మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: GEAK
మొన్న ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో ఉన్న లాంచర్ – Yandex గురించి తెలియజేయటం జరిగింది. అది చూడని వారు ఈ లింక్ లో దానిని చదవగలరు.
ఈ రోజు కూడా మేము ప్లే స్టోర్ లో మీకు తెలియని వేరే డిఫరెంట్ లాంచర్ ను పరిచయం చేయనున్నాము. దీని పేరు GEAK లాంచర్.
ప్లే స్టోర్ లో 4.3 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. యాప్ సైజ్ 6.3MB. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే లాంచర్ తో పాటు dailer మరియు మెసేజింగ్ యాప్ ఇస్తుంది.
ఫీచర్స్..
1. రెండు విధాలుగా హోమ్ స్క్రీన్ సెట్ చేసుకోగలరు. ఒకటి రెగ్యులర్ యాప్ డ్రాయర్. మరొకటి ఐ ఫోన్ లేదా Mi లాంచర్ వలే హోమ్ స్క్రీన్స్ లోనే యాప్స్.
2. హోమ స్క్రీన్ పై క్రింద నుండి పైకి స్వైప్ చేస్తే ఐ os లానే కంట్రోల్ సెంటర్ వస్తుంది.
3. లాంచర్ సెట్టింగ్స్ కొరకు మీరు హోమ స్క్రీన్ పై సెట్టింగ్స్ పేరుతో ఉన్న ఐకాన్ పై క్లిక్ చేసి Launcher వద్ద టచ్ చేస్తే లాంచర్ సెట్టింగ్స్ కనిపిస్తాయి.
4. యాప్స్ ను hide చేసుకోగలరు, ఐకాన్ సైజెస్ మార్చుకోగలరు.
5. థీమ్స్ బాగానే ఉన్నాయి. ఐ os థీమ్ ఇంస్టాల్ చేసుకుంటే ఐ ఫోన్ ఫీల్ కలుగుతుంది.
6. హోమ్ స్క్రీన్ లో లెఫ్ట్ నుండి రైట్ కు స్వైప్ చేస్తే న్యూస్ స్టోరీస్ చదవగలరు. వీటిని సెట్టింగ్స్ లో మార్చుకోగలరు.
మైనస్…
1. ఎక్కువ సెట్టింగ్స్ లేవు లాంచర్ లో.
2. యాప్స్ సర్చ్ లేదు, manual గా మీరే వెతుక్కోవాలి లేదా మీరు use చేసే వాటిని హోమ్ స్క్రీన్ 1 లోనే పెట్టుకోవాలి.
ప్లే స్టోర్ లో యాప్ ను ఈ లింక్ లో డౌన్లోడ్ చేయగలరు.