ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ అప్ డేట్స్ అన్ని ఫోనులకు రాకపోవటానికి ఉన్న 4 కారణాలు.
గూగల్ నిన్న Nexus ఫోనులకు ఆండ్రాయిడ్ సరి కొత్త వెర్షన్ 7.0 (Nougat) ను రిలీజ్ చేసింది. లిస్టు లో Nexus 6,. Nexus 5X, Nexus 6P, Nexus 9, Nexus Player అండ్ Pixel C ఉన్నాయి.
Nexus కాని ఫోనుల్లో ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా తెలియలిసి ఉంది. కానీ త్వరలోనే ఉంటుంది అని అంచనా. అయితే గతంలోని ఉన్న ఆండ్రాయిడ్ అప్ డేట్స్ హిస్టరీ బట్టి, బడ్జెట్ ఫోనులకు మాత్రం ఇప్పటిలో రాదు ఆండ్రాయిడ్ N. సో మీరు ఆశించటం వలన నిరాశ మాత్రమే ఉంటుంది.
అసలు ఎందుకు ఐ ఫోన్ లా ఆండ్రాయిడ్ లో కొత్త వెర్షన్ – అప్ డేట్స్ అన్ని ఆండ్రాయిడ్ ఫోనులకూ రావు?
1. సెపరేట్ యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయటం వలన
ఇది అందరికీ బాగానే తెలిసిన రీజన్. ఆండ్రాయిడ్ సోర్స్ కోడ్ అనేది ఎవరైనా మార్చవచ్చు. ఫ్రీ గా అందుబాటులో ఉంటుంది అందరికీ. సో చాలా కంపెనీలు వారి ఫోన్లపై ఆండ్రాయిడ్ బేస్ చేసుకొని సొంతంగా సెపరేట్ యూజర్ ఇంటర్ఫేస్ ఇస్తారు. గూగల్ ఇలా స్మార్ట్ ఫోన్ కంపెనీలు తయారు చేసుకున్న సొంత UI లకు మెరుగులు దిద్ది అప్ డేట్స్ ఇవ్వలేదు. సో కంపెనీలే మరలా కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ బేస్ చేసుకొని వాళ్ళ సొంత UI ను అప్ డేట్ చేయాలి. ఇక్కడే ఉంది మెయిన్ లోపం.
2. బిన్నమైన హార్డ్ వేర్ సిస్టం
ఓక ఫోన్ లో Qualsomm స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ ఉంటుంది, మరొక దానిలో మీడియా టెక్ SoC లు ఉంటాయి. ఒకే బ్రాండ్ నుండి వివిధ బడ్జెట్ సెగ్మెంట్స్ లో భిన్నమైన హార్డ్ వేర్స్ తో వస్తాయి ఫోనులు. ఫర్ eg ఆసుస్. సో గూగల్ ఇన్ని బ్రాండ్లకు మరియు ఒకే బ్రాండ్ లో ఉన్న వివిధ హార్డ్ వేర్ మోడల్స్ కు ఇవ్వటం అనేది అసాధ్యం. ఒక వేల అప్ డేట్ ఇచ్చినా హార్డ్ వేర్ కు సాఫ్ట్ వేర్ కు అనుకూలత లేక ఫోన్ కంపెనిలుకే మళ్ళీ కొత్త ఇబ్బంది వస్తుంది. అందుకే కొత్త వెర్షన్ రిలీజ్ అయినప్పుడు హార్డ్ వేర్ సరిపోతే చాలు సాఫ్ట్ వేర్ UI లో మార్పులు చేయవలసిన అవసరం లేని ఫోనులకు (for eg: Android One, Nexus మోడల్స్) అప్ డేట్ వస్తుంది.
3. సాఫ్ట్ వేర్ Lockdown –
ఫోన్ తయారు చేసే కంపెనీలు కూడా ప్రీ లోడింగ్ పద్దతిలో థర్డ్ పార్టీ యాప్స్ ను ఫోన్లతో పాటు ముందుగానే ఇంస్టాల్ చేసి ఇచ్చి ఆ యాప్స్ నుండి డబ్బులు తీసుకుంటాయి. సో ఈ సంపాదన ఒరిజినల్ ఆండ్రాయిడ్ OS ద్వారా పనిచేయదు. థర్డ్ పార్టీ యాప్స్ అనే కాదు సొంతంగా డెవలప్ చేసుకున్న యాప్స్ ను కూడా ఫోన్లలో పెట్టి ఇస్తారు. ఈ యాప్స్ ను కొత్త వెర్షన్ కు compatible గా ఉండేటట్లు తయారు చేయటానికి టైం పడుతుంది.
4. Costs involved – కొత్త సాఫ్ట్ వేర్ కు ఫోన్ ను అప్ డేట్ చేయటనికి కొంత ఖర్చు కూడా అవుతుంది కంపెనీస్ కు. సెపరేట్ గా టీం ను నియమించాలి updates పై పనిచేసేందుకు. అప్ డేట్స్ కొరకు సర్వర్ లో స్పేస్ కూడా cost ఉంటుంది.
స్టోరీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియ జేయండి. ధన్యవాదాలు!
Hardik Singh
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile