మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: సెండ్ ఇట్
మీ ఫోన్ కాంటాక్ట్స్ లో ఏ నంబర్ కైనా ఏ ఫైలైనా sms లా ఎటువంటి యాప్ లేకుండానే పంపగలరు
ఇప్పుడు వాట్స్ అప్ అందరికీ మేజర్ అండ్ మోస్ట్ ఫేవరేట్ యాప్. కాని అది ఫైల్స్ ను ట్రాన్సఫర్ చేయటానికి పని చేయదు. సో కొంతమంది ఈ కారణం తో టెలీగ్రామ్ యాప్ ను వాడటం జరుగుతుంది.
కాని టెలీగ్రామ్ అప్పుడప్పుడు సర్వర్ ఇస్స్యూస్ వలన సరిగా పనిచేయటం లేదు. కేవలం ఫైల్ ట్రాన్స్ ఫర్ కోసం మరొక యాప్ అని ఒక కారణం, అలానే అవతల వ్యక్తి కూడా టెలీ గ్రామ్ ఇంస్టాల్ చేయాలనే నిబంధన వంటి నెగటివ్స్ ఉన్నాయి ఫైల్ షేరింగ్ use విషయంలో.
ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని రాబ్ అనే Dev సింపుల్ గా ఏదైనా జస్ట్ మెసేజ్ ద్వారా పంపేలా Send IT అనే యాప్ ను డెవలప్ చేశారు.
ఈ ఒక యాప్ మీ దగ్గర ఉంటే చాలు, మీ ఫోన్ లోని ఎవరి కైనా ఏ ఫైల్ అయినా sms ద్వారా లింక్ జోడించి పంపగలరు. అయితే దీనికి స్టాండర్డ్ sms (mms కాదు) చార్జ్ పడుతుంది.
ఈ లింక్ ప్లే స్టోర్ లో 4.8MB సైజ్ లో 4.1 స్టార్ రేటింగ్ తో ఉంది.
ఎలా పని చేస్తుంది..
1. మీ మొబైల్ లోని ఫైల్ మేనేజర్ లో ఫైల్ ను సెలెక్ట్ చేసి షేర్ ను చూస్ చేస్తే, send it కనిపిస్తుంది.
2. దానిని చూస్ చేసి, మీ కాంటాక్ట్స్ లోని ఒక కాంటాక్ట్ సెలెక్ట్ చేయాలి.
3. ఇప్పుడు యాప్ ఆ ఫైల్ ను మీ పర్సనల్ గూగల్ డ్రైవ్ లేదా బాక్స్, లేదా ఇతర క్లౌడ్ స్టోరేజ్ సర్విస్ కు అప్ లోడ్ చేస్తుంది.
4. అప్ లోడ్ అయిన వెంటనే ఫైల్ మీరు ఇంతకముందు సెలెక్ట్ చేసిన కాంటాక్ట్ కు లింక్ తో పాటు మీరు టైప్ చేసే టెక్స్ట్ కూడా వెళ్తుంది.
యాప్ లో మరో ఫీచర్ ఉంది..
మీరు కాంటాక్ట్ ను సెలెక్ట్ చేయకుండా.. కాపీ టు క్లిప్ బోర్డ్ ఆప్షన్ ను చూస్ చేసుకుంటే, ఫైల్ క్లౌడ్ లోకి అప్ లోడ్ అయ్యి, లింక్ ను ఇస్తుంది కొంత సేపు తరువాత. ఇప్పుడు ఆ లింక్ ను వాట్స్ అప్ లో డైరెక్ట్ గా మీ ఫ్రెండ్/ఫేమిలీ కు షేర్ చేయగలరు.
దీనిలో ఫీచర్స్..
1. ఫైల్ లో పాటు, స్టాండర్డ్ మెసేజ్ టెక్స్ట్ అలాగే ఫైల్ సైజ్ ఎంత ఉందో అని కూడా అవతల వ్యక్తి కి తెలియ చేయగలరు.
2. అప్ లోడ్ అయ్యి సెంట్ అయిన వెంటనే వైబ్రేషన్ పెట్టుకోవచ్చు నోటిఫికేషన్ కొరకు.
మైనస్..
స్టాండర్డ్ మెసేజ్ రేట్ పడుతుంది మెసేజ్ కు. అంటే ఫైల్ ను క్లౌడ్ స్టోరేజ్ కు అప్ లోడ్ చేసి, ఆ ఫైల్ లింక్ ను మీరు sms చేస్తున్నారు. ఇక్కడ ఇంటర్నెట్ అండ్ sms రెండూ కావాలి. కాకపోతే రకరకాల యాప్స్ ను వాడుకునే బదులు, కేవలం ఈ ఒక్క యాప్ ను వాడుకోవచ్చు. సింపుల్ అండ్ స్ట్రెయిట్, మెసేజ్ కాస్ట్ కూడా 50 paise ఉంటుంది సుమారు.
బాటం లైన్..
కాని ఇది వెరీ బేసిక్, స్టాండర్డ్ అండ్ నమ్మదగిన పద్దతి. ఎందు కంటే, ఫైల్ షేరింగ్ ను సరదా పనులకు చేసే వారు తక్కువ. Either ఆఫీస్ or కొన్ని urgent సందర్భాలలో దీనిని బాగా ఉపయోగించే వారు ఉంటారు. వారికీ అవతల వ్యక్తి పర్సనల్ వాట్స్ అప్ నంబర్స్ లేదా ఈమెయిలు తెలియక పోవచ్చు. సో మెసేజ్ కాస్ట్ పడినా స్టాండర్డ్ మెసేజ్ తో ఫైల్ లింక్ ను షేర్ చేయటం కరెక్ట్ అనిపిస్తుంది అలాంటప్పుడు.
కేవలం ఒకరికి ఫైల్ షేరింగ్ చేయటం కోసం టెలీ గ్రామ్ వంటి మరొక ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ ను ఇంస్టాల్ చేయకుండా, సింపుల్ గా Send it తో మీ పర్సనల్ క్లౌడ్ స్టోరేజ్ లోకి ఫైల్ అప్ లోడ్ చేసి, ఆ లింక్ ను వాట్స్ అప్ లో షేర్ చేయవచ్చు(అదే లింక్ ను మెసేజ్ చేయకుండా).