మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్ – SEP 15
ఆండ్రాయిడ్ లో ఉన్న మొదటి ప్లస్ పాయింట్ బోర్ కొట్టకుండా ఫోన్ ను రకరకాలుగా మార్చుకునే వీలు కలిపించటం తో పాటు అనేకమైన customization యాప్స్. అంటే లాంచర్స్, థీమ్స్, ఐకాన్స్, వాల్ పేపర్స్. ముఖ్యంగా లాంచర్స్. నేను చాలా రోజులైంది ఆండ్రాయిడ్ యాప్స్ గురించి స్టోరీస్ వ్రాసి.
సో ఈ రోజు కొత్త లాంచర్ యాప్ పరిచయం చేయనున్నాను. దీని పేరు ap 15 Launcher. అవును పేరు ఆకర్షణీయంగా కాకుండా. డిఫరెంట్ గా ఉంది. ఈ లింక్ లో ప్లే స్టోర్ నుండి లాంచర్ ను డౌన్లోడ్ చేసుకోగలరు. యాప్ సైజ్ 310KB. అవును చాలా తక్కువ. 10 సేకేండ్స్ లో డౌన్లోడ్ అవుతుంది 2G ఇంటర్నెట్ లో. యాప్ రేటింగ్ 4.6 స్టార్.
Basically ఇది హెవీ customization ఇష్టపడే వారికి కాదు అని చెప్పలి. ఎందుకంటే వెరీ basic లుక్స్ తో చాలా సింపుల్ గా యాప్స్ ను పేరులతో home స్క్రీన్ పైన చూపిస్తుంది. హారిజంటల్ స్వైప్స్ కూడా ఉండవు. వెర్టికల్ గా ఉంటాయి యాప్స్ లిస్టు. లుక్స్ అయితే వేరి సింపుల్ గా ఉన్నాయి కాని సెట్టింగ్స్ మాత్రం రిజనబుల్ గానే ఉన్నాయి.
లాంచర్ సెట్టింగ్స్ కు వెళ్ళటానికి home స్క్రీన్ పై లాంగ్ ప్రెస్ చేయాలి..క్రింద లాంచర్ సెట్టింగ్స్ చూడగలరు..
- యాప్ లేబుల్స్ కలర్స్ changing.
- text సైజ్ – హారిజంటల్ అండ్ వెర్టికల్
- ఫాంట్/టెక్స్ట్ స్టైల్
- అండ్ మీకు అవసరం లేని యాప్స్ యొక్క పేరులు కనపడకుండా కూడా సెట్ చేసుకోగలరు.