మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: ఇండియన్ గవర్నమెంట్ మోస్ట్ వెయింటింగ్ & useful యాప్
మీకు రోజూ మొబైల్ నెట్ వర్క్ నుండి కాని ఇతర ప్రోమోషనల్ సర్వీసెస్ నుండి కాని అనవసరమైన ప్రొమోషన్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా.
వాటిని బేసిక్ మెథడ్ లో రాకుండా చేయాలంటే మీ ఫోన్ నంబర్ పై సిమ్ నెట్ వర్క్ తో DND సర్విస్ ను activate చేసుకోవటం.
సో నెట్ వర్క్ నుండి కాని ఇతర రెగ్యులర్ స్టాండర్డ్ promotions నుండి కాని మీకు కాల్స్ అండ్ మెసేజెస్ రాకూడదు లీగల్ గా.
90 శాతం రావు కూడా. కాని అప్పుడప్పుడు DND యాక్టివేట్ చేసినా కొన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇలా వచ్చే వాటిని రిపోర్ట్ చేయవచ్చు ఈ యాప్ ద్వారా.
అలాగే DND సర్వీస్ కూడా ఈ యాప్ ద్వారా ఆక్టివేట్ చేయగలరు. అసలు మీ నంబర్ DND సర్వీసెస్ కు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యిందా లేదా అనే స్టేటస్ కూడా చేసుకోగలరు.
ఇది ఇండియన్ గవర్నమెంట్ కొత్తగా రిలీజ్ చేసిన అప్లికేషన్. సింపుల్ గా యాప్ నుండి DND ను ఆక్టివేట్ చేయగలరు. కేటగిరిస్ వైజ్ గా కూడా మీకు నచ్చేవి వచ్చేలా, నచ్చని కేటగిరి మెసేజ్ లు రాకుండా సెలెక్ట్ చేసుకోగలరు.
అయితే ఎలా చేయాలి, అసలు DND అంటే ఏమిటి వంటి ఇతర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ను కూడా HELP అండ్ FAQ ద్వారా తెలుసుకోండి యాప్ లో.
ప్లే స్టోర్ లో దీని సైజ్ 5.8MB. ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ లింక్ లో ఇండియన్ గవర్నమెంట్ మన కోసం వివిధరకాల uses కు రిలీజ్ చేసిన యాప్స్ ను చూడండి లేదా డౌన్లోడ్ చేసుకోండి.