4RS కు 1GB 4G Airtel ఇంటర్నెట్ ఆఫర్ అని న్యూస్ వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ ఇచ్చిన ఎయిర్టెల్ హెడ్ ఆఫీస్ PR

Updated on 15-Sep-2016

రిలయన్స్ Jio కు పోటీగా Airtel లో 4 రూపాయలకే 1GB 4G ఇంటర్నెట్ డేటా ఆఫర్ అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఈ రోజు. అయితే దీనికి సంబంధించి ఎయిర్టెల్ నుండి మెసేజ్ వచ్చినట్లు కూడా ప్రచారం ఉంది.

మెసేజ్ స్క్రీన్ షాట్స్ ఉండటం వలన చాలా మంది ఇది నిజమా కాదా? నిజమైతే అందరికీ ఇది వస్తుందా లేక కొందరికేనా?. ఇలాంటి కన్ఫ్యూషన్స్ అనేవి ఉంటాయి.. సో ఇక్కడ డిజిట్ తెలుగు రీడర్స్ కు దీనిపై క్లారిటీ ఇవ్వటానికి ఈ ఆర్టికల్ వ్రాయటం జరిగింది.

 కొంతమంది ఇదే ఆఫర్ గురించి నన్ను అడగటం కూడాజరుగుతుంది. అయితే దీనిపై Airtel ముంబై పబ్లిక్ రిలేషన్స్ పర్సన్ ను సంప్రదించగా…

  • ఎయిర్టెల్ PR ఫోన్ సంభాషణలో.. ఇది కేవలం 3G సిమ్ నుండి 4G సిమ్ కు కన్వర్ట్ అయిన వారికి మాత్రమే లభించే ఆఫర్ అని బదులు ఇచ్చారు.
  • కొత్త కస్టమర్ అయినా ఆల్రెడీ ఎయిర్టెల్ వాడుతున్న వారైనా మీ వద్ద ఉన్న 2G /3G సిమ్ కార్డ్ ను 4G సిమ్ కు కన్వర్ట్ చేస్తే 4rs కే 1GB 4G ఇంటర్నెట్ ఆఫర్ వస్తుంది.
  • ఇది కేవలం ఒక్క సారే. onetime ఆఫర్. ఆర్టికల్ లాస్ట్ లో 4G సిమ్ ను సులువుగా ఏలా తీసుకోవాలో తెలపటం జరిగింది.
  • selected కస్టమర్స్ కు కాదు. ఎవరు మారినా ఈ ఆఫర్ వర్తిస్తుంది.
  • చాలా రోజులు క్రితం ఇదే విషయాన్ని తెలపటం జరిగింది. మీరు 4G సిమ్ తీసుకుంటే 1GB ఫ్రీ 4G ఇంటర్నెట్ వస్తుంది తెలిపాను. ఆ స్టోరీ చదవండి ఈ లింక్ లో.
  • అయితే మీరు జాగ్రత్త పడవలసిన విషయం ఒకటి ఉంది. సిమ్ 4G కు కన్వర్ట్ చేసుకొని ఆఫర్ పొందిన తరువాత, ఫోన్ లోని నెట్ వర్క్ సెట్టింగ్స్ లో only 4G అనే ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోకపోతే మీరు ఉన్న వద్ద 4G సిగ్నల్ తగ్గి ఫోన్ ఆటోమాటిక్ గా 3G లోకి వెళ్ళినప్పుడు మీ బాలన్స్ కట్ అయిపోతుంది.
  • అంటే 1GB అనేది కేవలం 4G నెట్ వర్క్ లోనే. 3G లేదా 2G లోకి వెళ్లి ఇంటర్నెట్ వాడితే మీ టాక్ టైమ్ సాధారణం బాలన్స్ కట్ అవుతుంది.
  • అలాగే "Only 4G" పెట్టుకుంటే, 4G సిగ్నల్ లేని ఏరియా లో ఉన్నప్పుడు ఆటోమాటిక్ గా నెట్ వర్క్ 3G/2G సిగ్నల్స్ ను అందుకోదు. అప్పుడు మీకు ఎవరైనా ఫోన్ చేస్తే, సిగ్నల్ అందక మీ నంబర్ పనిచెయకపొవచ్చు.

 

4G సిమ్ ను చాలా ఈజీ గా తీసుకోగలరు..

  • ఈ లింక్ లోకి వెళ్లి ఫార్మ్ ఫిల్ చేస్తే మీ ఇంటికి వచ్చి మరీ కొత్త 4G సిమ్ ఇస్తారు ఎయిర్టెల్ సిబ్బంది. కొన్ని దూర ప్రాంతాలకు free పోస్టల్ డెలివరీ చేస్తుంది.
  • కొత్తగా ఈ ఆఫర్ ను ఆనందించటానికి ఎయిర్టెల్ సిమ్ తీసుకునే వారికీ కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.

దీనిపై వారు మరింత సమాచారం ఇస్తే ఇక్కడ అప్ డేట్ చేయటం జరుగుతుంది. దయచేసి స్టోరీ పై మీ కామెంట్స్ ను తెలపగలరు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :