మీకు తెలియని యాప్: స్కౌట్ బీటా లాంచర్

మీకు తెలియని యాప్: స్కౌట్ బీటా లాంచర్

ఆండ్రాయిడ్ సక్సెస్ కు అనేక కారణాలలో ఒకటి, customisation. ఫోన్ వినియోగదారుడు తనకు నచ్చిన రీతిలో, స్టైల్స్ మార్చుకునే అవకాశం ఉండటం. ఈ విభాగంలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నవి.. ఆండ్రాయిడ్ లాంచర్స్. 

స్క్రీన్ ఆన్ చేసిన వెంటనే కనిపించే డిస్ప్లే, అందంగా, డిఫరెంట్ గా, రిచ్ గా ఉండాలని కోరుకుంటాము. అదే పని ఆటోమేటిక్ గా చేసి మనకోసం అందించేవే లాంచర్స్. ఆండ్రాయిడ్ కు ఐ os కు ఇక్కడే అతి పెద్ద తేడా ఉండేది. 

తాజాగా ఆండ్రాయిడ్ os కు Scout అనే పేరుతో కొత్త లాంచర్ వచ్చింది. ఇది ఇంకా బీటా స్టేజ్ లో ఉంది. బీటా అంటే తయారీ దశలో ఉంది…సో చిన్న చిన్న బగ్స్ (వాడేటప్పుడు వచ్చే ఇబ్బందులు) అండ్ అప్ కమింగ్ ఫీచర్స్ వస్తున్నాయని అర్థం.

దీనికి గతంలో Bento లాంచర్ అనే పేరు ఉండేది. Bento లాబ్స్ డెవలపర్ తయారు చేసిన స్కౌంట్ లాంచర్ ను ప్లే స్టోర్ లో ఈ లింక్ లో దొరుకుతుంది. 4.6 రేటింగ్ తో 10MB సైజ్ లో ఉంది.

2G ఇంటర్నెట్ స్పీడ్ కనెక్షన్ లో 10 నిముషాలు పడుతుంది మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని వాడటానికి. ఇది 4.1(ఐస్ క్రీం సాండ్ విచ్)  పై బడిన ఆండ్రాయిడ్ వెర్షన్ పై రన్ అవుతున్న ఫోనుల పై మాత్రమే పనిచేస్తుంది.

అన్ని రెగ్యులర్ ఫీచర్స్ తో పాటు దీనిలో ఉన్న అదనపు ఫీచర్స్…

  1. 1. నోటిఫికేషన్ బార్ లో ఉండే నోటిఫికేషన్స్ ను priority ప్రకారం లాంచర్ ​హోం స్క్రీన్ పైనే ను చూపిస్తుంది.
  2. 2. యాప్స్ ను sorting అండ్ ఆర్గనైజ్ చేస్తుంది ఆటోమేటిక్ గా
  3. 3. కాంటాక్ట్స్, యాప్స్, ప్లే స్టోర్, వెబ్ అన్నీ వెతికే సదుపాయం హోం స్క్రీన్ పైనే
  4. 4. మీకు దగ్గరిలో ఉన్న రెస్టారెంట్స్ మరియు uber క్యాబ్స్ డిటేల్స్ చూపిస్తుంది.
  5. 5. వేరే యాప్ లో ఉన్నా యు ట్యూబ్ వీడియోలను చిన్న స్క్రీన్ లో చూడగలరు. అలాగే హోం స్క్రీన్ పై కూడా చూడవచ్చు.
  6. 6. ఇంకా చాలా రెగ్యులర్ లాంచర్ ఫీచర్స్ దీనిలో ఉన్నాయి.

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo