ఫోన్ లోని అన్నిటినీ స్పీడ్ అప్ చేసి బ్యాటరీ ను కూడా సేవ్ చేసే ఆండ్రాయిడ్ యాప్

ఫోన్ లోని అన్నిటినీ స్పీడ్ అప్ చేసి బ్యాటరీ ను కూడా సేవ్ చేసే ఆండ్రాయిడ్ యాప్

యాప్ పేరు సూపర్ టచ్. ప్లే స్టోర్ లో దీని సైజ్ 2.6MB. 4.1 స్టార్ రేటింగ్ తో వస్తుంది. డౌన్లోడ్ లింక్ కొరకు క్రిందకు వెళ్ళండి.

ఏమి చేస్తుంది యాప్?
మీ ఫోన్ ఏదైనా (అవును ఏ ఆండ్రాయిడ్ మోడల్ ఫోన్ అయినా!) అది స్పీడ్ గా respond అయ్యేలా చేస్తుంది సూపర్ టచ్ యాప్.

అంటే ఇది ఫోన్ లో sliding, స్వైపింగ్, scrolling, dragging, zooming వంటి ఫంక్షన్స్ ను స్పీడ్ అప్ చేస్తుంది. అవును యాప్ చేసే స్పీడ్ అప్ ఇవే.

ఇంకా వీటితో పాటు టైపింగ్ కూడా చాలా స్పీడ్ పెరుగుతుంది. యాప్స్ ను కూడా స్పీడ్ గా లాంచ్ చేస్తుంది. గేమ్స్ కూడా స్పీడ్ గా ఉంటాయి అని చెబుతున్నారు యాప్ డెవలపర్.

ఫోన్ లో ఉన్న మరొక హై లైట్ ఫీచర్ ఏంటంటే పెర్ఫార్మన్స్ తగ్గకుండా  బ్యాటరీ ను సేవ్ చేసే బ్యాటరీ సేవింగ్ ఫిచర్ కూడా ఉంది. జస్ట్ ఆ ఆప్షన్ ఫై టాప్ చేస్తే చాలు.

ఎలా చేస్తుంది?
యాప్ ఓపెన్ చేసి instructions అన్నీ బాగా చదవండి. ఓపికగా చదివితే క్లియర్ గా అర్థమవుతాయి. ఎదో ఫాస్ట్ గా చదివితే ఇదేదో క్లిష్టమైన ప్రాసెస్ లా ఉంది అనిపిస్తుంది. కానీ ఇది సింపుల్.

మీరు జస్స్ట్  slider ను మీకు నచ్చిన నంబర్ వద్దకు స్లయిడ్ చేయండి. ఇప్పుడు పైన ఒక గ్రీన్ మెసేజ్ వస్తుంది. దాని పై టాప్ చేయాలి.

ఇక్కడ మీ ఫోన్ స్క్రీన్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక క్రింద స్టార్ట్ smooth touch బటన్ ప్రెస్ చేయండి. మీరు ఎంత ఎక్కువుగా slider ను slide చేస్తే అంత ఎక్కువ టైమ్ తీసుకుంటుంది సెట్ అప్ కు.

అయితే ఇది మొదటి సారే, ప్రతీ సారి తీసుకోదు. ముందుగా మీరు ఓపెన్ చేసినప్పుడు ఉన్న దాని కన్నా కొంచెం ఎక్కువ పెంచి స్టార్ట్ చేయండి. తరువాత రెండవ సారి ఫుల్ slide చేసుకోండి.

యాప్ డౌన్లోడ్ లింక్

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo