జిమెయిల్ కన్నా మంచి iOS యాప్ ఉంది మెయిల్స్ కొరకు [2016]

Updated on 08-Aug-2016
HIGHLIGHTS

ఇది మెయిల్స్ తో పెద్దగా పని లేని వారికీ కూడా useful గా ఉంటుంది. ఎలాగో చూడండి క్రింద

ఆపిల్ లో డిఫాల్ట్ గా మెయిల్ యాప్ ఉన్నప్పటికీ అది పుష్ నోటిఫికేషన్స్ ఇవటం లో కొంచెం విఫలం అవుతుంది. సో సాధారణంగా అందరూ జిమెయిల్ ను ఇంస్టాల్ చేసుకుంటారు. కాని క్రింద మనం తెలుసుకోబోయే యాప్ హంగులు తక్కువ ఫంక్షన్స్ ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది.

కాని జిమెయిల్ కన్నా బెటర్ ఫంక్షన్లు తో మైక్రోసాఫ్ట్ తయారు చేసిన outlook మెయిల్ క్లైంట్ బాగుంది ఆపిల్ ప్లాట్ఫారం లో. ఇది యాప్ స్టోర్ లో ఈ లింక్ లో ఉంది. సైజ్ 77.6MB (అవును iOS లో యాప్స్ సైజెస్ ఇలానే ఉంటాయి)

అందుకే మంచి వైఫై కనెక్షన్స్ ఉంటేనే ఆపిల్ ఫోన్ ఉపయోగకరమగా ఉంటుంది అనే పాయింట్ కూడా గుర్తుకు చేసుకోవాలి ఐ ఫోన్ ఫోన్ కొనేముందు. సో ఔట్లుక్ లో ఉన్న మంచి ఫీచర్స్ ఏంటో చూడండి క్రింద..

  • ముఖ్యంగా ఇది ముందు చెప్పాలి. మీరు ఫోన్ ను unlock చేయకుండా లేదా మెయిల్ యాప్ ఓపెన్ చేయకుండానే వచ్చిన మెయిల్ ను లెఫ్ట్ సైడ్ కు స్వైప్ చేసి డిలిట్ చేయగలరు. మనకు spam మెయిల్స్ ఎక్కువుగా వస్తుంటాయి కాబట్టి ఇది బాగా useful. ఈ ఫీచర్ జిమెయిల్ యాప్ లో లేదు. మొదటి బెస్ట్ ఫీచర్.
  • ఫిల్టర్ ఆప్షన్ ద్వారా చదవని మెయిల్స్ ను సింపుల్ గా అన్నీ ఒకేసారి లిస్టు చేసుకొని చూడగలరు.
  • అలాగే attachments ఉన్న మెయిల్స్ కూడా.
  • మెయిల్ లో వచ్చిన అన్ని రకాల attachments కు కేటగిరి వైజ్ గా యాప్ లోనే సెపరేట్ గా ఫైల్స్ అనే టాబ్ లో ఒక చోటు ఉంది.
  • యాప్ లో ఉన్నప్పుడు మెయిల్ ను ఒక వైపు స్వైప్ చేస్తే డిలీట్ మరో వైపుకు స్వైప్ చేస్తే schedule అని ఉంది. షెడ్యూల్ అనే ఆప్షన్ ఆ పర్టికులర్ మెయిల్ ను మనకు తరువాత గుర్తుకు చేస్తుంది. ఇది రెండవ బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి.
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :