వాట్స్ నంబర్ ను ఫేస్ బుక్ అకౌంట్ లోకి షేర్ అవుతుంది. అవకుండా ఉండటానికి ఇలా చేయండి

Updated on 29-Aug-2016

తొందరిలోనే వాట్స్ అప్ నంబర్ ను మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ కు షేర్ చేస్తుంది facebook కంపెని. కొత్తగా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మార్పులు జరిగాయి వాట్స్ అప్ లో.

అసలు వాట్స్ అప్ డేటా ను ఫేస్ బుక్ లో ఎందుకు షేర్ చేస్తుంది?
ముఖ్యంగా యాడ్స్ కోసం. మీ వాట్స్ అప్ డేటా ప్రకారం ఫేస్ బుక్ లో యాడ్స్, ఫ్రెండ్స్ సజెషన్స్ వంటివి మార్పులు చేస్తుంది.ఈ డేటా లో నంబర్ కూడా ఉంటుంది.

షేర్ చేయకుండా ఉండటానికి ఏమి చేయాలి?
వాట్స్ అప్ ఇందుకు సంబంధించి మార్పులు చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ విండో చూపిస్తుంది. మీరు వాట్స్ అప్ ఓపెన్ చేస్తే సడెన్ గా వస్తుంది విండో. కనపడని వారికీ తొందరిలోనే కనిపిస్తాయి.

ఇప్పుడు మీరు agree ప్రెస్ చేయకుండా read బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు Share my Whatsapp account information with Facebook.. అని ఒక మెసేజ్ కనిపిస్తుంది. దానిని uncheck చేయండి.

ఆల్రెడీ టర్మ్స్ విండో లో agree ను ప్రెస్ చేసిన వారు ఏమి చేయాలి?

  • వాట్స్ అప్ లో రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మూడు డాట్స్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు సెట్టింగ్స్ > account లోకి వెళితే Share my account info అనే మెసేజ్ వద్ద uncheck చేయాలి.
  • ఐ ఫోన్ users – వాట్స్ అప్ సెట్టింగ్స్ లో > account > Share my account info అనే దానిని సెలెక్ట్ చేయండి. అంతే!
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :