీ అనే కాన్సెప్ట్ లో పెద్ద ప్లాట్ఫారం గా మారుతుంది ఫేస్ బుక్. విపరీతమైన ట్రాఫిక్ కూడా ఉంటుంది కారణం వాడే వారికీ, పబ్లిసిటి చేసేవారికి అందరికీ ఇది ఫ్రీ. ఫేస్ బుక్ ఈ ఆలోచనలతో ఉందో లేదో మనం చెప్పలేము కాని ఇలాంటి పరిస్థితులు మాత్రం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.

పోనీ ఫ్రీ బేసిక్స్ లో డేటా సెక్యూర్ గా ఉంటుందా?
దీని లోపల ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం డెవలపర్స్ వెబ్ సైట్ కంటెంట్ ఫేస్ బుక్ సర్వర్స్ నుండి వెళ్తుంది. అంటే ఫ్రీ బేసిక్స్ లో వెబ్ సైట్ వాడితే టెంపరరీ గా మీ డేటా కూడా decrypt అయ్యి ఉంటుంది. డేటా encrypt అయ్యి ఉంటే సెక్యూర్. decryption అంటే మన పాస్ వర్డ్స్ లేదా ఇతర సమాచారం అన్నీ డైరెక్ట్ గా సర్వర్స్ లో తిరుగుతాయి. అంటే సెక్యూరిటీ కూడా లేదు.

సో ఇదీ ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ టోటల్ స్టోరీ. ఈ పోస్ట్ పై మీ కామెంట్స్ (సైట్ అండ్ fb పేజ్ లో కూడా) తెలియజేయండి.
 

 

 

Adamya Sharma

Adamya Sharma

Managing editor, Digit.in - News Junkie, Movie Buff, Tech Whizz! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo