ఫేస్బుక్ కొత్త అప్లికేషన్ (ఫేస్బుక్ లైట్) లాంచ్

ఫేస్బుక్ కొత్త అప్లికేషన్ (ఫేస్బుక్ లైట్) లాంచ్
HIGHLIGHTS

2జి ఇంటర్నెట్ లాంటి స్లో ఇంటర్నెట్ కనెక్షన్స్ కొసం ఈ ఆప్ తయారు చేయబడింది.

తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఉన్నవాళ్ళు కోసం ఫేస్బుక్ "Facebook Lite" పేరుతో కొత్త అప్లికేషన్ రూపొందించింది. జనవరి నుండి దీనిపై టెస్టింగ్ చేస్తున్న ఫేస్బుక్, ఇప్పటికి దీనిని వాడుక లోకి తెచ్చింది. ఇది అన్ని ఆండ్రాయిడ్ డివైజ్ లపై పనిచేస్తుంది. తక్కువ డేటా ను వాడి ఫాస్ట్ ఏక్సిస్ ను అందించనుంది ఫేస్బుక్ లైట్ అప్లికేషన్. ఆసియా ప్రాంతాలలో విడుదల అయిన ఈ ఆప్ సైజ్ కేవలం 1MB.

అప్లికేషన్ లో చేసిన మార్పులు-
బ్లూ కలర్ లో కాకుండా వైట్ కలర్ లో కనిపించే ఐకాన్ తో పాటు ఫాస్ట్ గా ఏకిస్స్ చేయటానికి ఫేస్బుక్ కొన్ని ఫీచర్స్ ను ఇందులో జోడించలేదు.న్యూస్ ఫీడ్, ప్రొఫైల్, స్టేటస్ అప్డేట్స్, ఫోటోస్ వంటి బేసిక్ ఫీచర్స్ ను ఇస్తుంది. ప్రధానంగా మెయిన్ ఆప్ కు, దీనికి రెండు తేడాలు. అవి ఇమేజ్ క్వాలిటీ మరియు ఓవర్ ఆల్ లుక్స్.
                             
                             లైట్ వెర్షన్ లోని ఇమేజెస్ తక్కువ రిసల్యుషణ్ తో ఉన్నాయి.

ఇందులో మీరు వాడలేని ఫీచర్స్-
మీ టైమ్ లైన్ మరియు ఇతర ఫోటోస్ అన్ని చాలా తక్కువ సైజ్ లో తక్కువ రిసల్యుషణ్ తో వస్తున్నాయి. అయితే ఇది ఫస్ట్ గా లోడ్ అయ్యేందుకు ఫేస్బుక్ చేసిన కోడింగ్. అయితే మెయిన్ అప్లికేషన్ కన్నా ఫస్ట్ గా లోడ్ అవుతుంది ఫేస్బుక్ లైట్ అప్లికేషన్. హంగులు ఏమి లేకుండా ఓవర్ ఆల్ డిజైన్ చాలా సింపుల్ గా స్ట్రైట్ గా ఉంటుంది. ఎనిమేషన్స్ కూడా తగ్గించింది ఇందులో.
                            
                           (left side) ఫేస్బుక్ లైట్                    (right side) ఫేస్బుక్ మెయిన్ ఆప్

స్టేటస్ అప్డేట్ ఆప్షన్ ఆప్ పైన డిఫెరెంట్ గా కనిపిస్తుంది. లైట్ వెర్షన్ లో ఫోటోస్ మరియు టెక్స్ట్ లను పోస్ట్ చేసేందుకు బాక్స్ ల రూపం లో కనిపిస్తుంది యూజర్ ఇంటర్ఫేస్. స్టికర్స్ ఇమేజ్ క్రాపింగ్ ఇందులో లేవు.
                            
                           మెయిన్ ఆప్ లో కనిపిస్తున్న మేటేరియాల్ డిజైన్ లైట్ వెర్షన్ లో లేదు.

ఫేస్బుక్ పేజెస్ లో కవర్ ఫోటో మరియు వీడియో లను పూర్తిగా తీసివేసింది ఫేస్బుక్. పేజ్ ఎబౌట్ వివరాలు కూడా టెక్స్ట్ రూపంలో కాకుండా బాక్స్ రూపం లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఆప్ సైజు ను లోడింగ్ స్పీడ్ ను దృష్టిలో పెట్టుకొని చేసిన మార్పులు.
                            
                                (left side) పేజెస్ లో కవర్ ఫోటో లేదు

సేవ్ద్ స్టోరీస్(లింక్స్), గేమ్స్, క్రియేటింగ్ పేజెస్ మరియు గ్రూప్స్ ఆప్షన్, పోక్స్, ఇంస్తాగ్రామ్, ఆప్ ఇంవైట్స్ లాంటి ఫీచర్స్ లేవు ఫేస్బుక్ లైట్ వెర్షన్ అప్లికేషన్ లో కనపడవు.

ఫేస్బుక్ లైట్ గురించి  బాటమ్ లైన్-
చూడటానికి మెయిన్ ఆప్ కన్నా ఫస్ట్ గా లోడ్ అవుతుంది ఫేస్బుక్ లైట్ ఆప్. కాని అది కేవలం సెకెన్ల తేడా. అయితే ఇది ఇంటర్నెట్ స్పీడ్ బాగా వీక్ గా ఉన్న వాళ్ళకి బానే ఉపయోగపడుతుంది.
 

Prasid Banerjee

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo