డిలిట్ అయిన వాట్స్ అప్ మెసేజెస్ ను ఇలా పొందగలరు

Updated on 04-Apr-2016

వాట్స్ అప్ లో అనుకోకుండా మెసేజెస్ డిలిట్ చేశారా? ఫర్వాలేదు కంగారు పడకండి. మీ మెసేజెస్ ను డిలిట్ చేసిన వెంటనే మీరు పొందగలరు.

సాధారణంగా వాట్స్ అప్ లో మెసేజెస్ అన్నీ బై డిఫాల్ట్ గా  మీ జిమెయిల్ ఐడి గూగల్ క్లౌడ్ స్టోరేజ్ – గూగల్ డ్రైవ్ లోకి బ్యాక్ అప్ అవుతాయి.

ఆ సెట్టింగ్స్ ను మీరు మార్చకుండా ఉంచితే, మాక్సిమమ్ అందరికీ chats అప్ డేట్ ప్రతీ రోజు ఉదయం 4.00 AM గంటలకు జరుగుతుంది.

ఐ ఫోన్ users కు అయితే ఎప్పుడు WiFi available గా ఉంటే అప్పుడు అప్ డేట్ అయిపోతుంది chats బ్యాక్ అప్. సో వారికీ ఈ క్రింద మెథడ్ పనిచేయకపోవచ్చు. అయినా ట్రై చేసి చూడండి.

మెసేజెస్ డిలిట్ చేసిన దగ్గర నుండి ఆ మరుసటిరోజు తెల్లవారుజామున 4 గంటలలోపు మీరు వాట్స్ అప్ ను uninstall చేసి మరలా ఇంస్టాల్ చేయాలి. 

ఇప్పుడు మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేశాక మీకు చాట్ బ్యాక్ అప్ ఉంది restore చేయాలా అని అడిగినప్పుడు yes అని okay చేస్తే డిలిట్ అయిన మెసేజెస్ మరలా పొందగలరు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :