ఆండ్రాయిడ్ సక్సెస్ కు అనేక కారణాలలో ఒకటి, customisation. ఫోన్ వినియోగదారుడు తనకు నచ్చిన రీతిలో, స్టైల్స్ మార్చుకునే అవకాశం ఉండటం. ఈ విభాగంలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నవి.. ఆండ్రాయిడ్ లాంచర్స్.
స్క్రీన్ ఆన్ చేసిన వెంటనే కనిపించే డిస్ప్లే, అందంగా, డిఫరెంట్ గా, రిచ్ గా ఉండాలని కోరుకుంటాము. అదే పని ఆటోమేటిక్ గా చేసి మనకోసం అందించేవే లాంచర్స్. ఆండ్రాయిడ్ కు ఐ os కు ఇక్కడే అతి పెద్ద తేడా ఉండేది.
తాజాగా ఆండ్రాయిడ్ os కు Scout అనే పేరుతో కొత్త లాంచర్ వచ్చింది. ఇది ఇంకా బీటా స్టేజ్ లో ఉంది. బీటా అంటే తయారీ దశలో ఉంది…సో చిన్న చిన్న బగ్స్ (వాడేటప్పుడు వచ్చే ఇబ్బందులు) అండ్ అప్ కమింగ్ ఫీచర్స్ వస్తున్నాయని అర్థం.
దీనికి గతంలో Bento లాంచర్ అనే పేరు ఉండేది. Bento లాబ్స్ డెవలపర్ తయారు చేసిన స్కౌంట్ లాంచర్ ను ప్లే స్టోర్ లో ఈ లింక్ లో దొరుకుతుంది. 4.6 రేటింగ్ తో 10MB సైజ్ లో ఉంది.
2G ఇంటర్నెట్ స్పీడ్ కనెక్షన్ లో 10 నిముషాలు పడుతుంది మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని వాడటానికి. ఇది 4.1(ఐస్ క్రీం సాండ్ విచ్) పై బడిన ఆండ్రాయిడ్ వెర్షన్ పై రన్ అవుతున్న ఫోనుల పై మాత్రమే పనిచేస్తుంది.
అన్ని రెగ్యులర్ ఫీచర్స్ తో పాటు దీనిలో ఉన్న అదనపు ఫీచర్స్…