మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్ – బ్యూటిఫుల్ అండ్ వెరీ ఫంక్షనల్ [MAY 16]

Updated on 16-May-2016

యాప్ పేరు స్టార్ట్. ఇది ఆండ్రాయిడ్ లాక్ స్క్రీన్ యాప్. హై లైట్స్ ఏంటంటే దీనిలో స్మాల్ గేమ్స్ ఆడుకోగలరు. ప్లే స్టోర్ లో ఇది 4.4 స్టార్ రేటింగ్ కలిగి ఉంది.

ఇదే యాప్ ను తెలుగు వీడియో రూపంలో కూడా అందించటం జరిగింది. ఈ క్రింద చూడండి..  వీడియో క్రింద text రూపంలో కూడా యాప్ విశేషాలను తెలియజేశాము.

ఇక దీని లోని ఫీచర్స్ అండ్ హై లైట్స్..

  • ముందుగా చెప్పవలసినది – లాక్ స్క్రీన్ పై చిన్న చిన్న 5 గేమ్స్ ను ఆడుకోగలరు. ఇది unlock చేయకుండా మన ఫోన్ లో ఉండే గేమ్స్ కాదు. లాక్ స్క్రీన్ కు అంటూ 5 గేమ్స్ ఉన్నాయి. వీటిని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుంటే బాగా బోరింగ్ లేదా వెయిటింగ్ టైమ్స్ బెస్ట్ useful.
  • Inbuilt సెపరేట్ అండ్ సింపుల్ లాక్ స్క్రీన్ మ్యూజిక్ ప్లేయర్
  • లాక్ స్క్రీన్ నుండి దాదాపు అన్నీ చూడగలరు.
  • అంటే నోటిఫికేషన్స్, యాప్స్, న్యూస్, వాతావరణం, క్రికెట్ అప్ డేట్స్, ఇంటరెస్టింగ్ స్టోరీస్ అండ్ వీడియోస్..
  • మీ రీసెంట్ కాల్ లిస్టు లోని ఫ్రెండ్స్ కు unlock చేయకుండానే లాక్ స్క్రీన్ నుండి ఫోన్ చేయగలరు.
  • అయితే ఇవి మీరు ప్రైవెసి సెట్టింగ్స్ లో ఎవ్వరికీ కనపడకుండా కూడా సెట్ చేయగలరు.
  • లాక్ స్క్రీన్ చూడటానికి కూడా attractive గా ఉంటుంది.
  • స్టేటస్ బార్ ను hide చేయగలరు.
  • టైమ్, వాతావరణం widgets లాక్ స్క్రీన్ పై కనపడకుండా చేసుకోగలరు. అంటే అంతా plain గా ఉండాలనుకునేవారికి ఇది నచ్చుతుంది.
  • ఇంబిల్ట్ వాల్ పేపర్స్ ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవటానికి ఉన్నాయి.
  • నోటిఫికేషన్ ఏ యాప్ నుండి వచ్చింది అని సెట్ చేసుకోగలరు. ప్రైవేసీ కోసం ఆ నోటిఫికేషన్ ఏంటి అని తెలియకుండా ఉంచుతుంది.

 

మైనస్ ఏంటంటే మీరు మధ్యలో ఉన్న unlocking బటన్ ను స్వైప్ చేస్తుంటే అంత perfect గా ఉండదు. స్వైప్ చేసిన వెంటనే unlock అవ్వదు, స్వైప్ లో పర్టికులర్ పాయింట్ టచ్ అయితేనే unlock అవుతుంది. ఇది అప్పుడప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. కాని యాప్ try చేయకుండా ఉండటానికి ఇది కారణంగా ఉండదు. ఈ లింక్ లో యాప్ ను డౌన్లోడ్ చేయగలరు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :