వాట్స్ అప్ తో పాటు, ఫేస్ బుక్, మెసెంజర్ ఇలా ఏ యాప్ అయిన రెండు అకౌంట్లను వాడగలరు ఒకే ఫోన్ లో..

వాట్స్ అప్ తో పాటు, ఫేస్ బుక్, మెసెంజర్ ఇలా ఏ యాప్ అయిన రెండు అకౌంట్లను వాడగలరు ఒకే ఫోన్ లో..

కేవలం వాట్స్ అప్ ఒకటే కాదు, అకౌంట్ కలిగిన ఎటువంటి యాప్ అయినా రెండు అకౌంట్స్ ను ఒకే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో వాడగలరు. అంటే రెండు వాట్స్ అప్స్ లేదా రెండు ఫేస్ బుక్స్, రెండు మెసెంజర్స్ ను ఒకే ఫోన్ లో వాడగలరు.

ఇది ఎదో ఒక పర్టికులర్ మెథడ్ ద్వారా కాదు, అంతా అఫీషియల్ గానే, రూటింగ్ కూడా చేయనవసరం లేదు. కావలసినదల్లా కొంచెం ఫాస్ట్ గా ఉన్న ఫోన్. ఆఫ్ కోర్స్ కాని అన్ని ఫోనులపైనా పనిచేస్తుంది యాప్.

యాప్ పేరు Parallel Space. ఇది ప్లే స్టోర్ లో 2.9MB సైజ్ తో వస్తుంది. రేటింగ్ 4.5 స్టార్. ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.

ఎలా పనిచేస్తుంది?

జస్ట్ మీరు యాప్ ఇంస్టాల్ చేసి ఓపెన్ చేస్తే కింద ఉన్న ప్లస్ సింబల్ పై టాప్ చేస్తే మీరు సెకండ్ అకౌంట్ తో వాడాలనుకునే యాప్స్ అన్నీ లిస్టు చూపిస్తుంది, వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే చాలు. 

ఆ యాప్ ఐకాన్ కనిపిస్తుంది. దాని పై టాప్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెష్ గా, వాట్స్ అప్ అయితే ఫోన్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది.

మీరు యాప్ ను యాడ్ చేసిన వెంటనే parallel space "ఫేస్ బుక్ అండ్ మెసెంజర్ ను యాడ్ చేసుకుంటే మీరు ముందు యాడ్ చేసిన యాప్ బాగా పనిచేస్తుంది" అనే మెసేజ్ చూపిస్తుంది.

మీకు నచ్చకపోతే ఆ మెసేజ్ ను cancel చేయవచ్చు. అవి ఇంస్టాల్ చేయకపోయినా మీరు యాడ్ చేసుకున్న యాప్ బాగా పనిచేస్తుంది.

ఇక యాడ్ చేసుకున్న యాప్ లో లాగిన్ ప్రోసెస్ అంతా అయిపోతే దానిని వాడుకోగలరు. ఈ సెకెండ్ అకౌంట్ యాప్స్ ను మీరు Parallel space యాప్ ఓపెన్ చేసి వాడుకోవాలి.

లేదా ఆ క్రియేట్ చేసిన యాప్స్ ఐకాన్స్ పై లాంగ్ ప్రెస్ చేసినప్పుడు క్రింద create shortcut అని వస్తుంది, దానిపైకి స్వైప్ చేస్తే, సెకెండ్ అకౌంట్ యాప్ కు కూడా షార్ట్ కట్ క్రియేట్ చేసుకోగలరు.

సెకెండ్ అకౌంట్ షార్ట్ కట్ ఐకాన్ చుట్టూ కలరింగ్ లైనింగ్ ఉంటుంది, అలాగే ఐకాన్ కూడా మొదటి అకౌంట్ ఐకాన్ కన్నా డిఫరెంట్ గా ఉంటుంది.

సో షార్ట్ కట్స్ వలన ఏది ప్రైమరీ అకౌంట్ ఏది సెకండరీ అకౌంట్ అనే కన్ఫ్యూషన్ ఉండదు. మీకు కావలసిన యాప్ ను కనపడకపోతే పైన ఉన్న సర్చ్ బటన్ లో సర్చ్ చేయగలరు కూడా.

సెకండరీ అకౌంట్స్ తో ఇంస్టాల్ చేసుకునే యాప్స్ parallel space లో కనపడకుండా చేసుకోవటానికి యాప్ ఓపెన్ చేయగానే కనిపించే మొదటి ఐకాన్ Incognito Installation ను సెలెక్ట్ చేసుకోండి. ఇందుకు గూగల్ ప్లే స్టోర్ అకౌంట్ పెర్మిషన్స్ అడుగుతుంది parallel space.

యాప్ లో ఏదైనా మైనస్ ఉంటే అది, Parallel Space lag అని చెప్పాలి. కొంచెం స్లో గా ఉంటుంది యాప్.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo