టెక్నాలజీ అంటే ప్రధానంగా స్మార్ట్ ఫోన్స్. ఎందుకంటే అందరికీ అందుబాటులో వచ్చిన మోస్ట్ అప్ డేటెడ్ టెక్నాలజీ ఇది. నిజమే స్మార్ట్ ఫోన్ అర చేతిలో ఉండి ప్రపంచాన్ని చూపిస్తుంది , మాయాబజార్ లో సావిత్రి గారు చూసే బాక్స్ లా 🙂
కాని వీటితో పాటు కొన్ని స్మార్ట్ డివైజెస్ కూడా ఉన్నాయి. వీటిని కూడా మీరు డైలీ usage లో వినియోగించుకోగలరు. అవేంటో చూద్దాం రండి..
O6 : మీ స్మార్ట్ ఫోన్ ను టచ్ చేయకుండా వాడగలరు. బ్లూ టూత్ తో స్మార్ట్ ఫోన్స్ కు కనెక్ట్ అయ్యి టచ్ అండ్ టాప్ ఫంక్షన్స్ అందిస్తుంది. emails, ఫేస్ బుక్ మెసేజెస్, tweets లను చదివి వినిపిస్తుంది. ఇంకా మీరు మెసేజ్ కు రిప్లై ఇచ్చే స్థితిలో లేకపోతే, వచ్చిన మెసెజ్ కంటెంట్ ను analyse చేసి సరైన replies ను సజెస్ట్ చేస్తుంది. మీరు చేయవలసినదల్లా O6 ను టాప్ చేసి మీకు నచ్చిన రెస్పాన్స్ ను సెలెక్ట్ చేసుకోవటమే. క్రింద వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది.
Knocki: ఏ సర్ ఫేస్ మీద అయినా attach చేసి, మీ స్మార్ట్ డివైజెస్ ను రిమోట్ గా ఇక్కడ నుండే కంట్రోల్ చేయగలరు. అంటే టేబుల్ పై knock చేసి రూమ్ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ చేయగలరు. అలాగే మీ ఫోన్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవటానికి దీనిని మీరు ఉన్న వద్ద knock చేసి ఫోన్ రింగ్ అయ్యేలా చేయగలరు. అలాగే డోర్ కి Knocki ను అటాచ్ చేసి మీ ఇంటికి గస్ట్స్ వస్తే ఫోన్ లో నోటిఫికేషన్ వచ్చేలా చేసుకోగలరు. క్రింద వీడియో చూడండి మరింత సమాచారం కొరకు.
GeoOrbital Wheel: దీని సహాయంతో 60 సేకేండ్స్ లో మీ సైకిల్ ను ఎలెక్ట్రిక్ బైక్ గా కన్వర్ట్ చేసుకోండి. ఫ్లాట్ ప్రూఫ్ అండ్ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం vvheel తో వస్తుంది. సెపరేట్ టూల్స్ అవసరం లేకుండా సైకిల్ ఫ్రంట్ వీల్ ను రిప్లేస్ చేస్తుంది. 500W DC Motor పై నడుస్తూ 6Ah రిమూవబుల్ Li-on బ్యాటరీ తో పనిచేస్తుంది. సింగిల్ చార్జింగ్ లో 50 miles రన్ అవుతుంది. ఇంకా usb పోర్ట్ కూడా వస్తుంది. బ్యాటరీ massive పవర్ తో రావటం వలన మీ స్మార్ట్ ఫోన్స్ ను కూడా చార్జ్ చేసుకోగలరు.
Povi: ఇది పిల్లలకు స్టోరీస్ చెబుతుంది. ఎప్పుడూ ఫోనులు అడిగే పిల్లలకు ఇది ఒక స్మార్ట్ గాడ్జెట్ లా పనిచేస్తుంది. కాని healthy గాడ్జెట్. స్మార్ట్ ఫోన్ యాప్ కు కనెక్ట్ అయ్యి psychologists, టీచర్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్లు చెప్పే స్టోరీస్ ను transfer చేసుకుంటుంది. ఇంటర్నెల్ గా దీనిలో ఉండే స్పీకర్ లో అవి play అవుతాయి. అలాగే యాప్ ద్వారా మీరు స్టోరీస్ ను చూస్ చేయగలరు age అండ్ ఇంటరెస్ట్ బట్టి. ప్రశ్నలు కూడా ఇస్తుంది.
Socket: స్మార్ట్ గా కనెక్ట్ అయ్యే bulbs అంటే బాగా కాస్ట్. అందుకే Socket కనిపెట్టారు కొంతమంది యువకులు. ఏ రెగ్యులర్ bulb ను అయినా socket లో పెడితే దానిని ఇక నుండి మీ స్మార్ట్ ఫ్నో ద్వారా కంట్రోల్ చేయగలరు. ఆపిల్ ఫోనులకు సిరి కమాండ్స్ కుడా పనిచేస్తాయి. dim చేయగలరు. switch ఆఫ్ చేయగాలురు ఇంకా schedule కూడా చేయవచ్చు.