వాట్స్ అప్ లో అందరూ తెలుసుకోవలసిన చాలా ఇంపార్టంట్ విషయాలు

Updated on 03-Dec-2016

అందరికీ ఆధార కార్డ్ ఉందా లేదో తెలియదు కాని ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా అమ్మా, నాన్న అందరికీ వాట్స్ అప్ మాత్రం ఉంది. అంతేకాదు ఇప్పుడు వాట్స్ అప్ ఉంటే చాలు గ్రూప్స్ బాగా పాపులర్ అయ్యాయి.

స్కూల్, intermmediate, graduation, ఫెమలీ, పొలిటకల్ పార్టీస్, మూవీస్ గ్రూప్స్, ఫన్ గ్రూప్స్, మొబైల్స్ గ్రూప్స్ ఇలా గ్రూప్స్ అనేవి ఇప్పుడు వాట్స్ అప్ లో హాట్ టాపిక్.

సరదా గా అందరినీ టచ్ లో ఉంచుతూ మన అవసరాలకు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండటం తప్పు కాదు, కాని మన ప్రివెసీ సంగతి ఏంటి?

ప్రివెసీ అంటే మీ పేరు, ప్రొఫైల్ పిక్చర్, కరెంట్ మూడ్, సిటీ ఇలా అన్నీ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి అంటే మీరేమంటారు. ముఖ్యంగా అమ్మాయిలకోసం ఈ పోస్ట్ చేస్తున్నా. అబ్బాయిలకు తెలిసిన విషయాలే ఉంటాయి. ఆఫ్ కోర్స్ అమ్మాయిలకు కూడా తెలిసే ఉండవచ్చు, కాని వారు సాధారణంగా టెక్నాలజీ వంటి వాటికీ బాయ్స్ అంత ఇంటరెస్టింగ్ గా ఉండరు..

అసలు ఏమి మాట్లాడుతున్నారు మీరు? అని అనుకుంటున్నారా.. .

ఇది చాలా సింపుల్ ఆప్షన్. అందరికీ తెలిసిన విషయమే కూడా. కాని తెలియని వారికీ మోస్ట్ ఇంపార్టంట్ విషయాన్ని తెలుకున్నట్లు అని చెప్పవచ్చు. మీకు తెలియని వ్యక్తులకో లేదా అంతగా పరిచయం లేని వ్యక్తులకో మీ ఫోన్ నంబర్ దొరికితే మీ విషయాలను తెలుసుకోవటం చాలా సింపుల్ వాట్స్ అప్ ద్వారా..

జస్ట్ మీ ఫోన్ నంబర్ ను వాళ్ళ ఫోన్ లో సేవ్ చేసుకొని, వాట్స్ అప్ ఓపెన్ చేసి, మీ నంబర్ ను సేవ్ చేసిన పేరుతో సర్చ్ చేసి ఓపెన్ చేస్తే అన్నీ తెలుస్తాయి. అంటే మీ ప్రొఫైల్ ఇమేజ్, మీ కరెంట్ స్టేటస్, పేరు అన్నీ తెలియవలసిన అవసరం లేని వ్యక్తులకు తెలుస్తాయి.

అవునా? ఎలా?
సింపుల్ మీ ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ లను పబ్లిక్ view లో అందరికీ కనపడేటట్లు ఉంటుంది by డిఫాల్ట్ గా. సో దానిని మీరు మార్చుకోకపోతే ఎవరైనా మీ ఫోటోలను వాళ్ళ ఫోనుల్లో సేవ్ చేసుకోగలరు.

మరి సల్యుషణ్ ఏమిటి?
వాట్స్ అప్ ఓపెన్ చేసి, సెట్టింగ్స్ లోకి వెళ్లి..Account ఆప్షన్ కు వెళితే, Privacy అనే సెట్టింగ్ ను చూస్తారు. దానిపై టచ్ చేయండి. ఇప్పుడు మీరు Who can see my personal info అని పైన ఒక లైన్ చూస్తారు.. దాని క్రింద ఉన్న ఆప్షన్స్ లో Last seen ను ఓపెన్ చేసి Everyone , My Contacts అండ్ Nobody అనే మూడు ఆప్షన్స్ లో మీ ఇష్టాన్ని బట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి.

Everyone సెలెక్ట్ చేస్తే, ప్రపంచంలో ఎవరైనా మీరు వాట్స్ అప్ ను లాస్ట్ టైమ్ ఎప్పుడు ఓపెన్ చేశారు అని తెలుసుకోగలరు, వారి వద్ద మీ ఫోన్ నంబర్ ఉంటే. My contacts అయితే కేవలం మీ కాంటాక్ట్స్ లో ఉన్న వారె చూడగలరు. No Body అంటే మీ ఫోన్ లో ఉన్న వారైనా ఎవరైనా మీరు వాట్స్ అప్ ను లాస్ట్ టైమ్ ఎప్పుడూ వాడారో తెలుసుకోలేరు.

ఇవే ఆప్షన్స్ ప్రొఫైల్ ఫోటో, స్టేటస్ లకు కూడా ఉన్నాయి. వాటికీ కూడా సేమ్ అలానే పనిచేస్తాయి. మరొక విషయం మీకు నచ్చని వ్యక్తి ఉంటే వారిని ఆ క్రింద ఉన్న Blocked contacts లోకి వెళ్లి టాప్ రైట్ కార్నర్ లో ఉన్న ప్లస్ సింబల్ పై టచ్ చేసి కాంటాక్ట్స్ ను ఎంచుకొని బ్లాక్ చేయగలరు. ఇది మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు బాగా use అవుతుంది. ఎవరో తెలియని వ్యక్తి మెసేజెస్ చేస్తుంటే ఆ వ్యక్తి నంబర్ ను ఫోన్ లో సేవ్ "stranger" అనో లేదా మరొక పేరుతో సేవ్ చేసుకొని వాట్స్ అప్ లో ఆ కాంటాక్ట్ వద్దకు వెళ్లి లాంగ్ ప్రెస్ చేసి బ్లాక్ ఆప్షన్ ఎంచుకుంటే బ్లాక్ అవుతారు.

దాని క్రింద read receipts అనే ఆప్షన్ ను సెలక్ట్ చేస్తే మీ వాట్స్ అప్ లోకి వచ్చిన మెసేజ్ ను మీరు చదివితే, అవతల వ్యక్తి కి మెసేజ్ చూసారు అని తెలుస్తుంది. ఆప్షన్ ను deselect చేస్తే మీరు మెసేజ్ చదివినా అవతల వ్యక్తి కి చదివినట్లు తెలియదు. ఈ విషయాలు చాలా మందికి తెలిసినవే కాని తెలియని వారికీ బాగా useful అవుతాయి అనే ఉద్దేశం తోనే తెలియజేస్తున్నా.

మన కాంటాక్ట్స్ ఎవరికో తెలిసే అవకాశాలు చూడండి..
1. రీచార్జ్ చేసుకోవటానికి స్టోర్ కు వెళితే.. కేవలం సౌకర్యం ఒకటే కాదు సేఫ్టీ పరంగా కూడా ఆన్ లైన్ రీచార్జ్ బెటర్.
2. ఆన్ లైన్ లో ఏదో ఆర్డర్ చేసినప్పుడు, ఆ సర్విస్ వాళ్లు అదే డేట్ లో ఆర్డర్ చేసుకున్న వారి అందరి ఇళ్ళకు వెళ్లి  ఆర్డర్స్ లిస్ట్ (ఇందులో మీ నంబర్, పేరు అడ్డ్రెస్ ఉంటాయి) ఇచ్చి, సంతకాలు చేయమని అడుగుతారు. ఈ ప్రోసెస్ లో పాల్గొంటున్న వ్యక్తులు ఎవరైనా మీ నంబర్ తెలుసుకోగలరు..
3. random గా ఫోన్ నంబర్స్ ను టైప్ చేసి, సేవ్ చేసి, వాటిని వాట్స్ అప్ లో ఓపెన్ చేసి అన్నీ చూడగలరు.(పైన చెప్పినవి చేయకపోతే)
4. ఇప్పుడు కంపెనీలు ఓల్డ్ నంబర్స్ నే బ్లాక్ చేసి కొత్త వ్యక్తులకు ఇస్తున్నాయి. సో ఇలా పాత నంబర్ స్నేహితులు మీ నంబర్ కు ఫోన్ చేసినప్పడు కూడా..

వీటిని పట్టించుకోవటం అంత ముఖ్యమా? అంతగా భయపడాలా ప్రైవెసి కొరకు?
నేను మా కాలేజ్ అమ్మాయికి నా నంబర్ నుండి వాట్స్ అప్ లో మెసేజ్ పెట్టా. నా నంబర్ తన వద్ద లేదు. సో హలో ఎలా ఉన్నావు అని పెట్టిన వెంటనే ఎవరు అని సమాధానం వచ్చింది. నేను ఎవరో చెప్పాను. ఎక్కడా అని అడిగిన ప్రశ్నకు ట్రెయిన్ లో ఊరికి వెళ్తున్నా అని చెప్పా.

"నేను వెళ్తున్నా" అని అటునుండి రిప్లై రాగా, ఏ ట్రెయిన్ లో అని అడిగా. నేను అదే ట్రైన్ అని జవాబు ఇచ్చాను తను ట్రెయిన్ పేరు చెప్పగానే. సో తను excite అయ్యింది. ఆ తరువాత "నేను ట్రెయిన్ లో లేను." అసలు విషయం చెప్పా. అవును నేను జర్నీ చేయటం లేదు. కాని తన స్టేటస్ లో "Travelling to so called place" లేదా ట్రెయిన్ మరియు ఫ్లైట్ సింబల్స్ తో జర్నీ గురించి అప్ డేట్ పెట్టింది. అది చూసి జర్నీ అన్న సరదాగా.

ఇక్కడ మేము స్నేహితులం నిజ జీవితంలో. పైగా ఎవ్వరికీ ఇబ్బంది లేని సరదా తనంతో మరియు తనకు వాట్స్ అప్ ప్రివెసీ గురించి తెలియజేయాలని ఇలా మాట్లాడను. ఇక్కడ మీరు గమనించ వలసిన విషయం ఏంటంటే మీరు ప్రసుతం ఏమి చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారో, ఎలాంటి  మూడ్ లో ఉన్నారో అని strangers కు తెలిస్తే దానిని advantage గా తీసుకోని మీతో సంభాషణలు మొదలుపెట్టడం చాలా సులువు.

అలాగే ఎవరో తెలియని మరియు అంతగా పరిచయం లేని కాంటాక్ట్స్ యొక్క ఫోనుల్లో మీ పర్సనల్ ఫోటోస్ ఉంటున్నాయి అంటే ఆలోచించండి ఎలా ఉందో ఆ ఫీలింగ్. ఇక్కడ మిమ్మల్ని భయపడమని చెప్పటం లేదు, జాగ్రత్తగా ఉండటానికి ఉపయోగపడే వాట్స్ అప్ ఫీచర్స్ ను తెలియజేస్తున్నాము.

వాట్స్ అప్ గ్రూప్స్ ను కూడా అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా అంత అవసరం అనిపిస్తేనే జాయిన్ అవ్వాలి. ఏవో టిప్స్ అండ్ ట్రిక్స్ గ్రూప్ లేదా ఫేవరేట్ మూవీ, హిరోయిన్ గ్రూప్ అని యాడ్ అయితే పరిచయం లేని వ్యక్తులు మీ నంబర్ మరియు పేరుతో సహా అన్నీ తెలుసుకోగలరు.

అంతేకాదు గ్రూప్స్ లో ఈ మధ్య spam మెసేజ్ లు ఎక్కువవుతున్నాయి. జస్ట్ అందరిలానే ఒక మెసేజ్ పెడతారు, కాని ఆ మెసేజ్ వలన గ్రూప్ అంతా బ్లాక్ అవుతుంది. అంతేకాదు మీ పర్సనల్ కాంటాక్ట్స్ తో కూడా చాట్ చేయటానికి అవ్వదు. ఆ మెంబర్ ను గ్రూప్ అడ్మిన్ డిలిట్ చేస్తేనే ఇలాంటి ప్రాబ్లెమ్స్ సాల్వ్ అవుతాయి.

Written By : hari P

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :