వాట్స్ అప్ లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేసారా? ఎవరు చేశారో తెలుసుకోండి ఇలా?
దగ్గరి వాళ్ళు అయినా ఓల్డ్ ఫ్రెండ్స్ అయినా వాట్స్ అప్ లో ఎన్ని సార్లు మెసేజ్ పెట్టినా రిప్లై ఇవటం లేదా? వాళ్ళు నంబర్ మార్చారా? వాట్స్ అప్ వాడటం లేదా ఇంటర్నెట్ లేదా? లేక మిమ్మల్ని బ్లాక్ చేసారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎలా తెలుసుకోవాలి? తెలుసుకుందాము రండి.. క్రింద చెప్పనివి చాలా సింపుల్ విషయాలు, మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు. కాని తెలియని వారు కూడా ఉంటారని గ్రహించగలరు.
ఎవరైనా బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవాలంటే?
వాళ్ళని ఏదైనా గ్రూప్ లో యాడ్ చేయాలనీ try చేసినా యాడ్ చేయలేకపోతే వాళ్ళు మీ కాంటాక్ట్ ను బ్లాక్ చేసినట్లే. ఇక లాస్ట్ seen, ప్రొఫైల్ పిక్ etc అన్నీ సెక్యురిటీ సెట్టింగ్స్ లో మార్చుకునే ఆప్షన్స్ లేదా ఇంటర్నెట్ లేకపోవటం వలన కూడా అయుంటుంది. సో వీటి కన్నా బెస్ట్ finding, గ్రూప్ లో యాడ్ చేసి తెలుసుకోవటమే. ఇది ఒక్కటి చేస్తే మరేమీ చెక్ చేయనవసరం లేదు.
ఇది తెలుసుకోవటానికి ఎదో sample గ్రూప్ ను అప్పటికప్పుడు క్రియేట్ చేసి, block చేశారేమో అని తెలుసుకోవాలనే నంబర్ ను యాడ్ చేసి చూడండి గ్రూప్ లో. వాళ్ళ నంబర్/పేరు కనపడకపోతే మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే.
ఇంతక ముందు కనపడిన వాళ్ళ ప్రొఫైల్ పిక్ ఇప్పుడు కనపడటం లేదా?
దీనికి కారణం.. వాళ్ళ ఫోనులో మీ కాంటాక్ట్ లేకపోవటం అయినా అయ్యి ఉండాలి, లేకపోతే వారు ఫోన్ మార్చినప్పుడు కొత్త ఫోన్ లో మీ నంబర్ ఇంకా స్టోర్ చేయకపోవటం అయినా ఉండాలి.
జనరల్ గా రెగ్యులర్ గా టచ్ లో ఉండే వాళ్లకు మెసేజ్ పంపిస్తే సింగిల్ tick మార్క్ వస్తుంది అంటే వాళ్ళ ఫోన్ లో ఇంటర్నెట్ లేకపోవటం most possible reason. చాలా కాలం నుండి టచ్ లో లేకపోతే వాట్స్ అప్ నంబర్ మార్చారని అర్థం. ఇదే example లో బ్లాక్ చేశారని ఎందుకు అనుకోకూడదు అంటే..
- వాట్స్ అప్ లో Block అనే ఫీచర్ ఉందని చాలా మందికి తెలియదు.(ఆఫ్ కోర్స్ ఎప్పుడూ ఫోన్ పట్టుకొని కుర్చుకునే వారికీ తెలుసులెండి)
- Block ఆప్షన్ అనేది.. మీరు టార్చర్ పెడుతుంటోనో, లేక అసభ్యకరమైన మాటలు మాట్లాడితేనో లేక వారి జీవితంలో మీరు ఉండకూడదనేలా వారి పరిస్థితులు మారితెనో వాడటం జరుగుతుంది. సో వారు మిమ్మల్ని బ్లాక్ చేయటం కరెక్ట్. అనవసరమైన కారణాలను ఊహించుకొని negative ఆలోచనలతో సతమతమవకండి.
గమనిక: ఈ ఆర్టికల్ కేవలం సమాచరం కొరకే అందించటం జరిగింది. పైన ఉన్న పద్ధతుల్లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకొని మీ జీవితం మీద మీరు concentrate చేసుకునేలా positive రీజన్స్ కు వాడుకోండి కాని బ్లాక్ చేసిన వారిని పై revenge ప్లాన్స్ చేసుకుంటే అది మీ జీవితంలో ఎందుకూ పనికిరాని ప్రయత్నం అని మీరు గ్రహించాలి.