PRISMA యాప్ లో కొత్త అప్ డేట్ అండ్ కంప్లీట్ PRISMA ఇన్ఫర్మేషన్

Updated on 28-Jul-2016

ఈ సంవత్సరం జూన్ లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా ఆపిల్ ఫోనుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని మంచి ఫోటో filters యాప్ గా 65 మిలియన్స్ ఫోటోస్ ను paint – ఆర్ట్ మోడ్ లోకి కన్వర్ట్ చేసింది.

ఈ యాప్ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యింది?
ఫోటో ఏదైనా దానిని యాప్ ద్వారా ఆర్ట్ గా మారుస్తుంది. ఆర్ట్ mode లో చాలా filters ఉంటాయి. 

ఉంటాయి సరే, కాని అవి నిజంగా అంత బాగున్నాయా? ఇంతకముందు ఎప్పుడూ ఇలాంటి filters యాప్ రాలేదా?

  • అవును బాగున్నాయి filters. పూర్తిగా 30 filters లో అన్నీ బాగున్నాయి అని చెప్పలేము కాని కనీసం ఒకటైనా మీ టేస్ట్ కు అనుగుణంగా ఉండటం జరుగుతుంది.
  • ఇంతకముందు filters తో చాలా ఫోటో గ్రఫీ ఎడిటింగ్ యాప్స్ వచ్చాయి కాని ఇది advanced future ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ ను వాడుతూ ఫోటోస్ ను కన్వర్ట్ చేస్తుంది. ఇదే మొదాటి AI ఫోటో యాప్.

 

యాప్ లో మైనస్ లు ఏమినా ఉన్నాయా?
ఇకటి ఉంది. ఫోటో ను అప్ లోడ్ చేసిన తరువాత పెయింటింగ్ ఫోటో లా మార్చటానికి కొంచెం టైం తీసుకుంటుంది wifi లో కూడా. అయితే ఒకసారి ఫోటో ను ఒక ఫిల్టర్ కు సెలెక్ట్ చేస్తే ఆ ఫిల్టర్ రెండవ సారి అదే ఫోటో కోసం వాడినప్పుడు మాత్రం అస్సలు టైం తీసుకోడు లోడ్ అవటానికి.

సరే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన అప్ డేట్ ఏంటంటే… prisma లో same పెయింటింగ్ సపోర్ట్ త్వరలో వీడియోస్ కూడా వస్తుంది అని రిపోర్ట్స్. ఇందుకు సంబందించిన టెక్నాలజీ కూడా అంతా సెట్ అప్ అయ్యింది.

ఈ వరం ఆండ్రాయిడ్ కు రిలీజ్ అయ్యి రెండు మిలియన్స్ డౌన్లోడ్స్ కు వెళ్ళింది. జూన్ లో iOS లో రిలీజ్ అయ్యి 16.5 మిలియన్ల డౌన్లోడ్స్ కు చేరుకుంది. డౌన్లోడ్ లింక్స్ తో పాటు యాప్ గురించి గతంలో వ్రాసిన సమాచారం చూడండి క్రింద లింక్స్ లో..

మీకు తెలిసిన యాప్: Prisma ప్లే స్టోర్ లో లేదు. కాని ఇలా డౌన్లోడ్ చేసుకోగలరు
PRISMA official android app playstore link
 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :