ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఉండే ప్రధానమైన విషయం, unlimited అప్లికేషన్ డెవలప్మెంట్. ఇప్పుడు మీకు తెలియని బాగా యూజ్ఫుల్ అయ్యే Help chat అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. దీని పేరు Help Chat. కేవలం ఆండ్రాయిడ్ ఫోనులకు మాత్రమే డెవలప్ అయ్యింది. ఈ లింక్ లో ప్లే స్టోర్ నుండి దీనిని డౌన్లోడ్ చేసుకోండి.
దీని సైజ్ 5.40MB. 2g ఇంటర్నెట్ స్పీడ్ లో 5 నిముషాలలో డౌన్లోడ్ చేయగలరు. ఆండ్రాయిడ్ 4.0(ICS) వెర్షన్ నుండి అందరికీ సపోర్ట్ చేస్తుంది. ప్లే స్టోర్ లో దీని రేటింగ్ 4.5 స్టార్స్. దీనిలోని మరో హై లైట్ విషయం ఏంటంటే flat 50% ఆఫర్స్ ను కూడా ఇస్తుంది వివిధ కేటగిరీలు మీద. అయితే హెల్ప్ చాట్ అప్లికేషన్ సిటీలలో ఉన్న వారికీ ఎక్కువ శాతం బాగా హెల్ప్ అవుతుంది. మిగిలిన వారు కూడా ట్రై చేయవచ్చు.
Help Chat ఏమి చేస్తుంది?
1. ఇది ఒక పెర్సనల్ అసిస్టెంట్ లాంటిది. ఇదే పేరుతో ప్లే స్టోర్ లో చాలా ఉన్నాయి. కొన్ని కేవలం మీ ఫోనులో ఏదైనా ఓపెన్ చేయటానికి, వెతకటానికి పనిచేస్తే ఇది మాత్రం నిజంగా పర్సనల్ అసిస్టంట్ లా హెల్ప్ చేస్తుంది. మీ location ను తెలుసుకొని మీకు దగ్గరిలోని ఉన్న సర్వీసెస్ ను మొబైల్ నుండే అందిస్తుంది.
2. ఫుడ్ ఆన్ లైన్ ఆర్డర్, మీ దగ్గరలోని రెస్టారెంట్ లలో ఉన్న ఆఫర్స్ మరియు ఫుడ్ experts తో చాటింగ్
3. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ రీచార్జ్, మొబైల్ ప్లాన్స్ లిస్ట్, టెలికాం experts తో చాటింగ్
4. మీకు ఎటువంటి ఫోన్ కావాలి, ఎక్కడ తక్కువ ప్రైస్ వస్తుంది, షాపింగ్ ఏదైనా సరే జస్ట్ వీళ్ళను అడగండి చాలు.
5. ఇంటిలోకి Grocery ఐటమ్స్ ను ఆర్డర్ చేయండి.
6. ఎలక్ట్రీషియన్, హోం క్లీనర్, ప్లంబర్, మరియు ఇంటిలోని అన్ని వస్తువులకు రిపేర్ చేయటానికి మనుషులను ఇంటికి పంపిస్తుంది.
7. మూవీ టికెట్స్ బయింగ్, బస్, ఫ్లైట్, ట్రెయిన్ టికెట్స్, PNR స్టేటస్, టెక్నాలజీ సపోర్ట్, హెల్త్ సపోర్ట్, హోం remedies, బిల్ పేమెంట్స్, జాబ్స్, resume బిల్డింగ్, హోమ్ బ్యూటీ సలూన్, బెస్ట్ కాలేజెస్ ఇంకా చాలా కేటగిరీల సపోర్ట్ చేస్తుంది హెల్ప్ చాట్ అప్లికేషన్.
ఆధార్ కార్డ్, మీ పర్సనల్ బ్యాంక్, మొబైల్, ఆన్ లైన్ షాపింగ్, మీరు వాడుతున్న బైక్ కంపెని…ఇలా 350 కు పైగా ఉన్న కంపెనీలతో మీరు అఫిషియల్ గా సపోర్ట్ ( కస్టమర్ కేర్ ) చాట్ ద్వారా పొందగలరు. ఏమైనా కంప్లైంట్ చేయటానికి.. లేదా ఇన్ఫర్మేషన్ పొందటానికి బెస్ట్ సోర్స్.
ఇది ముందుగా కస్టమర్స్ కు వివిధ వస్తువుల/service బేస్డ్ కంపెనీల యొక్క కస్టమర్ సర్వీస్ లను, కంపైంట్స్ raise చేయటానికి సింపుల్ గా అనుసంధానం చేసేది. ఈ లింక్ పై ప్రెస్ చేస్తే దీని వెబ్ సైటు కు వెళ్తారు. ఇప్పుడు అప్లికేషన్ రూపంలో కంప్లెయింట్స్ మరియు a to z సర్వీసెస్ అందిస్తుంది. ఇది ఒక్కటి ఉంటే మిగిలిన ఆన్ లైన్ సర్వీసెస్ యాప్స్(for eg: bookmyshow, zomato, Mobikwik foodpanda, Goibibo etc..) ఇంస్టాల్ చేయనవసరం లేదు. ఈ లింక్ లో ప్లే స్టోర్ నుండి హెల్ప్ చాట్ ను డౌన్లోడ్ చేయగలరు.