ప్లే స్టోర్ యాప్ దాని అంతట అది అప్ డేట్ అవకుండా ఉండటానికి ఇలా చేయండి

Updated on 17-Nov-2015
HIGHLIGHTS

ఇంటర్నెల్ స్టోరేజ్, తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఉన్నవారికి ఇది useful

పైన ఉన్న ఇమేజ్ లోని ప్లే స్టోర్ డిజైన్ లేటెస్ట్ ui. ఇది రిజియన్స్ వైస్ గా అందరికీ వస్తుంది. సో మీకు రాకపోతే కంగారు పడకండి.

ఆండ్రాయిడ్ ఫోనుల్లో యాప్స్ చాలా ఇబ్బంది కరంగా ఉన్నాయి. మాటి మాటికి అప్ డేట్స్ వస్తున్నాయి. యాప్ సైజెస్ అప్ డేట్ అప్ డేట్ కు బాగా పెరిగిపోతున్నాయి. కొత్త అప్ డేట్ లలో మనకు ఉపయోగపడేవి ఏమీ లేకపోయినా యాప్స్ అప్ డేట్ లు మాత్రం అవుతున్నాయి. ఇందుకు అన్నిటికన్నా బెస్ట్ eg Twitter. ఇది ఇచ్చే అప్ డేట్స్ మరొక యాప్ ఏదీ ఇవ్వదేమో అనిపిస్తాది.

SD కార్డ్ ఉన్నా లేకున్నా యాప్స్ అన్నీ ఇంటర్నెల్ మెమరీ లో ఇంస్టాల్ అవటం వలన, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్ ఉన్నప్పటికీ స్టోరేజ్ Insufficient అని మెసేజ్ వస్తాది. వీటితో పాటు ప్లే స్టోర్ కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది (size అండ్ గ్రాఫికల్ లుక్స్ వైస్ గా). ఇది లోడ్ అవటం కూడా చాలా స్లో గా ఉంటుంది. ప్లే స్టోర్ వలన మీకు బాగా ఇబ్బంది గా అనిపిస్తే ఒక సల్యుషణ్ ఉంది. కాని ముందు యాప్స్ అటో మేటిక్ అప్ డేట్స్ అవకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ తెలుసుకుందాం..

అసలు  ఈ ఫ్రీక్వెంట్ అప్ డేట్స్ తో ఏముంది ఇబ్బందీ?
1. ఇంటర్నెల్ స్టోరేజ్ సరిపోదు.
2. ఇంటర్నెట్ వెస్ట్.
3. 2G వంటి తక్కువ ఇంటర్నెట్ కనెక్షన్స్ లో డౌన్లోడ్ ఇబ్బందలు.

సో దీనికి కొన్ని సింపుల్ సల్యుషన్స్ ఉన్నాయి…
1. ఇది చాలా సింపుల్ టిప్. కాని అప్పుడప్పుడు మనం ఇలాంటి సింపుల్ విషయలు మరిచిపోయి పెద్ద పెద్ద ప్రోసెస్ ల కోసం వెతుకుతాము. ముందు అనవసరమైన యాప్స్ కంప్లీట్ డిలిట్ చేయండి. కంప్లీట్ అన్ ఇంస్టాల్ కోసం ప్లే స్టోర్ లో యాప్స్ ఉన్నాయి. వాటి ద్వారా అన్ ఇంస్టాల్ చేస్తే బ్యాక్ గ్రౌండ్ లో empty ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ వంటివి కూడా డిలిట్ అయిపోతాయి.

2. ప్లే స్టోర్ ఓపెన్ చేసి, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. అందులో ఆటోమేటిక్ అప్ డేట్స్ ను disable చేయండి. అలాగే "Notify me about updates to apps or games that I've downloaded" అనే ఆప్షన్ అన్ టిక్ చేయండి. సో మీకు కూడా అప్ డేట్ లో ఏదో ఉంది ఏమో అని డౌన్లోడ్ చేయాలనిపించదు. ఆటోమేటిక్ అప్ డేట్స్ డిసేబుల్ చేసినా లేదా అప్ డేట్స్ నోటి ఫికేషన్ డిసేబుల్ చేసినా అప్ డేట్స్ ఏమి వచ్చాయి అని తెలుసుకోవటానికి ప్లే స్టోర్ లో My apps లో చూడగలరు.

3. ప్లే స్టోర్ సెట్టింగ్స్ లో Auto-Update apps ఆప్షన్ లో Do not auto-update apps ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇది ఇక ప్లే స్టోర్ లో అప్ డేట్స్ ను ఆటోమేటిక్ గా ఇంస్టాల్ చేయదు.

4. ఏదైనా అప్ డేట్ ఇంస్టాల్ చేసే ముందు కొత్త అప్ డేట్ లో ఉన్న changes ఏంటో తెలుసుకొని చేయండి. అందులో నిజంగా ఉపయోగపడేవి ఉంటేనే యాప్స్ ను అప్ డేట్ చేయటం బెటర్. 

5. యాప్స్ అప్ డేట్స్ ను మిస్ అవటం ఇష్టం లేని వారికీ, అప్ డేట్స్ నోటిఫికేషన్ లేదా అటో మేటిక్ అప్ డేట్స్ ను disable చేయకుండా, మీకు ఆటోమేటిక్ అప్ డేట్ అవటం ఇష్టం లేని యాప్స్ కు individual గా అటో అప్ డేట్ ను డిసేబుల్ చేయగలరు. ఆ యాప్ ను ప్లే స్టోర్ లో ఓపెన్ చేస్తే టాప్ రైట్ కర్నార్ ఆప్షన్ లో ఆప్షన్ ఉంటుంది.

అసలు ప్లే స్టోర్ ఏ చాలా స్లో గా లోడ్ అవుతుంది అనుకునే వారికీ..
నిజమే ప్లే స్టోర్ లో ఉన్న మేటేరియాల్ డిజైన్ కారణంగా ఇది చాలా స్లో గా లోడ్ అవటం రన్ అవటం జరుగుతున్నాయి తక్కువ ఇంటర్నెట్ కనెక్షన్స్ లో. ఒకప్పుడు బాగా ఉండేది ప్లే స్టోర్. ఇప్పుడున్న ఫీచర్స్ అన్నీ ఉండగా, సింపుల్ ui తో  ఈజీగా లోడ్ అయ్యేది. అవి పాత వెర్షన్స్. ప్లే స్టోర్ యాప్ ఏంటంటే ఎప్పుడైనా దాని ui అప్ డేట్ అయితే, మనల్ని అడగకుండానే అప్ డేట్ అయిపోతుంది. మీకు నచ్చలేదని settings>apps>all>playstore ఓపెన్ చేసి అప్ డేట్స్ ను అన్ ఇంస్టాల్ చేసినా, మళ్ళీ లేటెస్ట్ వెర్షన్ కు apk అప్ డేట్ అవుతుంది.

సో మీ ఫోన్ రూట్ అయ్యి ఉంటే, ప్లే స్టోర్ యాప్ దాని అంతట అది అప్ డేట్ అవకుండా ఇలా చేయవచ్చు.. 
మీరు ఫోన్ కొన్నప్పుడు ప్లే స్టోర్ ఏ వెర్షన్ తో ఉందో ఆ వెర్షన్ కు restore చేస్తే కొంతమేరకు మీకు ఇంటర్నెల్ స్టోరేజ్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటి స్పీడ్ పరంగా మంచి ఫీల్ కలుగుతుంది. అయితే ఇది లేటెస్ట్ గా కొన్ని మొబైల్స్ లో అంత ఉపయోగకరంగా ఉండదు.
ఎందుకంటే లేటెస్ట్ మొబైల్స్ లాలిపాప్(ఎక్కువ గ్రాఫిక్స్ అండ్ పెద్ద సైజ్) తోనే వస్తాయి కదా. సో ప్లే స్టోర్ కూడా లేటెస్ట్ గానే ఉంటుంది. మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ కొన్నప్పుడు కిట్ క్యాట్ వంటి os తో వచ్చి ఉంటే.. క్రింద మెథడ్ రిజనబుల్ గా use అవుతుంది.

ముందు Settings>apps>All కు వెళ్లి ప్లే స్టోర్ ను ఓపెన్ చేయండి. అక్కడ Uninstall Updates ను సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫేక్టరీ వెర్షన్ కు రిస్టోర్ అవుతుంది యాప్ అని అడుగుతుంది. ఓకే చేయండి.

వెంటనే Root Explorer(ఈ యాప్ ముందే ఇంస్టాల్ చేసుకొని పెట్టుకోండి. ఈ లింక్ లో దొరుకుతుంది.) ఓపెన్ చేసి Mount R/W(పైన ఉంటుంది) అనే దానిపై ప్రెస్ చేయండి. ఇప్పుడు అక్కడే క్రిందన కనిపించే App ఫోల్డర్ ఓపెన్ చేసి, దానిలో మళ్ళీ data అనే ఫోల్డర్ లోకి వెళ్లి Newfolder క్రియేట్ చేయండి. ఈ ఫోల్డర్ కు "com.android.vending-1.apk" అని పేరు పెట్టి క్రియేట్ చేయాలి. అంతే!

ఇక మీ ప్లే స్టోర్ అటో మేటిక్ గా అప్ డేట్ అవదు. ఇప్పుడు ప్లే స్టోర్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంటర్నెల్ స్టోరేజ్ కూడా కాళీ అవుతుంది. అన్నిటికీ మించి ఈజీగా త్వరగా లోడ్ అవటం రన్ అవటం వంటివి గమనించగలరు మీరు. అలాగే కొత్త ప్లే స్టోర్ లో యాప్స్ సైజెస్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయాలి. పాత వెర్షన్ లో అవసరం లేదు, అన్నీ పైనే ఉంటాయి. ఇలాంటి కొన్ని కొన్ని UI ఫీచర్స్ పరంగా కూడా ఓల్డ్ ప్లే స్టోర్ యాప్ కు రిస్టోర్ అవటం కారణం.

మీ ఫోన్ కొనటమే లాలిపాప్ తో కొన్నారు కాని మీకు కూడా ఓల్డ్ ప్లే స్టోర్ కు వెళ్ళాలని అనుకుంటున్నారా?
అయితే ఓల్డ్ ప్లే స్టోర్ apk(వెర్షన్ నంబర్ 5  కాకుండా ఉంటే చాలు) ను గూగల్ లో సర్చ్ చేసి, డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు మీ ఒరిజినల్ ప్లే స్టోర్ ను  సేవ్(apk saver యాప్ సహాయంతో) చేసుకొని అన్ ఇంస్టాల్ చేయండి. ముందు డౌన్లోడ్ చేసిన ఓల్డ్ ప్లే స్టోర్ ను Root Explorer సహాయంతో System/app అనే ఫోల్డర్ మరియు System/Priv-app అనే ఫోల్డర్ లోకి పేస్ట్ చేయండి.
చేసిన వెంటనే దానిపై లాంగ్ ప్రెస్ చేసి, permissions పై టచ్ చేయండి. ఇప్పుడు  మొదటి వరసలో మొదటి రెండు టిక్, రెండు మూడు వరసులలో మొదటిది టిక్ చేసి OK ప్రెస్ చేయండి. ఇప్పుడు పైన చెప్పినట్టు New Folder క్రియేట్ చేయండి అంతే! మీది లాలిపాప్ ఫోన్ అయినా.. ప్లే స్టోర్ ఇక అటో మేటిక్ అప్ డేట్ అవదు.

ఒక వేల ప్లే స్టోర్ సరిగా పని చేయకపోతే.. మీరు పేస్ట్ చేసిన ఓల్డ్ ప్లే స్టోర్ అండ్ న్యూ ఫోల్డర్స్ లను డిలిట్ చేసి, మీరు ముందు  సేవ్ చేసిన లేటెస్ట్ ప్లే స్టోర్ ను మళ్ళీ manual గా ROOT Explorer సహాయంతో System/app మరియు System/Priv-app ఫోల్డర్స్ లోకి మూవ్ చేయండి. ఇక పర్మిషన్స్ పైన చెప్పినట్టు మార్చి మొబైల్ రిస్టార్ట్ చేయండి. సరిపోతుంది. ప
 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :