మీకు తెలిసిన యాప్: Prisma ప్లే స్టోర్ లో లేదు. కాని ఇలా డౌన్లోడ్ చేసుకోగలరు

మీకు తెలిసిన యాప్: Prisma  ప్లే స్టోర్ లో లేదు. కాని ఇలా డౌన్లోడ్ చేసుకోగలరు

జనరల్ గా మీకు తెలియని యాప్స్ ను పరిచయం చేయటం జరిగింది ఇప్పటివరకూ. సో ఇప్పుడు ఈ పర్టికులర్ యాప్ మాత్రం చాలా మందికి తెలుసనే అనుకుంటున్నాను. పేరు PRISMA.

ఇది మీ ఫోటోస్ ను ఆర్ట్ గా మారుస్తుంది. ఈ మధ్య కాలంలో ఆపిల్ ఫోనులకు రిలీజ్ అయ్యి బాగా పాపులర్ అయిన ఫోటో యాప్ ఇది.

కేవలం పాపులర్ అయ్యింది అని కాకుండా నిజంగా యాప్ లో మంచి filters ఉన్నాయి. మీ ఫోటోలను ఆర్ట్ గా convert చేయగలరు. ఇందుకు యాప్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(A.I) వాడటం జరుగుతుంది.

 

Vincent Van Gogh, Pablo Picasso, Issac Levitan వంటి వరల్డ్ ఫేమస్ artists ఆర్ట్స్ బేస్ చేసుకొని ఈ filters ఉన్నట్లు కంపెని చెబుతుంది.

డెవెలపర్స్ ఇంకా ఆండ్రాయిడ్ కు రిలీజ్ చేయలేదు. కాని phoneradar వెబ్ సైట్ apk ఫైల్ ను అందిస్తుంది. apk లింక్ కొరకు ఆర్టికల్ చివరిలో చూడగలరు.

 

అయితే కంపెని అఫీషియల్ గా ఇంకా విడుదల చేయలేదు కాని ఈ లింక్ లోకి వెళ్లి మీ ఇమెయిల్ అడ్రెస్ లను ఫిల్ చేస్తే కంపెని వారికీ invites పంపనుంది. ఫైనల్ లైన్ ఏంటంటే మీకు ఇలాంటి ఫోటో యాప్స్ పైన ఇంటరెస్ట్ లేకపోయినా ఇంటరెస్ట్ కలిగిస్తుంది PRISMA.

apk లింక్ ( ఫైల్ కొంతమందికి పనిచేయటం జరిగింది. తరువాత సర్వర్స్ issues వలన పనిచేయకపోతే చేయగలిగేది ఏమి లేదు. అఫీషియల్ యాప్ కొరకు వెయిట్ చేయగలరు. మీరు ఇంస్టాల్ చేసుకుంటే పనిచేస్తుందా లేదా తెలపండి ఫేస్ బుక్ కామెంట్స్ లో )

గమినిక: ఈ థర్డ్ పార్టీ apk ఫైల్ కేవలం మీకు ఇన్ఫర్మేషన్. ఇది ఇంస్టాల్ చేసిన తరువాత ఫోన్ లో ఏమినా ప్రాబ్లెమ్స్ వస్తే దానికి మేము బాధ్యులు అవము.

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo