ఫేస్ బుక్ ఆండ్రాయిడ్ యాప్ లో మీరు గమనించని most useful ఫీచర్స్
మొత్తం యాప్ లో ఉన్న అన్నిటినీ తెలపటం జరిగింది
ఫేస్ బుక్ యాప్ ఎంత ఎక్కువ ర్యామ్, స్టోరేజ్ అండ్ బ్యాటరీ తీసుకున్నా దానిని వాడకుండా ఎవరూ ఉండలేకపోతున్నారు. అది ఒక టైమ్ పాస్ అయిపోయింది.
రెగ్యులర్ గా ప్లే స్టోర్ లో అప్ డేట్స్ ఎక్కువుగా వచ్చే యాప్ కూడా ఇదే. change log (అంటే కొత్త అప్ డేట్ లో చేసిన మార్పులు) ఏంటో తెలియవు, ఎందుకంటే కంపెని improved speed అనే చెబుతుంది.
కాని వెనుక యాప్ లో మీకు తెలియని కొత్త ఫీచర్స్ మరియు డెస్క్ టాప్ ఆప్షన్స్ ను ఒక్కొకటిగా కంపెని యాడ్ చేస్తూ వస్తుంది యాప్ లో. అవేంటూ ఇక్కడ చూద్దాం..(వీటిలో కొన్ని మీకు తెలిసి ఉండవచ్చు కానీ చాలా మంది వీటిని గమనించలేదు)
ఫేస్ బుక్ యాప్ లో ప్రస్తుతం మూడు టాబ్స్ ఉన్నాయి. మొన్నటి వరకూ 5 టాబ్స్ ఉండేవి.. అందులో మొదటి టాబ్…
న్యూస్ ఫీడ్ టాబ్.. ( square సింబల్ )
1. మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఎవరైనా చాలా ఫ్రిక్వెంట్ గా స్టేటస్ పోస్ట్ లు, ఫోటోలు అప్ డేట్ చేస్తున్నారా? అయితే వారివి ఏమి చూడకుండా ఉండేందుకు ఆ వ్యక్తుల పోస్ట్ పైన రైట్ కార్నర్ లో డౌన్ arrow సింబల్ పై టచ్ చేస్తే Unfollow అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఇక నుండి వారి పోస్ట్స్ మీ న్యూస్ ఫీడ్ లో కనిపించవు. (నా న్యూస్ ఫీడ్ లో ఫ్రెండ్స్ పోస్ట్స్ రావు, అన్నీ నేను ఫాలో అవుతున్న pages పోస్ట్ లు మాత్రమే ఉంటాయి. నా ఉద్దేశంలో చుట్టూ ఉన్న వారి జీవితాల పై కాదు ఏదైనా knowledge పైన ఉండాలి curiosity ). పూర్తిగా వారి పోస్ట్ లను చూడటం మనేయకుండా కూడా సెట్ చేసుకోగలరు. మీ న్యూస్ ఫీడ్ లో ఉన్న వారి పోస్ట్ ను hide ఆప్షన్ ద్వారా hide చేసినప్పుడు See less from "మీ ఫ్రెండ్" అనే మెసేజ్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే ఇక వారి పోస్ట్ లు తక్కువుగా కనిపిస్తాయి.
2. మరొక ముఖ్యమైన save post ఆప్షన్ కూడా అక్కడే ఉంది. దీని గురించి ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇది మీకు నచ్చే లింక్ పోస్ట్స్ అన్నిటినీ ఒక దగ్గర సేవ్ చేసి ఉంచుతుంది. మీరు డిజిట్ తెలుగు posts లో ఏదైనా నచ్చితే, దానిని సేవ్ చేసుకొని, తరువాత ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మరలా ఆ పోస్ట్ గురించి వెబ్ సైట్ లో వెతకనవసరం లేకుండా మీ అకౌంట్ saved లిస్ట్ లోకి వెళ్లి చదువుకోగలరు. కొన్ని సార్లు ఉపయోగాల యొక్క examples తెలిస్తే కాని వాటి uses మనకు తెలియవు 🙂
3. యాడ్స్ ఎక్కువుగా కనిపిస్తున్నాయా, వాటి పైన రైట్ సైడ్ arrow సింబల్ పై టచ్ చేసి Hide ad అనే ఆప్షన్ వాడుకోగలరు.
నోటిఫికేషన్స్ టాబ్.. ( globe సింబల్ )
1. మీకు పదే పదే విసుగుగా అనిపించే నోటిఫికేషన్స్ వస్తున్నాయా? అయితే నోటిఫికేషన్ బార్ లోకి వెళ్లి ఆ నోటిఫికేషన్ పై లాంగ్ ప్రెస్ చేసినప్పుడు రెండు ఆప్షన్స్ వస్తాయి. వాటిలో Turn off all notifications for this page/photo ఆప్షన్ ను ఎంచుకోగలరు.
2. ఒక ఐదు రీసెంట్ నోటిఫికేషన్స్ క్రింద ఉన్న SEE ALL పై ప్రెస్ చేస్తే మొత్తం అన్నీ నోటిఫికేషన్స్ ను చూడగలరు.
ప్రొఫైల్ సెట్టింగ్స్ టాబ్.. ( 3 లైన్స్ )
1. మోస్ట్ రీసెంట్ లో పాపులర్ పోస్ట్ లు కాకుండా రీసెంట్ గా పోస్ట్ చేయబడ్డవి టైమ్ ప్రకారం వరసులో చూపించబడతాయి.
2. Nearby Friends అనే ఆప్షన్ లోకి వెళ్లి మీరు ఉన్న ఏరియా లో మీ ఫ్రెండ్స్ ఎవరూ ఉంటున్నారు అని కిలోమీటర్ల తో సహా తెలుసుకోగలరు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రావెల్ చేస్తున్నా Friends Travelling అని టైమ్ తో సహా చూపిస్తుంది. అంతేకాదు మీ ఫ్రెండ్స్ కు కొంత సమయం వరకూ మీ లొకేషన్ ను ఏదైనా text యాడ్ చేసి నోటిఫై చేయగలరు. ఇది మనకు కావలసిన వారి సెక్యురిటీ గురించి తెలుసుకోవా లనుకున్నప్పుడు use అవుతుంది.
3. అదే nearby friends ఆప్షన్ లో పైన సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది, దాని పై టాప్ చేస్తే మీ ఏరియా ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియాలి ఎవరికి తెలియకూడదు అని కూడా సెట్ చేసుకోగలరు. అసలు near by ను ఆఫ్ చేయాలనుకుంటే అదే సెట్టింగ్స్ లో పైన ఆఫ్ చేసుకోగలరు. near by ఫ్రెండ్స్ పనిచేయాలంటే మీ ఫోన్ లో లొకేషన్ ఆన్ చేయాలి.
4. Saved అనే ఆప్షన్ లో మీరు సేవ్ చేసిన పోస్ట్ లన్నీ చెక్ చేసుకోగలరు. ఆ విండో లో పైన రైట్ కార్నర్ ఉన్న సింబల్ (రెండు హారిజంటల్ లైన్స్) పై క్లిక్ చేస్తే saved లిస్ట్ లో వీడియోస్, ప్లేసెస్, లింక్స్ ను విడివిడిగా చూడగలరు.
5. Instagram ఆప్షన్ పై క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీ ఫోన్ లో instagram యాప్ ఉంటే ఓపెన్ అవుతుంది ఫేస్ బుక్ నుండే. అయితే ఫేస్ బుక్ ఈమెయిలు id, instagram మెయిల్ id ఒకటే అయితేనే ఇలా synchronise అవుతుంది.
6. On This Day ఆప్షన్ ఓపెన్ చేస్తే ఇదే రోజు మీరు ప్రతీ సంవత్సరం ఫేస్ బుక్ లో ఏమి పోస్ట్ చేశారు అని తెలుసుకోగలరు. మీరు ఫేస్ బుక్ మొదలు పెట్టినప్పుడు కొత్తలో ఏమి పోస్ట్ చేసేవారో తెలుసుకొని నవ్వుకుంటారు. వీటిని నోటిఫై చేయాలనుకుంటే పైన రైట్ కార్నర్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి నోటిఫికేషన్స్ బాక్స్ ను టిక్ చేయాలి. అయితే కొన్ని డేట్స్ కాని వ్యక్తుల టాగ్ చేసిన పోస్ట్ లను కాని remind అవకుండా preferences లోకి వెళ్లి సెట్ చేయగలరు కూడా.
7. Nearby Places – మీ చుట్టూ ఏమి ఉన్నాయి తెలుసుకోగలరు. సాధారణంగా ఈ విషయానికి maps ఓపెన్ చేయటం జరుగుతుంది. చూట్టూ ఉన్న రెస్టారెంట్స్, ప్లేసెస్, హోటల్స్ యొక్క పేజెస్ ను రేటింగ్, టైమింగ్స్ అండ్ distance తో సహా కూడా చూడగలరు.
ఇదే టాబ్ లో క్రిందకు వెళ్తే app settings అని ఉంటుంది. దానిలో ..
8. లింక్స్ ను బయట బ్రౌజర్స్ లో ఓపెన్ చేయటానికి Links ఓపెన్ externally ను enable చేయాలి.
9. అలాగే వైఫై లో ఉన్నా మొబైల్ ఇంటర్నెట్ లో ఉన్నా వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవకుండా సెట్ చేసుకోగలరు.
10. అలాగే ప్రొఫైల్ picture లేదా మిగిలన ఫోటోస్ క్వాలిటీ తగ్గకుండా HD లో అప్ లోడ్ అవటానికి Upload HD ఫోటోస్ ఆప్షన్ enable చేయాలి.
11. ఫేస్ బుక్ చాట్ ను ఆఫ్ అండ్ on చేయగలరు. ఇదే ఆప్షన్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ నుండి లెఫ్ట్ కు swipe చేసినప్పుడు కనిపిస్తుంది. ఇది చాలా మందికి ఆన్ లో ఉంటుంది అని తెలియదు, సో ఫ్రెండ్స్ అందరికీ ఎప్పుడూ చూసిన మీరు ఫేస్ బుక్ లోనే ఉన్నారు అని తెలుస్తుంది.
12. ఫోటో లను ఫేస్ బుక్ లో sync అవకుండా ఉండేందుకు photo synching ను ఆఫ్ చేసుకోగలరు. ఇది బ్యాటరీ , ఇంటర్నెట్ అండ్ ప్రైవెసి కు కూడా ఆఫ్ చేసుకోవటం మంచిది.
13. ఇదే tab లో app settings ఆప్షన్ క్రింద Language ను సెలెక్ట్ చేసి మీ ఫేస్ బుక్ తెలుగులో అన్నీ చూపించేలా సెట్ చేసుకోగలరు.
14. దాని క్రింద ఉన్న News feed preferences ఆప్షన్ లో ఎవరి పోస్ట్ లు ముందు కనిపించాలి, ఎవరివి కనపడకూడదు అని సెట్ చేసుకోగలరు. ఇవే ఫీచర్స్ ను పైన 1. లో తెలపటం జరిగింది.
15. Activity Log లో మీరు ఫేస్ బుక్ ఎవరి పోస్ట్ ను లైక్ చేసినా, కామెంట్ చేసినా, అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇవే అప్ డేట్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ మాత్రమే కాదు మీ ప్రొఫైల్ ను visit చేసే మీ ఫ్రెండ్స్ కానీ వారికీ కూడా కనిపిస్తాయి. ఏదైనా ఆక్టివిటీ ఎవ్వరికీ తెలియ కూడదు అనుకుంటే ఆ ఆక్టివిటీ వద్ద ఉన్న arrow మార్క్ ఆపి క్లిక్ చేసి Hide from timeline ను సెలెక్ట్ చేయాలి. పైన Filter ఆప్షన్ use చేసి లిస్ట్ ను ఫిల్టరింగ్ చేయగలరు. దయచేసి ఈ ఆర్టికల్ పై మీ కామెంట్స్ క్రింద తెలపగలరు.
ఫేస్ బుక్ ఫీచర్స్ పై గతంలో రెండు ఆర్టికల్స్ పొందిపరిచాము. వాటిని క్రింద వాటి పేర్ల పై క్లిక్ చేసి చూడగలరు..
మీకు తెలియని 5 ఫేస్ బుక్ ఆప్షన్స్ [ ఏప్రిల్ 2016 ]
ఫేస్ బుక్ లో మీకు తెలియని సింపుల్ ఇంట్రస్టింగ్ ఫీచర్స్