డైలీ usage లో వాడే 7 టెక్నాలజీ ఇన్వెన్షన్స్ వెనుక ఉన్న వారు మన ఇండియన్స్ అని మీకు తెలుసా

డైలీ usage లో వాడే 7 టెక్నాలజీ ఇన్వెన్షన్స్ వెనుక ఉన్న వారు మన ఇండియన్స్ అని మీకు తెలుసా

ప్రపంచం టెక్నాలజీ రంగంలో మన ఇండియన్స్ హస్తం ఉండే ఉంటుంది అని అందరూ నమ్ముతారు కాని మన డైలీ use లో ఉండే టెక్నాలజీ వెనుక కూడా మన వాళ్ళు ఉన్నారని తెలుసుకోవటం కొంచెం ఆశ్చర్యం ఇస్తుంది. ఇక్కడ అలాంటి కొన్ని విషయాలను తెలుసుకుందాము రండి..

ఫేస్ బుక్ న్యూస్ feed:
అసలు ఫేస్ బుక్ లో జాయిన్ అయిన మొదటి female ఇంజనీర్ మన ఇండియనే. ఆమె పేరు Ruchi Sanghvi. మీరు చూస్తున్న ప్రస్తుత ఫేస్ బుక్ న్యూస్ feed ను క్రియేట్ చేశారు. ఈ విషయం ఆమె ఒరిజినల్ బ్లాగ్ పోస్ట్ లో కూడా తెలపటం జరిగింది (లింక్).

HD TV:
స్టాండర్డ్ డెఫినిషన్ నార్మల్ క్వాలిటీ స్క్రీన్ నుండి HD స్క్రీన్ చూసినప్పుడు మీకు ఆ ఫీలింగ్ గుర్తుందా..దీనిని కనిపెట్టింది ఇండియన్, Arun Netravali. ఈ ఇండియన్ అమెరికన్ కంప్యుటర్ ఇంజినీర్ Bell లాబొరేటరీస్ కు 9 వ ప్రెసిడెంట్.


                    Arun Netravali

గూగల్ న్యూస్:
గూగల్ న్యూస్ అనేది స్మార్ట్ ఫోనులు వాడె కామన్ పీపుల్ వాడేది కానప్పటికీ ఇది ఇంటర్నెట్ లో బాగా పాపులర్ న్యూస్ సోర్స్. దీని వెనుక ఉన్నది Krishna Bharat. 9/11 అమెరికన్ అటాక్స్ తరువాత మంచి న్యూస్ సోర్స్ లేదు అని భరత్ దీనిని క్రియేట్ చేయటం జరిగింది. నాలుగు సంవత్సరాల దీనిపై పనిచేసి 2006 జనవరి లో లాంచ్ అయ్యింది గూగల్ న్యూస్.

Pentium ప్రొసెసర్స్:
intel inside పేరు కంప్యుటర్ లేని వారికీ కూడా బాగా పరిచయం.  ఇంటెల్ పెంటియం ప్రాసెసర్లు వెనుక ఉన్నది Vinod Dham. ఈయన కూడా ఇండియన్. మొదటి పెంటియం చిప్ ను కనిపెట్టి ఫాథర్ గా బాగా పెంటియం ప్రాసెసర్లకు పాపులర్ అయ్యారు.


Vinod Dham

Email:
ఇది ఆల్రెడీ కొంతమందికి తెలుసు. Email వెనుక మన ఇండియన్ Shiva Ayyadurai ఉన్నారు. అయితే దీనిపై కొంత వివాదాలు, arguements కూడా ఉన్నాయి. 1978 లో 14 ఏళ్ల వయసులో Inbox, Outbox, Drafts, Subject etc వంటి ఫీచర్స్ బేస్డ్ ఫార్మాట్ లో మెయిలింగ్ సిస్టం కు ప్రోగ్రాం క్రియేట్ చేశారు శివ. email అనే term కు కూడా copyright సంపాదించుకున్నారు Shiva. అయితే ఈమెయిలు సెగ్మెంట్ పై Shiva కన్నా ముందు కొన్ని ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశారు Tomlinson.


Shiva Ayyadurai

 

రేడియో:  
Jagadish Chandra Bose గారు వైర్లెస్ కమ్యూనికేషన్స్ లో చాలా అడ్వాన్సు పరిశోధనలు చేశారు. Marconi transatlantic కమ్యూనికేషన్ యొక్క demonstration లో వాడిన రిసీవర్ రేడియో కనుగోనటకు బాగా ఉపయోగపడింది. ఇందుకు 1901 లో బోస్ గారికి మంచి పేరు వచ్చింది. Radio ను ఫైనల్ గా కనుగొన్న marconi కూడా Bose యొక్క ఇంపార్టెన్స్ ను వెల్లడించారు.


Sir Jagadish Chandra Bose at the Royal Institution, London

USB, PCIe AGP:
Ajay Bhatt అనే ఇంటెల్ కంప్యుటర్ ఆర్కిటెక్ట్ మనం ప్రస్తుతం వాడుతున్న Universal Serial Bus (USB) సిస్టం ను కనుగున్నారు. మీకు తెలుసు కదా pen డ్రైవ్, డేటా కేబుల్స్ etc అన్నీ usb కోవలోకే వస్తాయి. ఇంకా PCI Express అండ్ Accelerated Graphics Port కూడా కనుగున్నది కూడా అజయ్ భట్ట. 2009 లో ఇంటెల్ కూడా ఒక టీవీ ప్రోగ్రాం లో Ajay ను ప్రత్యేకంగా highlight చేసింది.


                    Intel’s very own rockstar, Ajay Bhatt

Arnab Mukherjee
Digit.in
Logo
Digit.in
Logo