మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: వాట్స్ అప్ & ఇతర యాప్స్ మెసేజెస్ కు ఓపెన్ చేయకుండానే రిప్లై ఇవ్వగలరు.

Updated on 10-Mar-2016
HIGHLIGHTS

ఫోన్ ముట్టుకోకుండానే వచ్చే నోటిఫికేషన్ ఏంటో ఎవరిదో తెలుసుకోవాటినికి సింపుల్ టిప్స్ చూడండి..

ఆండ్రాయిడ్ ఫోన్లలో నిమిషానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది 70 శాతం వరకు వెంటనే చూడవలసిన నోటిఫికేషన్ కాదు. కాని ఇంపార్టెంట్ పెర్సన్ మెసేజ్ ఏమో ఎని ఫోన్ తీసి, ప్రతీ సారి అన్ లాక్ చేసి, నోటిఫికేషన్ బార్ ను క్రిందకు లాగి మెసేజ్ ఏంటో చూస్తాము.

ఖాలిగా ఉన్నప్పుడే కొన్ని సార్లు ఈ ప్రాసెస్ అంతా చేయటానికి విసుగు పుడితే, డ్రైవింగ్ లో కాని పని లో కాని ఉంటే ఎంత ఇబ్బంది కరంగా ఉంటుందో అని సెపరేట్ గా చెప్పనవసరం లేదు.

ఈ ప్రాసెస్ అంతా లేకుండా నోటిఫికేషన్ యొక్క సౌండ్ వినగానే మీరు అది స్టాండర్డ్ మెసేజ్ లేదా వాట్స్ అప్ మెసేజ్ లేదా మెయిల్స్ అని తెలుసుకోవటానికి సింపుల్ గా అందరికీ అందుబాటులో ఉండే డిఫరెంట్ రింగ్ tone or నోటిఫికేషన్ tone సదుపాయాన్ని వాడుకోండి.

వాట్స్ అప్ మెసేజ్ లో ఒక్కో కాంటాక్ట్ కు వేరే వేరే నోటిఫికేషన్ tone కూడా పెట్టుకోగలరు. సో ఎవరు ping చేశారనేది కూడా తెలుసుతుంది. ప్రియారిటీ బట్టి రెస్పాండ్ అవుతారు. ఇలా సెట్ చేసుకోవటానికి ఆ యాప్స్ సెట్టింగ్స్ లో నోటిఫికేషన్ సౌండ్ ను మార్చుకోవటమే. అది జి మెయిల్, వాట్స్ అప్, fb మేసేజంర్, స్టాండర్డ్ మెసేజెస్ ఏదైనా సరే.

మరొక డిఫరెంట్ issue ఉంది. ఫోన్ ను వాడుతుంటే వాట్స్ అప్ నుండి మెసేజెస్ వస్తుంటాయి. అవి వాట్స్ అప్ మెసేజ్ లేదా జిమెయిల్ లేదా మరొకటా అనేది లాలిపాప్ ఓస్ ను వాడె వారికీ స్క్రీన్ పైన heads-up నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కాని వాటిలో ఉన్న కంటెంట్ చదవటానికి కాని లేదా reply ఇవ్వటానికి గాని అవ్వదు.

ఈ ప్రాబ్లెం కు సల్యుషణ్ ఈ రోజు మీరు తెలుసుకోనున్న థర్డ్ పార్టీ యాప్. దీని పేరు Floatify. ప్లే స్టోర్ లో ఈ లింక్ లో 2.6 MB తో 4.2 star రేటింగ్ కలిగి ఉంది ఫ్రీ గా.

ఏమి చేస్తుంది ఇది?
మీరు చాటింగ్ చేస్తూ వేరే పనిలో ఉంటే వాట్స్ అప్ వదిలి వేరే స్క్రీన్ లేదా యాప్ లో ఉంటారు. అప్పుడు మధ్యలో మెసేజ్ వచ్చే ప్రతీ సారి వెన్నకి వెళ్లి యాప్ ఓపెన్ చదివి రిప్లై ఇవ్వాలి. Floatify యాప్ మీకు heads-up నోటిఫికేషన్ దగ్గరే వచ్చిన మెసేజ్ ఏంటో చూపించి అక్కడే రిప్లై పంపటానికి use అవుతుంది. సో మీరు ఉన్న స్క్రీన్ ను విడవకుండానే చదివి రిప్లైలు ఇవ్వగలరు.

ఫీచర్స్ ఏమున్నాయి?
1. రిప్లైలు ఇవ్వటానికి వాట్స్ అప్  అండ్ జి మెయిల్ కు మేము వాడుతున్నాము. వాట్స్ అప్ బాగా పనిచేస్తుంది. జిమెయిల్ మాత్రం ఒక సారి మీరు టెస్ట్ చేసి తెలుసుకోవాలి.
2. heads-up నోటిఫికేషన్ ఎంత సైజ్, ఏ కలర్, ఎంత సేపు ఉండాలి అనేవి సెట్ చేసుకోగలరు.
3. టచ్ చేస్తే నోటిఫికేషన్ యాప్ ఓపెన్ అవ్వాలి, పైకి స్వైప్ చేస్తే నోటిఫికేషన్ క్లోజ్ అవ్వాలి .. ఇంకా క్రిందకు స్వైప్ చేస్తే రిప్లై బాక్స్ ఓపెన్ అవ్వాలి వంటివి సెట్ చేసుకోగలరు సెట్టింగ్స్ లో.

ఎలా చేయాలి సెట్ అప్?
యాప్ ఓపెన్ చేసి Headup సెట్టింగ్ లోకి వెళ్లి expert మోడ్ ను ఆన్ చేస్తే ఇలాంటివి చాలా ఫీచర్స్ ను మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోగలరు. ప్రో వెర్షన్ కూడా ఉంది. ప్రో వెర్షన్ లో ఎక్కువ characters కలిగిన మెసేజ్ లను పంపటానికి అవకాశం ఇస్తుంది యాప్. అయితే చాలా వారకు ఫ్రీ వెర్షన్ లో పంపే characters సరిపోతాయి.

నోట్: గూగల్ తయారు చేసిన Android wear – smartwatch యాప్ ను వాడితే hangouts అండ్ ఇతర యాప్స్ కు కూడా reply సపోర్ట్ ఉంటుంది.

 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :