మీకు తెలియని యాప్: డిలిట్ అయిన ఫోటోస్ లేదా ఫైల్స్ ను ఇలా రికవర్ చేసుకోండి
టెక్నాలజీ ఎంత అడ్వాన్సు అవుతున్నా డిలిట్ చేసిన ఫైల్స్ ను రికవర్ చేసుకునే అవసరం మాత్రం చాలా మందికి అవసరం గానే ఉండిపోయింది. అయితే మారుతున్న టెక్నాలజీ కారణంగా advanced రికవరీ సల్యుషణ్ ఏమైనా వచ్చిందా అనే ప్రశ్న కు సమాధానం ఏమో తెలియదు కాని మొబైల్ లో డిలిట్ అయ్యే ఫైల్స్ కు మాత్రం మంచి యాప్ ఒకటి ఉంది ప్లే స్టోర్ లో.
పేరు Undeleter. ప్లే స్టోర్ లో ఈ లింక్ లో ఉంది. సైజ్ 9.3 MB. అయితే రేటింగ్ మాత్రం కొంచెం తక్కువుగా ఉంది. 3.3 స్టార్ కలిగి ఉంది. కాని ఒక సారి యాప్ ఇంస్టాల్ చేసి ట్రై చేయండి.
ఎందుకంటే నిజంగానే డిలిట్ చేసిన ఫైల్స్ ను తిరిగి అందిస్తుంది. సరే ఇది ఎలా వాడాలి?
యాప్ ఓపెన్ చేసి, రికవర్ ఫైల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెల్ స్టోరేజ్ నుండా లేక SD కార్డ్ నుండా అని అడుగుతుంది.
అది సెలెక్ట్ చేసుకున్న తరువాత క్విక్ స్కాన్ చేసి రికవర్ చేయాలా, deep స్కాన్ చేసి రికవర్ చేయాలా, కంప్లీట్ ఫుల్ స్కాన్ చేయాలా అని అడుగుతుంది.
వీటిలో ఒకటి సెలెక్ట్ చేసి మీకు స్కానింగ్ మొదలవుతుంది. కొంతసేపటి తరువాత మీరు ఫోన్ లో ఎక్కడ నుండి అయినా డిలిట్ చేసిన ఫైల్స్ ను చూపిస్తుంది.
వాటిలో రికవర్ చేయదలచుకున్న దాని పై టాప్ చేసి, పైన రైట్ కార్నర్ లో కనిపించే save (floppy symbol) బటన్ పై టాప్ చేయండి. file సేవ్ అవుతుంది.
యాప్ లో ఉన్న మైనస్ ఏంటి?
యాడ్స్ ఎక్కువుగా వస్తుంటాయి.
ప్లస్ ఏంటి?
1. ఫైల్స్ పేరు, సైజ్, టైప్ ఆఫ్ ఫైల్ వంటి డిటేల్స్ చూడగలరు రికవర్ చేసుకునే ముందు.
2. కేటగిరిస్ వైజ్ గా కూడా మీరు ఫైల్స్ ను చూడగలరు.
3. స్కాన్ స్టార్ట్ చేసే ముందే మీరు ఎటువంటి ఫైల్స్ ను స్కాన్ చేయాలి అని కూడా సెలెక్ట్ చేసుకోగలరు. ఇది time save చేస్తుంది బాగా.