ఆండ్రాయిడ్ లో ఒక అవసరానికి పదుల సంఖ్యలో యాప్స్ ఉంటాయి. అందుకే ఆండ్రాయిడ్ అంత త్వరగా మోస్ట్ పాపులర్ అండ్ usable మొబైల్ ఆపరేటింగ్ సిస్టం అయ్యిపోయింది.
ఎవరైనా యాప్ క్రియేట్ చేయవచ్చు, ఎన్ని same యాప్స్ ఉన్నా అన్నిటికీ ఆదరణ ఉంటుంది. అయితే పర్సనల్ గా మా సలహా ప్రకారం ఏ యాప్ లో మీకు ఉపయోగకరమైన మరియు ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉన్నాయో దానిని ఇంస్టాల్ చేసుకోవటం బెటర్.
సో ఇక్కడ అలంటి ఫోటో మేనేజ్మెంట్ ఆండ్రాయిడ్ యాప్ గురించి తెలియజేయటానికి ఈ ఆర్టికల్ వ్రాయటం జరిగింది. యాప్ పేరు Focus. ఈ లింక్ లో ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయగలరు.
ఏమి ఫీచర్స్ ఇస్తుంది?
- ప్రతీ ఫోటో కు టాగ్ పెట్టుకోగలరు. టాగ్ అనేది వందల ఫోటోస్ లో మీకు కావలసిన ఫోటో ను ఈజీగా ఓపెన్ చేసేందుకు useful. మీరు క్రియేట్ చేయనవసరం లేకుండా కొన్ని టాగ్స్ కూడా ఇస్తుంది యాప్.
- ఆటోమాటిక్ గా మీ ఫోన్లోని ఫోల్డర్స్ లోని ఫోటోస్ స్కాన్ చేసి వాటికీ సెపరేట్ టాగ్స్ తో ఫోటోస్ ను organize చేస్తుంది.
- ఫోటో తీసిన లొకేషన్, ఫోటో లోని సబ్జెక్టు ఆధారంగా వాటిని organize చేస్తుంది.
- మీరు చెప్పిన విషయం మీద బేస్ చేసి కూడా అన్నిటిని organize చేయగలదు.
- డేట్స్ వైజ్ గా వీడియోస్, ఇమేజెస్ ను చూడగలరు.
- ఎవరికైనా ఒక ఫోటో చూపించవలసి వచ్చి మన చేతులనుండి వారికి ఫోన్ ఇస్తే, వాళ్ళు next ఫోటో ను స్వైప్ చేసినా స్వైప్ అవకుండా సెట్ చేసుకోగలరు.
- ఫోటోస్ కు పాస్ వర్డ్ సెట్ చేయగలరు.
- ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 OS వాడుతుంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో లాక్ చేసుకోగలరు ఫోటోస్ ను.
- బేసిక్ cropping అండ్ రొటేటింగ్ ఆప్షన్స్
- Gestures(చేతి తో స్క్రీన్ పై చేసే స్వైప్స్) తో multiple ఫోటోస్ ను organize చేయగలరు.