వాట్స్ అప్ లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ [ఏప్రిల్ 2016]
వాట్స్ అప్ లో ఈ సంవత్సరం కొన్ని క్రేజీ ఫీచర్స్ యాడ్ చేసింది ఫేస్ బుక్. ఫేస్ బుక్ కంపెని అటు FB మెసెంజర్ తో పాటు వాట్స్ అప్ ను కూడా instant messaging యాప్స్ లో ఈ రెండింటినీ టాప్ లో పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది..
వాట్స్ అప్ లో రీసెంట్ గా వచ్చిన ఫీచర్స్ గురించి ఎప్పటికప్పుడు తెలపటం జరుగుతుంది. కాని వీటిలో కొన్ని వాడటం మరిచిపోతున్నాము. అందుకే మరలా ఒక సారి అన్నీ ఒకే దగ్గర తెలిపే ప్రయత్నం చేశాము..
1. రీసెంట్ గా మొన్న విడుదల అయిన మోస్ట్ సెక్యూర్ ఫీచర్ – end to end ఎన్క్రిప్షన్. అంటే ఇద్దరు మాట్లాడుకునే టప్పుడు (గ్రూప్ చాట్స్ కూడా) మధ్యలో ఎటువంటి hackers లేదా govt లు చాట్ ఇన్ఫర్మేషన్ ను చూడటానికి వీలు కుదరదు. దీని పై కంప్లీట్ స్టోరీ ఈ లింక్ లో..
2. మీరు text ను bold, italics, strike through వంటి rich text formatting ఆప్షన్స్ ను అందించింది. ఇవి మైక్రోసాఫ్ట్ వర్డ్ లో అందరికీ బాగా పరిచయం. కంప్లీట్ స్టోరీ ఈ లింక్ లో చూడగలరు..
3. PDF డాకుమెంట్స్ ను షేర్ చేసుకునే ఫీచర్ ఇచ్చింది. కేవలం PDF లు మాత్రమే సపోర్ట్ చేస్తుంది ప్రస్తుతానికి. చాట్ విండో లో పైన attachment సింబల్ పై టచ్ చేసి Document ఆప్షన్ ఎంచుకోగలరు. టోటల్ స్టోరి ఈ లింక్ లో.
4. 2016 చివరికల్లా బ్లాక్ బెర్రీ లేటెస్ట్ os 10 తో పాటు ఆండ్రాయిడ్ 2.1, 2.2, విండోస్ 7.1 అండ్ నోకియా symbian S40 అండ్ S60 ఫోనులకు కూడా వాట్స్ అప్ సపోర్ట్ నిలిపివేయనున్నట్లు వెల్లడించింది కంపెని. టోటల్ స్టోరి ఈ లింక్ లో.
5. కొత్త emoticons స్మైలీ సింబల్స్ ను అప్ డేట్ చేసింది. అదనంగా కొత్త tab లను కూడా యాడ్ చేసింది. ఇప్పుడు టోటల్ 8 టాబ్స్ ఉన్నాయి సింబల్స్ లో. టోటల్ స్టోరి ఈ లింక్ లో.
6. వాట్స్ అప్ గ్రూప్స్ లో ఇప్పటివరకు 100 మెంబర్స్ మాత్రమే సపోర్ట్ చేయగా ఇక 256 మెంబర్స్ వరకు యాడ్ అవగలరు. 100 కోట్ల మంది వాట్స్ అప్ ను వాడుతుండగా ప్రతీ రోజు 420 కోట్ల మెసేజెస్ పంపబడతున్నాయి.
స్టోరీ పై మీ కామెంట్స్ తెలియజేయగలరు క్రింద..