ఎక్కువ శాతం chrome బ్రౌజర్ ను వాడుతుంటారు. కారణం చూడటానికి చాలా మినిమల్ గా క్లీన్ గా ఉంటుంది అనే భావన కలిగిస్తుంది.
అయితే chrome ఎక్కువ టాబ్స్ ఓపెన్ చేస్తే బాగా స్లో గా ఉంటుంది. ఎంత స్లో అంటే 'ఇది PC స్లో నా లేక chrome slow' అనే డౌట్ తీసుకువస్తుంది.
అలాగని firefox వాడుదామంటే chrome అలవాటు అయిన extensions దీనిలో ఉన్నాయో లేదా అనే ప్రశ్న. ఇక నుండి మీరు chrome ఎక్స్టెన్షన్స్ ను firefox లో కూడా వాడుకోగలరు..
Chrome Store Foxified అనే firefox extension ను ఇంస్టాల్ చేసుకోండి firefox బ్రౌజర్ లో. chrome లో మీకు నచ్చే extensions అన్నీ దీనిలో కూడా వాడగలరు ఇక.
స్మాల్ టిప్: బ్రౌజర్ లో దీనిని యాడ్ చేసుకునే ముందు addons.mozilla.org అనే లింక్ లోకి వెళ్లి free అకౌంట్ క్రియేట్ చేసుకొని, sign-in అవ్వండి. లేదంటే ఎక్స్టెన్షన్ ప్రతీ సారి రిమూవ్ అవుతుంది.