PC ఆండ్రాయిడ్ OS REMIX 2.0 రివ్యూ

PC ఆండ్రాయిడ్ OS REMIX 2.0 రివ్యూ

Remix OS అనే పేరుతో డెస్క్ టాప్ పై ఆండ్రాయిడ్ os ను వాడుకోవటానికి కొత్త ఓపెన్ సోర్స్ os రిలీజ్ అయ్యింది. ఇది ఎవరైనా ఫ్రీ గా అఫిషియల్ వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని వాడుకోగలరు.

దీనిని నేను వాడటం జరిగింది. సో ఇక్కడ దీనిలో మంచి ఫీచర్స్ తో పాటు ఎటువంటి మైనస్ విషయాలు ఉన్నాయో తెలియజేస్తున్నా..

ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ 5.1 లాలి పాప్ తో వస్తుంది. అంతా బాగుంది సేమ్ ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి. డెస్క్ టాప్ లో యూజర్ ఇంటర్ఫేస్ కూడా బాగా డెవలప్ చేశారు కాని ప్రత్యేకమైన ఆకర్షణ ఉండదు.

క్రింద ఉండే టాస్క్ బార్ లో రైట్ సైడ్ క్రింద నోటిఫికేషన్ బార్ కు ట్రిగ్గర్ ఉంటుంది. మీరు విండోస్ 10 os ను వాడినట్లయితే, సేమ్ దాని వలె ఉంది రీమిక్స్ నోటిఫికేషన్ బార్.

యాప్ డ్రాయర్ అంటూ ఏమి ఉండదు. టాస్క్ బార్ లెఫ్ట్ సైడ్ లో ఆల్ యాప్స్ ను ఓపెన్ చేయటానికి విండోస్ స్టార్ట్ మెనూ లా ఒక ఫోల్డర్ ఉంటుంది. అలాగే దాని పక్కన హోమ్ బటన్, బ్యాక్ అండ్ మెనూ మూడు బటన్స్ ఉన్నాయి అక్కడే.
హోమ పేజ్ డెస్క్ టాప్ పై మీరు ఇంస్టాల్ చేసిన యాప్స్ షార్ట్ కట్స్ పెట్టుకోగలరు. అలాగే widgets కూడా చూపిస్తుంది కాని డెస్క్ టాప్ పై widgets పెట్టుకోవటానికి అవటం లేదు.

స్క్రోలింగ్ చేయాలంటే మౌస్ లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి మౌస్ ను మూవ్ చేయాలి. సెట్టింగ్స్, యాప్స్ అన్నీ విండోస్ os మాదిరిగానే బాక్స్ లే అవుట్స్ లో ఓపెన్ అవుతున్నాయి.

డిఫాల్ట్ గా os తో పాటు ఫైల్ మేనేజర్, బ్రౌజర్, కెమెరా వంటివి వచ్చాయి. మీ లాప్ టాప్ ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది కెమెరా ఆన్ చేస్తే.

అలాగే సెపరేట్ గా os కు సెట్టింగ్స్ అంటూ ఏమి లేవు, కేవలం ఆండ్రాయిడ్ లో చూసే సెట్టింగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అది కూడా చాలా తక్కువ ఉన్నాయి. బ్రైట్ నెస్, ఆటో స్క్రీన్ మాత్రమే ఉన్నాయి డిస్ప్లే సెట్టింగ్స్ లో అయితే.

wifi ఆన్ చేసుకోగలరు. సిమ్ సెట్టింగ్స్ ఉండవు. అలాగే థర్డ్ పార్టీ apk ఫైల్స్ ను కు ఇంస్టాల్ చేసుకోగలరు. ఓవర్ ఆల్ గా లుక్స్ వైజ్ గా creamy స్టైల్ లో ఉంది.

మైనస్..
ప్లే స్టోర్ లేదు. అంటే మీరు ఆండ్రాయిడ్ యాప్స్ ను ఇంస్టాల్ చేయటానికి కుదరదు డిఫాల్ట్ గా. కంపెని ప్లే స్టోర్ జోడించాలంటే గూగల్ నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి ఇందుకు. అందుకే ఓస్ లో ప్లే స్టోర్ ఉండదు.

కానీ మీరు ప్లే స్టోర్ మరియు గూగల్ ప్లే సర్వీసెస్ ను sideload పద్దతిలో ఇంస్టాల్ చేసుకోగలరు remix os లో.

బ్రౌజర్( క్రోమ్ బ్రౌజర్ కాదు) లో వెబ్ బ్రౌజింగ్ చేస్తుంటే చాలా స్లో గా ఉంది. freeze అయిపోతుంది బ్రౌజర్.

ఫీచర్స్ వైజ్ లేదా లుక్స్ వైజ్ గా ఓస్ లో పెద్దగా customise చేసుకోవటానికి ఏమి లేవు. యాప్స్ కూడా లేకపోవటం వలన తొందరగానే బోర్ కొడుతుంది.

 

బాటమ్ లైన్
మీకు WiFi ఉండి యాప్స్ ను ఎక్కువుగా వాడుతూ ఉంటే remix os 2.0 ను వాడుకోవచ్చు. అయితే దీనిని వాడాలంటే మీరు సెపరేట్ గా పెన్ డ్రైవ్ పట్టుకొని తిరగాలి. ఎందుకంటే os పెన్ డ్రైవ్ లోనే ఇంస్టాల్ చేసుకోగలరు. అలాగే విండోస్ లో ఎదో పని ఉంటే remix os ను విడిచి విండోస్ లోకి బూట్ అవ్వాలి.  ఈ పాయింట్ కారణంగా కొన్ని issue లతో ఉన్నప్పటికీ విండోస్ లోనే virutal గానూ లేక సాఫ్ట్ వేర్స్ గానూ ఉన్న ఆండ్రాయిడ్ emulators ప్రిఫరబుల్ అనిపించవచ్చు.

remix os 2.0 ను ఎలా ఇంస్టాల్ చేసుకోవాలి?
1. ముందుగా మినిమమ్ 8gb pen drive ను FAT 32 మోడ్ లో ఫార్మాట్ చేసి ఓస్ ఇమేజ్ ఫైల్ తో పాటు బూటింగ్ టూల్ ను కూడా ఈ లింక్స్ నుండి డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేయండి.

2. బూటింగ్ టూల్ ను ఓపెన్ చేసి, remix os ఇమేజ్ ఫైల్ ను సెలెక్ట్ చేసి, పెన్ డ్రైవ్ ను సెలెక్ట్ చేయాలి టూల్ లో.

3. 15 నిముషాలు తరువాత os పెన్ డ్రైవ్ లో ఇంస్టాల్ అవుతుంది. ఈ పెన్ డ్రైవ్ లో ఫ్రీ స్పేస్ ఉంటే మీ ఇతర ఫైల్స్ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు.

4. మీరు pc కు పెన్ డ్రైవ్ ను కనెక్ట్ చేసి లాప్ టాప్ లేదా pc ను రిస్టార్ట్ చేసిన వెంటనే F10, F12 లేదా F2 బటన్స్ లో ఏదోకటి ప్రెస్ చేసి BOOT MENU లోకి వెళ్ళాలి. డిఫాల్ట్ విండోస్ లేదా ఇతర os లోడ్ అవకముందే ఈ పని చేయాలి.

5. Boot menu లో దేని నుండి బూట్ అవ్వాలి అని లిస్టు చూపిస్తుంది. అక్కడ పెన్ డ్రైవ్ ను సెలెక్ట్ చేసి కంప్యుటర్ ను దాని నుండి బూట్ అవ్వమని సెట్ చేయాలి. ఇందుకోసం BIOS సెట్టింగ్స్ లోకి వేల్లనవసరం లేదు.

6. ఇప్పుడు కంప్యుటర్ రిస్టార్ట్ అయ్యి remix os ను పెన్ డ్రైవ్ నుండి బూట్ చేస్తుంది. ఇక resisdent మోడ్ ను సెలెక్ట్ చేసుకుంటే మీరు remix os ను వాడుదామని అనుకునే ప్రతీ సారి మళ్ళీ os ను సెట్ అప్ చేయనవసరం లేకుండా పని చేస్తుంది remix.

7. Guest మోడ్ సెలెక్ట్ చేస్తే మీరు వాడుదామని అనుకున్న ప్రతీ సారి సెట్ అప్ చేసుకోవాలి os ను. ఈ మోడ్ లో మీరు remix లో సేవ్ చేసిన ఫైల్స్ మరియు సెట్టింగ్స్ కూడా erase అయిపోతాయి.

8. నేను resident సెలెక్ట్ చేసుకున్నాను. మోడ్ సెలెక్ట్ చేసిన తరువాత సుమారు 15 నిముషాలు పాటు os సెట్ అప్ అయ్యి time సెట్టింగ్స్ అడిగి లోడ్ అవుతుంది.

remix os లో ప్లే స్టోర్ ను ఎలా సైడ్ లోడ్ చేయాలి అనేది ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఒక మెథడ్ ఉంది. మీరు దానిని గూగల్ సర్చ్ లో వెతికి తెలుసుకోగలరు. అంటే ప్లే స్టోర్ ను కూడా ఇంస్టాల్ చేసుకోవటానికి అవుతుంది కాబట్టి ఇది వాడుకోవచ్చు, కాని ఇటువంటివి కేవలం ఇంటరెస్ట్ వలన వాడటం మొదలుపెట్టడం జరుగుతుంది కాని లాంగ్ రన్ లో ఎక్కువ కాలం వాడలేము.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo