Mozilla firefox బ్రౌజర్ అందరికీ బాగా పరిచయం. ఇది చాలా కలాం క్రిందట మొబైల్ OS ను తయారు చేసింది. ఈ OS తో కొన్ని హాండ్ సెట్స్ ను కూడా రిలీజ్ చేసింది Mozilla.
అయితే బ్రౌజర్ తప్ప మిగిలిన రెండూ మినిమమ్ సక్సెస్ కాలేదు. కారణం OS లో stability లేకపోవటం. సో ఫోనులు కూడా ఇంక సక్సెస్ కాలేదు.
మొజిల్లా os ను మీ ఆండ్రాయిడ్ ఫోనులో జస్ట్ యాప్ ఇంస్టాల్ చేసుకొని ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఇది ఒక overhaul లాంచర్ లా ఉంటుంది కాని…
యాప్ ఇంస్టాల్ చేసుకుంటే.. మెయిన్ సెట్టింగ్స్, నోటిఫికేషన్స్, ఐకాన్స్, హోమ్ స్క్రీన్, బ్రౌజర్, స్టేటస్ బార్ ఇలా సాధారణ లాంచర్ ఇచ్చే ఫంక్షన్స్ కన్నా ఎక్కువ ఇస్తుంది.
ఈ యాప్ ను కంపెని అఫీషియల్ వెబ్ సైట్ లో ఉంచింది. మీకు ఇంటరెస్ట్ ఉంటే ఈ లింక్ లోకి వెళ్లి GET ANDROID APP అనే గ్రీన్ కలర్ బటన్ పై క్లిక్ చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది. కాని ఫైల్ సైజ్ 89.1MB.
అయితే అంత stable గా లేదు యూజర్ ఇంటర్ఫేస్. స్లో గా ఉంది. మీ మొబైల్ ఇంటర్నెట్ నుండి 89MB డౌన్లోడ్ చేసుకునే అంత worth అనిపించదు. కాని UI ల మీద మీకు బాగా ఇంటరెస్ట్ ఉంటే చేసుకోవొచ్చు.