Pokemon GO గేమ్ ను ఇలా ఇంస్టాల్ చేసుకొని ఆడుకోగలరు

Updated on 09-Aug-2016
HIGHLIGHTS

ఇండియాలో ఇంకా రిలీజ్ కాలేదు. త్వరలోనే అవుతుంది అని అంచనా

Pokemon ఇండియాలో ఇంకా రిలీజ్ కాలేదు. కాని మీరు ఆపిల్ మరియు ఆండ్రాయిడ్ ఫోనుల్లో డౌన్లోడ్ చేసుకొని ఆడుకోగలరు. అది ఎలాగో చూద్దాం రండి. ముందుగా ..

Pokemon ఏలా ఆడాలి?
game ఇంస్టాల్ చేసి ఓపెన్ చేయగానే సాధారణ స్టార్టింగ్ పాయింట్స్ చూస్తారు. గేమ్ గోల్ ఏంటంటే రకరకాల pokemon characters కు పట్టుకోవాలి వాటి వద్దకు వెళ్లి. సో దీనిలో ఏముంది అనుకోకండి. వెళ్లి పట్టుకోవటం అంటే మీరు నిజంగా ఫోన్ పట్టుకొని నడవాలి. అవును గూగల్ మ్యాప్స్ లో కావలసిన లొకేషన్ ను సర్చ్ చేసి నేవిగేషన్ సహాయంతో ఎలా వెళ్తారో ఇది కూడా రియల్ గా augmentet reality ద్వారా మీకు స్క్రీన్ పై ఏ character ఎక్కడ ఉంది అని చూపిస్తుంది. దానికి ఒక రూట్ కూడా ఉంటుంది. ఇక ఆ రూట్ ను ఎంచుకొని వెళ్ళటమే. GPS ద్వారా మీ కదలికను ట్రాక్ చేస్తుంది. సో బేసిక్ గా ఇంటర్నెట్ అండ్ GPS రెండూ ఉండాలి. లేచి ఫిజికల్ గా నడవాలి, GPS వాడాలి, ఇంకా ఇంటర్నెట్ కూడా ఉండాలి అంటే మన వాళ్ళు అంత ఇంటరెస్ట్ చూపించారు అని ఇంత వరకూ దీని పై స్టోరీ వ్రాయటం జరగలేదు 🙂

ఇండియాలో రిలీజ్ కానప్పటికీ ఇది ఆండ్రాయిడ్ లో క్రింద మెథడ్ లో ఇంస్టాల్ చేసుకోగలరు…

ఈ లింక్ నుండి ఆండ్రాయిడ్ pokemon Go గేమ్ యొక్క apk ఫైల్ ను డౌన్లోడ్ చేసుకొని ఇంస్టాల్ చేసుకోండి. ఫైల్ డౌన్లోడ్ అయిన తరువాత ఫోన్ సెట్టింగ్స్ లో సెక్యూరిటీ కు వెళ్లి unknown sources నుండి యాప్స్ ఇంస్టాల్ అయ్యేలా సెట్టింగ్ enable చేసుకోండి. అయితే ఇంస్టాల్ చేసిన తరువాత మరలా disable చేసుకోవటం కూడా చాలా మంచి security టిప్. అంతే! గేమ్ ఓపెన్ చేసి ఆడుకోవటమే.

iOS లో ఇలా..

  • మీరు వాడుతున్న ప్రస్తుత ఆపిల్ ID ఆల్రెడీ ఇండియన్ కంట్రీ తో లింక్ అప్ అయ్యి ఉంటుంది కాబట్టి, దానిని log out చేయండి. యాప్ స్టోర్ లో క్రిందకు స్క్రోల్ చేసి యాపిల్ id మీద టాప్ చేసి sign out ఆప్షన్ చూస్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మరలా ఫోన్ సెట్టింగ్స్ లో General>language & Region లో US, New Zealand , Australia వీటిలో ఒకటి సెలెక్ట్ చేయండి. ఈ దేశాలలో గేమ్ అఫీషియల్ గా సపోర్ట్ చేస్తుంది.
  • ఇప్పుడు మరలా యాప్ స్టోర్ ఓపెన్ చేసి గేమ్ ను డౌన్లోడ్ చేయాలి. ఈ ప్రయత్నంలో మిమ్మల్ని కొత్త ID క్రియేట్ చేయమని అడుగుతుంది.
  • ఇక మరలా కొత్త ID క్రియేట్ చేయాలి జనరల్ ప్రాసెస్ లో. అయితే NONE అనే ఆప్షన్ ఎంచుకోండి బిల్లింగ్/payment క్రింద. అలాగే ఆ countries లోని అడ్రెస్ కూడా ఫిల్ చేయాలి. ఇందుకు ఇంటర్నెట్ లో సర్చ్ చేసి ఏదైనా షాప్ లేదా బిజినెస్ అడ్రెస్ ఇస్తే సరిపోతుంది.
  • ఇక గేమ్ డౌన్లోడ్ అవుతుంది. ఆడుకోగలరు restrictions ఏమీ లేకుండా. అయితే కొంతమందికి ఈ ప్రాసెస్ పనిచేయకపోవచ్చు.

 

విండోస్ ప్లాట్ ఫార్మ్ లో .. గేమ్ ఇంకా రిలీజ్ కాలేదు. ఇండియా అనే కాదు ఏ దేశంలోనూ రిలీజ్ అవలేదు. అవుతుందో లేదో ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. కావలి అనుకునే వారు ఈ లింక్ లో petition sign చేయగలరు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :