వాట్స్ అప్ లో అందరికన్నా ముందుగా లేటెస్ట్ ఫీచర్స్ కావాలా? ఇలా చేయండి!
వాట్స్ అప్ జెనెరల్ గా కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్స్ ను ముందుగా beta వెర్షన్స్ లో implement చేస్తుంది. అంటే సాధారణ users కు రాక ముందు వీటిని వాడగలరు మీరు.
beta వెర్షన్ అంటే స్టాండర్డ్ గా పబ్లిక్ అందరికీ రిలీజ్ చేసే ముందు మీరెవరైనా బేటా టెస్టింగ్ చేసి ఈ ఫీచర్స్ ను అందరికన్నా ముందు ఆస్వాదించగలరు.
బీటా టెస్టర్స్ అనే పదము వినటానికి ఎదో క్లిష్టమైన పదంలా వినపడవచ్ఛు కానీ ఇది సింపుల్, దాదాపు అస్సలు ఏ బగ్స్ ఉండవు, ఇంస్టాల్ చేసుకొని వాడటమే. మీరేమి ప్రత్యేకమైన టెస్టింగ్ చేయనవసరం లేదు.
ఎలా ఇంస్టాల్ చేసుకోవాలి బీటా?
ప్లే స్టోర్ లో మీకు అప్ డేట్ వస్తుంది. అప్ డేట్ చేసుకోవటమే. అయితే ఫేస్ బుక్ లా కాకుండా ప్రతీ అప్ డేట్ కు changes ఏంటో క్లియర్ గా వ్రాసి పెడుతుంది యాప్ description లో చదవండి ఇంస్టాల్ బటన్ ప్రెస్ చేసే ముందు.
అయితే ప్లే స్టోర్ లోనే ఉంటుంది బీటా కానీ దానికి ముందుగా మీరు beta testers గా రిజిస్టర్ కావాలి. ఇందుకు జస్ట్ ఈ లింక్ లోకి వెళ్లి అక్కడ ఉన్న మూడు లైన్ లు చదివి become beta tester ను ప్రెస్ చేయటమే.
ఇక నుండి పబ్లిక్ కన్నా ముందు రిలీజ్ అయినా బీటా అప్ డేట్స్ అందరికీ రాక ముందే మీకు ప్లే స్టోర్ లో అప్ డేట్ గా వస్తాయి.