గూగల్ నుండి అఫిషియల్ గా కొత్త తెలుగు టైపింగ్ కీ బోర్డ్ అప్లికేషన్
చాలా accurate గా ఉంది. కాని Gesture స్వైపింగ్ లేదు.
గూగల్ తాజగా తెలుగు మరియు ఇతర ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్ కోసం అఫిషియల్ కీ బోర్డ్ అప్లికేషన్ లాంచ్ చేసింది. దీని పేరు Google Indic Keyboard. ఈ లింక్ లో ఉంది ప్లే స్టోర్ లో. 20MB(సుమారు) ఉంది సైజ్.
ఇది తెలుగు టైప్ చేయటానికి రెండు మెథడ్స్ ఇస్తుంది…
1. Tinglish (ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తో తెలుగు పదాలను వ్రాయటం. Eg – santosham అని టైప్ చేస్తే సంతోషం అని వస్తుంది)
2. డైరెక్ట్ గా కీ బోర్డ్ పై ఉండే తెలుగు అక్షరాల కీస్ ప్రెస్ చేసి, తెలుగు వ్రాయటం. ఇది కొంచెం కష్టమైన పద్దతి. Tinglish టైపింగ్ చాలా ఈజీ.
తెలుగు కీ బోర్డ్ తో పాటు ఇంగ్లీష్ కూడా ఇస్తుంది. అయితే ఆప్షనల్ గా ఈ రెండింతో పాటు ఇతర భాషలు కూడా యాడ్ చేయగలరు అదే యాప్ లో. తెలుగు టైప్ చేసేటప్పుడు పైన సజెషన్స్ కూడా ఇస్తుంది. సో మీరు కంప్లీట్ వర్డ్ టైప్ చేయవసరం ఉండదు. చాలా Accurate గా ఉన్నాయి రిసల్ట్స్. తెలుగు భాషకు దీని కన్నా కరెక్ట్ సజెషన్స్ ఇచ్చే యాప్ మరొకటి లేదు. ఇది నిజంగా మంచి విషయం.
లాలిపాప్ మేటేరియాల్ లైట్ అండ్ డార్క్ డిజైన్ layouts తో వస్తుంది. కీస్ పై ప్రెస్ చేస్తే, సౌండ్, పాప్ అప్ అండ్ వైబ్రేషన్ కూడా వస్తుంది. ఇతర జెనెరల్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి.
అయితే… ఇంతకముందు మొబైల్ లో చాలా ఈజీగా తెలుగు టైపింగ్ చేయటానికి ఒక అప్లికేషన్ చెప్పటం జరిగింది. అది చూడని వారు ఈ లింక్ లో చూడగలరు. దాని పేరు Indic Keyboard Prime. దీని సైజ్ 9MB.
ఇప్పుడు రెండింటికీ తేడాలు…
గూగల్ ఇందిక్ కీ బోర్డ్ లో మీరు డ, ట వంటి కొన్ని అక్షరాలను టైప్ చేయటానికి కేపిటల్ D లేదా కేపిటల్ T వంటివి వాడనవసరం లేదు. అంటే Flow లో అలా డైరెక్ట్ గా స్మాల్ లెటర్స్ తో టైప్ చేసుకుంటూ వెళితే చాలు, ఆటోమేటిక్ గా మీరు టైప్ చేయదలుచుకున్న exact వర్డ్ వచ్చేస్తుంది. పైన చెప్పినట్లు దీనిలో accurate గా ఉంటాయి రిసల్ట్స్.
అదే Indic కీ బోర్డ్ Prime లో అయితే డ, ట వంటి అక్షరాల కోసం కేపిటల్ ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ ను టైప్ చేయాలి. ఇది ఒక flow లో టైప్ చేస్తున్నప్పుడు మళ్ళీ కేపిటల్ వర్డ్ టైప్ చేయటం కొంచెం ఇబ్బంది గా అనిపిస్తుంది. అలాగే గూగల్ ఇందిక్ కన్నా దీనిలో బెటర్ accurate రిసల్ట్స్ రావటం లేదు. దీనిలో దీర్ఘాలకు కూడా కేపిటల్ లెటర్స్ వాడాలి. for eg "riDar" అని టైప్ చేస్తే "రిడర్" వస్తుంది. "rIDar" అని టైప్ చేస్తేనే "రీడర్" వస్తుంది.
Example
ఎవడు – evadu & రీడర్ – ridar (Google Indic Keyboard)
ఎవడు – evaDu & రీడర్ – rIDar (Indic Keyboard Prime)
కాని Google Indic Keyboard లో లేనిది Indic keyboard Prime లో ఒకటి ఉంది…
తెలుగు టైపింగ్ కోసమే ఈ కీ బోర్డ్ లను ఇంస్టాల్ చేసుకున్నా, ఇంగ్లిష్ కీ బోర్డ్ లేకుండా ఉండలేము. రెండూ parallel గా ఇంగ్లీష్ కీ బోర్డ్ ఇస్తున్నాయి. కాని Indic keyboard prime లో ఇంగ్లీష్ టైపింగ్ కు gesture swiping ఉంది. గూగల్ కీ బోర్డ్ లో Gesture swiping లేదు. ఇది చాలా మంచి ఫీచర్, ఒక ఇంగ్లిష్ వర్డ్ లోని ఆల్ఫాబెట్స్ ను ఒక్కక్కటి టైప్ చేసే అవసరం లేకుండా, ఆ వర్డ్ లోని మొదటి అక్షరం పై ప్రెస్ చేసి మిగిలిన అక్షరాల మీదకు స్వైప్ చేస్తూ అలా వర్డ్ లోని లాస్ట్ ఆల్ఫాబెట్ వరకూ వెళితే, ఆటోమేటిక్ గా వర్డ్ వచ్చేస్తుంది. మీరు మూవింగ్ లో ఉన్న ఏ పరిస్థితుల్లో ఉన్న సునాయాసంగా టైప్ చేయటనికి బెస్ట్ ఫీచర్ ఇది.
సో మీరు రెండింటిలో ( కేపిటల్ లెటర్స్ అండ్ Gesture స్వైపింగ్ ) ఏది ఎక్కువ వాడుతారు అనుకుంటే అది pick చేసుకోవటం మంచిది. రెండూ ఉంచుకోవచ్చు కాని లాంగ్ రన్ కోసం రెండూ వాడటం అనవసరం, ర్యామ్ అండ్ బ్యాటరీ వెస్ట్ అవుతాయి. దయచేసి పోస్ట్ మీకు నిజంగా useful అనిపిస్తే ఫేస్ బుక్ అండ్ సైట్ లలో కామెంట్స్ ద్వారా తెలపండి.