ఇండియాలో మొదలైన 500 రూ,1000 రూ నోట్లు బాన్ పై అందరికీ ఉన్న MOST wanted డౌట్స్ అండ్ answers
ప్రతీ కామన్ మాన్ కు ఉండే కంప్లీట్ డౌట్స్ ను ఇక్కడ Q&A లో చూడగలరు..
దేశంలో ప్రధాని, నరేంద్ర మోడీ 500 మరియు 1000 రూ నోట్లను రాత్రి 12 గం నుండి ban చేయటం అందరికీ బాగా తెలిసిన విషయమే. కాని ఈ సందర్భంగా కామన్ మాన్ కు కొన్ని డౌట్స్ ఉండటం కామన్. ఇక్కడ వీలైనంతగా వాటిని తీర్చే ప్రయత్నమే ఈ ఆర్టికల్.
అసలు ఎందుకు సడెన్ గా వీటిపై ban అమలు అయ్యింది?
నల్ల ధనం – అంటే చట్టవ్యతిరేకంగా సంపాదించిన ధనం మరియు ఫేక్ కరెన్సీ.. ఈ రెండూ దేశంలో బాగా హాల్ చల్ చేస్తున్నాయి. దీనిని నిర్మూలన చేయటానికే. యాంటి గవర్నమెంట్ వారు లేదా ఈ బాన్ ద్వారా భారీగా నష్టపోయే వారు ఏవేవో ఎనాలిసిస్ లు చేసి కొత్త కొత్త భయాలను తెస్తూ, "గవర్నమెంట్ ఫలానా స్వార్థపు కారణంతోనే చేసింది, దేశానికి మంచి కోసం కాదు" అని చెబుతుంటారు. మరి కొన్ని రోజులు గడిస్తే సోషల్ నెట్ వర్కింగ్ మరియు వాట్స్ అప్ లో 'బాన్ లోపల ఇన్ని లోగుట్టులు ఉన్నాయి' అంటూ అనవసరమైన అవాస్తవ ప్రచారాలను చేస్తారు. వాటిని పట్టించుకోవటం కరెక్ట్ కాదు.
దేశాన్ని త్రీవ్రమైన ప్రభావం చేసే నిర్ణయం తీసుకోవలసిన అంతగా మన దేశంలో ఫేక్ కరెన్సీ లు ఉన్నాయా?
చాలా మందికి ఈ ప్రశ్న లోపల ఉంటుంది, కాని బయటకు రాదు. సో అసలు విషయం ఏంటంటే.. ఫేక్ నోట్స్ వలన మేజర్ గా జరుగుతున్న నష్టం టెర్రరిస్ట్లు వాడకం. అవును టెర్రరిస్ట్ లకు భారిగా విస్పోటన ప్లాన్స్ మరియు కార్యక్రమాలు చేయటానికి చాలా ఎక్కువ ధనం కావాలి. అందుకు వారికి అనువైన ధనం – కేవలం ఫేక్ కరెన్సీ. దేశంలో terrorism పోతుంది అంటే రెండు మూడు రోజులు 'కామన్ మాన్' దేశానికి సహకరించటం చాలా అవసరం.
నిజంగా నల్ల ధనం నిర్మూలన జరుగుతుందో లేదో గారెంటీ లేనప్పుడు కామన్ మాన్ ఎందుకు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కుంటాడు?
అయితే ఫేస్ బుక్ ప్రొఫైల్ లో, వాట్స్ అప్ ఫెమలీ గ్రూప్స్ లో మరియు వాట్స్ అప్ స్టేటస్ లలో 'దేశం మారలేదు, మారాలి etc' వంటి మంచి నట ప్రదర్శనలు చేయకండి ఇక. మార్పుకు సహకరించని వారు అందరూ ఇదే జాబితాలోకి వెళ్ళాలి. ఎందుకంటే నల్ల ధనం నిజంగా నిర్మూలన జరుగుతుందా లేదా అనే ప్రశ్న ప్రక్కన పెడితే ఫేక్ కరెన్సీ చలామణి మాత్రం నిర్మూలన అవుతుంది. నిజంగా మార్పు కోరుకుంటే మార్పులో భాగం అవ్వాలి.
అసలు బాన్ లోని నియమాలు ఏంటి?
1. ప్రస్తుతం చలామణి లో ఉన్న 500 రూ మరియు 1000 రూ నోట్లు నిషేధం. సో మీ వద్ద ఉన్న 500 లేదా 1000 రూ నోటుకు పబ్లిక్ మార్కెట్ లో విలువ లేదు. కేవలం బ్యాంక్స్(అన్ని బ్యాంక్స్) లలోనే వీటికి విలువ ఉంది.
2. అంటే మీ వద్ద ఉన్న ఈ నోట్లను మీకు దగ్గరిలో ఉన్న ఏ బ్యాంకు లోకైనా మీ valid(ఫోటో ఉన్న) ఐడి కార్డ్ పట్టుకొని వెళ్లి బ్యాంకు సిబ్బందికి ఇస్తే మీకు 100 నోట్లు ఇస్తారు. ఇలా ఒక వ్యక్తి 4000 రూ వరకూ ఎక్స్చేంజి చేసుకోగలరు బ్యాంక్లు నుండి. ఇది డిసెంబర్ 31 వరకూ చేయగలరు. ఆ తరువాత డేట్ పొడిగింపు ఉంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము. సో డిసెంబర్ 31 లోపు వరకూ బ్యాంక్స్ అన్నీ మీ వద్ద ఉన్న ఈ banned కరెన్సీ నోట్స్ ను తీసుకోవటం జరుగుతుంది.
3. 4000 రూ లకు మించి మీ వద్ద 500 లేదా 1000 రూ నోట్లు ఉంటే కనుక మీరు కాష్ ను మీ బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ చేసుకోవాలి.
4. కేవలం బ్యాంక్స్ ఒకటే కాదు పోస్ట్ ఆఫీస్ లలో కూడా ఎక్స్చేంజి జరుగుతుంది.
5. పైన చెప్పిన ఎటువంటి పనులకు బ్యాంక్లు transaction charges వంటివి తీసుకోవు.
అయితే ఇకమీదట దేశంలో 500/1000 రూ నోట్లు ఉండవా?
ఉంటాయి. ఇండియాలో కొత్త 500/ 2000 రూ నోట్లు నవంబర్ 10 నుండి వస్తున్నాయి. అవును కొత్త 1000రూ నోట్లు ఉండవు ప్రస్తుతానికి. ఫ్యూచర్ లో మాత్రం వస్తాయి. ఇవి ఏ చేతి నుండి ఏ చేతికి ఏలా వెళ్ళాయో ట్రాక్ చేయగలిగే విధంగా నానో చిప్ GPS సిస్టం టెక్నాలజీ తో వస్తున్నాయి అని గత కొద్ది కాలంగా రిపోర్ట్స్ ఉన్నాయి. వీటిని భూమిలో అడుగున దాచి పెట్టినా ట్రాక్ చేయగలరు అని కూడా అంటున్నారు. కాని ఇవి ప్రస్తుతానికి రూమర్స్ మాత్రమే. ఎందుకంటే RBI ఇప్పటివరకూ అఫీషియల్ గా కొత్తగా రిలీజ్ చేయనున్న నోట్స్ పై లేదా ఇతర మాంద్యమాలలో ఎక్కడా ఈ టెక్నాలజీ గురించి మాట్లాడలేదు. పైన కొత్త 2000 rs note ఇమేజ్ చూడగలరు. ఇలానే ఉంటుంది 500 రూ కొత్త నోట్ కూడా.
అయితే అస్సలు ఎమెర్జెన్సీ అవసరాలకు కూడా ఈ నోట్లు పనిచేయవా?
హాస్పిటల్స్, గవర్మెంట్ బస్ టికెట్స్, రైల్వే టికెట్స్, HP పెట్రోల్ బంక్స్, ఎయిర్ పోర్ట్స్ లో ఈ పాత 500/1000 రూ నోట్లు పనిచేస్తాయి, RBI ఆదేశాలు మేరకు. ఇది కూడా బాన్ అనౌన్స్ చేసిన 72 గంటలోపు ఉంటుంది. కాని వీటిలో కూడా అయితే కొన్ని చోట్ల కేవలం 100 రూ నోట్లనే తీసుకోవటం జరుగుతుంది.
డిపాజిట్ లేదా ఎక్స్చేంజి లకు సొంత బ్యాంకు లకే వెళ్ళాలా?
4000 రూ వరకూ ఎక్స్చేంజి చేసుకోవటానికి ఏ బ్యాంక్ అయినా.. పోస్ట్ ఆఫీస్ అయినా మీకు సహకరిస్తుంది. కాని అంతకుమించి కాష్ మనీ(500/1000 rs నోట్స్ రూపంలో) మీ వద్ద ఉంటే వాటిని డిపాజిట్ చేయాలి అని పైన 3 పాయింట్ లో తెలపటం జరిగింది కదా. సో డిపాజిట్ చేయాలనుకునే పరిస్థితి ఉన్నప్పుడు సొంత బ్యాంక్ లకు వెళ్ళాలి. సొంత బ్రాంచ్ అనే నియమము ఏమి లేదు. సొంత బ్యాంక్ లో ఏ బ్రాంచ్ లో అయినా డిపాజిట్ చేయగలరు.
అంటే మన సొంత బ్యాంక్ కాని బ్యాంక్ మరియు పోస్ట్ ఆఫీస్ లలో కేవలం 4000 రూలే.. అది కూడా Exchange మాత్రమే చేసుకోగలమా?
అవును!
ATM లు పనిచేయవా, ఇప్పటివరకూ పనిచేయవు? అసలు ఎందుకు పనిచేయవు??
అవును! మోదీ తెలిపిన సమాచారం ప్రకారం కేవలం రెండు రోజులు atms మరియు బ్యాంక్స్ పనిచేయవు. అయితే నవంబర్ 10 నుండే ఇవి పనిచేస్తాయి. ఈ రెండు రోజులు ఎందుకు పనిచేయవు అంటే.. ఈ మార్పులకు అనుగుణంగా బ్యాంక్స్ రెడీ గా ఉండాలి.
ATM లు పనిచేయటం మొదలైతే ఎలా ఉంటాయి transactions?
ATM కార్డ్ ద్వారా నవంబర్ 18 వరకో రోజుకు 2000 రూ మాత్రమే డ్రా చేయగలరు. నవంబర్ 19 నుండి 4000 రూ పెరుగుతుంది లిమిట్. ఇది ఒక రోజుకు ఒక కార్డ్ మీద ఉండే లిమిట్. మీరు డ్రా చేసినప్పుడు ఇప్పటివరకూ atm ఎలా డ్రా చేసాయో ఇక మీదట కూడా అలానే 100 రూ అవసరమైన్నప్పుడు 100 రూ నోట్లు, 500/1000 రూ నోట్లు ఇవ్వవలసి వస్తే కొత్త 500/1000 రూ నోట్లు ఇస్తుంది. అదే సొంత బ్యాంక్ కౌంటర్ లోకి లేదా పోస్ట్ ఆఫీస్ వద్దకు వెళితే రోజుకు 10 వేల వరకూ డ్రా చేయగలరు.. వారానికి 20 వేల వరకూ డ్రా చేయగలరు.
బ్యాంకు కు వెళ్లి ఎక్స్చేంజి చేసుకోవటానికి మనకు బ్యాంకు అకౌంట్ కచ్చితంగా ఉండాలా?
ఎక్స్చేంజి చేయటానికి అవసరం లేదు. కాని 4000 రూ కన్నా ఎక్కువ ఎక్స్చేంజి చేయవలసిన అవసరం ఉంటే సొంత అకౌంట్ లలో డిపాజిట్ చేసుకోవాలి అని చెప్పటం జరిగింది కదా పైన. సో అలాంటప్పుడు బ్యాంక్ అకౌంట్ కావాలి. మీకు బ్యాంక్ అకౌంట్ లేదా క్రింద ప్రశ్న చదవండి…
బ్యాంక్ అకౌంట్స్ లేని వాళ్ళ వద్ద 4000 మించి అమౌంట్ ఉంటే, ఎక్కడ డిపాజిట్ చేయాలి? ఏమి చేయాలి?
బ్యాంక్ అకౌంట్ లేనివారు బ్యాంక్ అకౌంట్ ఉన్న మిత్రుల వద్దకు వెళ్లి విషయం చెప్పి వాళ్ళ అకౌంట్ లో banned నోట్స్ ను జమ చేయగలరు. అయితే ఇందుకు లిఖితపూర్వకంగా 'మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోవటం వలన ఆ వ్యక్తి మీ వద్ద ఉన్న banned నోట్స్ ను తన అకౌంట్ లో డిపాజిట్ చేయదలుచుకున్నట్లు' ఆ బ్యాంక్ అకౌంట్ వ్యక్తి సంతకంతో లెటర్ వ్రాయాలి. దీనిని పట్టుకొని వెళ్లి మీ వద్ద ఉన్న (4000 రూలకు మించిన కాష్) ను అతని అకౌంట్ లో జమ చేయగలరు.
ఒకవేళ కొన్ని కారణాల వలన మీ వద్ద 500/1000 రూ నోట్లును Exchange లేదా డిపాజిట్ చేసుకోలేకపోతే, ఏమి చేయాలి?
రిసర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో specified ఆఫీస్ లోనే డిక్లరేషన్ ఫార్మ్, పాన్ కార్డ్, ఐడి ప్రూఫ్ తో వెళ్లి మార్చ్ 31 లోపు వీటిని డిపాజిట్ చేసుకోగలరు.
అర్జెంటు గా నాకు డబ్బు అవసరం ఉంది ఏమి చేయాలి?
ఈ రోజు మరియు రేపు దేశంలోని బ్యాంక్స్ – atms పనిచేయవు. సో అర్జెంటు అవసరాలు ఉంటె cheques, ఆన్ లైన్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ బ్యాంకింగ్ లేదా online wallets ద్వారా మీరు అవసరాలను తీర్చుకునే ప్రయత్నాలు చేయాలి.
సడెన్ గా వచ్చిన ఈ బాన్ ఏ విధంగా అయినా.. ఆన్ లైన్, డెబిట్, క్రెడిట్ అండ్ ఇతర cashless పేమెంట్స్ కు వర్తిస్తుందా?
వర్తించదు.
సబ్మిట్ చేయవలసిన ఐడి ప్రూఫ్లు ఏంటి?
ఆధార కార్డ్, వోటర్ ఐడి, రేషన్ కార్డ్ , పాస్ పోర్ట్ లేదా పాన్. వీటిలో ఒకటి సబ్మిట్ చేస్తే చాలు.
మేము ఇండియాలో లేము ఏమి చేయాలి?
మీకు తెలిసిన వారికి ఈ భాద్యత అందజేస్తున్నట్లు లెటర్ వ్రాసి వారి ద్వారా ఎక్స్చేంజి లేదా డిపాజిట్ చేయగలరు. అయితే అవి చేసేటప్పుడు మీరు వ్రాసిన లెటర్ (కాపి) ను ప్రూఫ్ గా సబ్మిట్ చేయాలి.
ఈ విషయం పై మరింత అదనపు సమాచారం కొరకు ఎవరిని ఆశ్రయించాలి? ఎక్కడ తెలుసుకోవాలి?
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెబ్ సైట్ (http://www.rbi.org.in/) లో మీరు సమాచారం తెలుసుకోగలరు. అయితే ఇది విపరీతమైన ట్రాఫిక్ కారణంగా కొన్ని సార్లు ఓపెన్ అవటం లేదు. అదనంగా మీరు publicquery@rbi.org.in కు మెయిల్ లేదా 022 22602201 మరియు 022 22602944 లకు కాల్ చేయగలరు.
ఈ ఆర్టికల్ పై మీ ఫీడ్ బ్యాక్ తెలియజేయగలరు క్రింద కామెంట్స్ లో లేదా ఫేస్ బుక్ కామెంట్ లో.