యాప్ పేరు Materialize. ప్లే స్టోర్ లో 4.89MB సైజ్ తో ఉంది. రేటింగ్ – 4.4 స్టార్. ఇది లుక్స్ పైన ఇంటరెస్ట్ ఉన్న ఆండ్రాయిడ్ users కు నచ్చుతుంది.
యాప్ ఏదైనా సరే దాని ఐకాన్ ను మీరు డిజైన్ చేసుకోగలరు. గూగల్ ఆండ్రాయిడ్ లాలిపాప్ os తో material డిజైన్ ను ప్రవేసపెట్టింది. అప్పటి నుండి మెటీరియల్ డిజైన్ బాగా ఫేమస్ అయిపొయింది. ఇందుకు కారణం ఈ డిజైన్ ఫ్లాట్ గా మినిమల్ గా ఉంటుంది.
వాల్ పేపర్స్, ఐకాన్, లాంచర్ యాప్స్, యాప్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా అన్నీ మెటీరియల్ డిజైన్ కు షిఫ్ట్ అయ్యాయి. కాని ఐకాన్స్ మాత్రం మెటీరియల్ గా మార్చటం కష్టం అవుతుంది.
ఎందుకంటే యాప్స్ అంటే చాలా ఉంటాయి. వాటి అన్నిటినీ మెటీరియల్ డిజైన్ లో ఇచ్చే ఐకాన్ ప్యాక్స్ చాలా రేర్. ఇలా కాకుండా మీ వద్ద ఉన్న యాప్స్ ను ఈ యాప్ సహాయంతో సింపుల్ గా మెటీరియల్ డిజైన్ లోకి మార్చగలరు. రౌండ్ లేదా square షేప్స్ కూడా సెట్ చేసుకోవచ్చు.
యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీ యాప్స్ లిస్టు ఓపెన్ అవుతుంది. వాటిలో మీకు ఏ యాప్ ఐకాన్ ను మెటీరియల్ డిజైన్ కు మార్చాలని ఉంటె వాటిని సెలెక్ట్ చేసి, డిజైన్ కూడా సెలెక్ట్ చేసి యాడ్ to homescreen ఆప్షన్ ను టాప్ చేస్తే ఐకాన్ మారిపోయి హోం స్క్రీన్ పైన కనిపిస్తుంది.
మైనస్ ఏంటంటే ఇవి యాప్ డ్రాయర్ లో మారవు, డెస్క్ టాప్ పైనే మారతాయి. యాప్ డ్రాయర్ లో కూడా మారాలంటే పైన డాట్స్ మెను బటన్ పై ప్రెస్ చేసి integrate ఆప్షన్ వాడాలి. కాని ఇందుకు రూటింగ్ అవసరం.
యాప్ ను ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.