మీరు డిజిట్ వెబ్ సైట్ మాత్రమనే కాకుండా ఇతర వెబ్ సైట్స్ ను చూడటనికి ఫోన్ లో chrome బ్రౌజర్ యాప్ వాడుతుంటారా? అయితే ఇది మీ కోసం వ్రాసే ఆర్టికల్.
జనరల్ గా సైట్ ఏదైనా బ్రౌజ్ చేస్తుంటే, సైట్ లో ఉండే యాడ్స్ అవి ఉండటం, అనుకోకుండా వాటిపై క్లిక్ చేయటం జరుగుతుంది. ఇది సహజంగా ఇంటర్నెట్ స్పిడ్స్ తక్కువుగా ఉన్న వారికీ జరుగుతుంది.
పూర్తిగా సైట్ load అయ్యే లోపు మనకు కావలసిన దానిపై టాప్ చేసే సరికి సడెన్ గా అదే ప్లేస్ లో యాడ్ రావటం, అప్పుడు మనకు కావలసిన దానికి బదులు యాడ్ ఓపెన్ అవటం వంటివి చిరాకు తెప్పిస్తాయి.
సో దీనికి సొల్యూషన్ గా మీరు chrome url బార్ లో chrome://flags/#enable-scroll-anchoring అనే ఈ text ను కాపీ చేసి పేస్టు చేయండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు chrome యొక్క డెవెలపర్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి.
ఇక్కడ Scroll Anchoring అనే ఆప్షన్ క్రింద default అని ఉంటుంది. దానిని enable చేయండి. ఇక నుండి యాడ్స్ అనే కాదు ఒక దానికి బదులు వేరే లింక్ పై టాప్ చేసే అవకాశాలు రావు.
జనరల్ గా chrome://flags అని కాపీ పేస్టు చేసి చూస్తె క్రోమ్ డెవలపర్ సెట్టింగ్స్ అన్నీ కనిపిస్తాయి.