IRCTC కొత్త యాప్ లో టికెట్స్ హోం డెలివరీ చేసుకోగలరు

Updated on 24-Jul-2015

IRCTC నుండి BookMyTrain అనే కొత్త యాప్ వచ్చింది. దీనిని ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. ఇది ఆండ్రాయిడ్ ఫోనులకు మాత్రమే లభిస్తుంది. IRCTC Connect అఫీషియల్ మొదటి యాప్ ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.

BookMyTrain ఏమి చేస్తుంది?
దీనిని డెవలప్ చేయటానికి ప్రధానమైన కారణం,  కాష్ ఆన్ డెలివరీ పేమెంట్ సదుపాయం తో బుక్ చేసిన టికెట్లను ఇంటికి  హోం డెలివరీ ఇవ్వటం. ఈ యాప్ ద్వారా ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకొని, ఇంటికి టికెట్స్ ను తెప్పించుకొని ఆఫ్ లైన్ లో(మీ ఇంటి దగ్గర పే చేయవచ్చు) అమౌంట్ పే చేయవచ్చు. ఇంటర్నెట్ లో ఆన్ లైన్ పేమెంట్ మరియు డెబిట్/ క్రెడిట్ కార్డ్ పేమెంట్ వీలు కుదరని వారికి ఇది ఒక అవకాశం. ఇది irctc అఫిషియల్ గా bookmytrain.com తో partnership అయ్యి అందిస్తుంది.

ఎలా వాడాలి?
IRCTC మొదటి యాప్ మాదిరిగానే బోర్డింగ్ మరియు destination స్టేషన్స్ ను ఎంటర్ చేసి, berths సెలెక్ట్ చేసుకొని, పేమెంట్ సెక్షన్ లో COD (కాష్ ఆన్ డెలివరీ) ఆప్షన్ ను ఎంచుకుంటే చాలు. COD చూస్ చేసిన తరువాత అడ్రెస్ ఇవ్వాలి.

BookMyTrain లో ఉండే ఇతర మంచి ఫీచర్స్ :
1. పాసేంజర్స్ లిస్టు ను మీరు ముందే Passenger List లోని Create New Passenger List ద్వారా ఎంటర్ చేసుకొని సేవ చేసుకోగలరు. ఇది బుకింగ్ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. పాసేంజర్స్ పేర్లను అప్పుడు manual గా ఎంటర్ చేయనవసరం లేదు.
2. బుక్ చేసిన టికెట్లను cancel కూడా చేయవచ్చు.
3. అడ్రెస్ ఫిల్లింగ్ కూడా బుకింగ్ సమయంలో కాకుండా ముందే User Profile ఆప్షన్ లోకి వెళ్లి ఎంటర్ చేయగలరు. 

Bookmytrain యప్ లో నెగటివ్స్ :
1. COD పేమెంట్ కోసం మీరు మీ జర్నీ కు మినిమమ్ 5 రోజులు ముందు టికెట్ తీసుకుంటేనే ఇది సపోర్ట్ చేస్తుంది. మీ ఇంటికి వచ్చి టికెట్స్ ఇచ్చి డబ్బులు తీసుకోవటానికి వాళ్లు తీసుకునే సమయం 5 రోజులు. సో దీనిలో Tatkal టికెట్ పనిచేయదు. ఇది వచ్చే నెలలో అప్ డేట్ అవుతుంది.
2. ఆన్ లైన్ బుకింగ్ సర్వీస్ చార్జెస్ ఉంటాయి. అలాగే COD పేమెంట్ డెలివరి చార్జెస్ స్లీపర్ క్లాస్ టికెట్స్ కు 40 రూ, AC క్లాస్ టికెట్స్ కు 60 రూ.
3. మీరు టికెట్స్ ను కాన్సిల్ చేయాలంటే మీకు బ్యాంకు అకౌంట్ ఉండాలి. మీరు ఇచ్చే NEFT అకౌంట్ నంబర్ లోకి రిఫండ్ అమౌంట్ వస్తుంది. ఆఫ్ కోర్స్ ఈ రోజుల్లో అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఎవరి ఎకౌంట్ డిటేల్స్ అయినా ఇవ్వవచ్చు.
 

బాటమ్ లైన్:
ఇది కేవలం ఇంటర్నెట్ యాప్ సదుపాయం లేని వారికీ మాత్రమే. అయితే ఈ పని irctc మొదటి లోనే చేస్తే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడేది. Train transporting అనేది కామన్ పీపుల్ లో కామన్ కాబట్టి చాలా మంది ఇంటర్నెట్ ను అలవాటు చేసుకోవటానికి irctc టికెట్ బుకింగ్ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే కేవలం ఈ ఒక్క సదుపాయం కోసం irctc వేరే యాప్ ను డౌన్లోడ్ చేసుకోమనకుండా, తన అఫీషియల్ IRCTC Connect లో ఈ COD ఫీచర్ ను జోడిస్తే బాగున్ను. కాని దీని కోసం సెపరేట్ గా మళ్ళీ రైల్వే సంస్థ ఉద్యోగులను (డెలివరీ బాయ్స్) నియమించుకోవాలి 🙂

 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :