మీకు స్మార్ట్ ఫోన్ లో రూటింగ్ చేయాలని అనుకుంటున్నారు కాని ఎలా చేయాలో తెలియక, ఎవరిని అడగాలో తెలియక ఇబ్బంది పదుతున్నారా? ఇక మీరు వెయిట్ చేయనవసరం లేదు, రూటింగ్ , custom roms, guides, how to's, లేటెస్ట్ అప్ డేట్స్ ఇన్ఫర్మేషన్, Xposed framework ఇన్స్టలేషన్ ఇలా ఏదైనా సరే మీరు సొంతంగా తెలుసుకునేలా ఒక యాప్ ఉంది.
దాని పేరు XDA. ఇది ప్రపంచంలోని ఫేమస్ మొబైల్ అండ్ డెస్క్ టాప్ OS డెవలప్మెంట్ ఫోరమ్స్ వెబ్ సైట్. OS ఏదైనా అన్ని మొబైల్స్ కు సంబంధించిన సమాచారం అందిస్తుంది. మీరు ఏ ఫోన్ వాడుతున్నా, మీ ఫోన్ కు సంబంధించిన సమాచారం, లేదా మీ ఫోన్ మోడల్ వాడుతున్న వ్యక్తులను మీట్ అయ్యే ఫోరం ప్లేస్ ఇది.
వెబ్ సైట్ మరియు యాప్ రూపంలో కూడా ఉంది. యాప్ ను ఈ లింక్ లోకి వెళ్లి ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయగలరు. website link కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. యాప్ సైజ్ సుమారు 7.5MB ఉంది. రేటింగ్ 4.5 స్టార్.ఇక మీదట నాలాంటి వ్యక్తుల పై లేదా టెక్నాలజీ గురుల పై ఆధారపడనవసరం లేకుండా మీ అంతట మీరే ఒక టెక్నికల్ నాలెడ్జ్ పర్సన్ అవగలరు.
అలవాటు చేసుకోండి, కొన్ని నెలలో లోపు రూటింగ్ అంటే ఏమిటి, custom roms ఏంటి, bootloader unlocking అంటే ఏమిటి వంటి విషయాలపై బాగా అవగాహన తెచ్చుకుంటారు. ఆపిల్, విండోస్ ఫోన్స్ పై కూడా సమాచారం అందిస్తుంది.
కేవలం ఫోన్స్ గురించే కాదు, డెస్క్ టాప్ OS ల గురించి, థర్డ్ పార్టీ లేటెస్ట్ OS ల గురించి కూడా తెలుసుకోగలరు. ఫర్ eg: లేటెస్ట్ గా ఆండ్రాయిడ్ os తో రిలీజ్ అయిన REMIX అనే డెస్క్ టాప్ OS పై కూడా.
ఎలా వాడాలి?
యాప్ ఇంస్టాల్ చేసి ఓపెన్ చేస్తే, మీకు లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ లో My device అని ఉంటుంది. దాని పై టాప్ చేస్తే, మీ ఫోన్ కు సంబంధించిన forum ఉంటుంది. మీరు వాడుతున్న ఫోన్ లేటెస్ట్ లేదా అంత పాపులర్ కానిది అయితే forum ఉండదు. కాని ఫోన్ కు సంబంధించిన సమాచారం అయితే ఉంటుంది.
ప్రత్యేకంగా forum ఉంటే.. మీకు మరింత సమాచారం ఉంటుంది మీ ఫోన్ పై. ఒక ఫోన్ కు ఫోరం ఉంటే దానిలో 5 threads ఉంటాయి.
1. ROMS, RECOERIES,డెవలప్మెంట్
2. ప్రశ్నలు జవాబులు
3. గైడ్స్, న్యూస్ అండ్ డిస్కషన్స్
4. Accessories
5. యాప్స్ అండ్ థీమ్స్.
వాటిలో మీరు ఏదైనా అడగాలనుకున్న, చెప్పాలనుకున్న, XDA కు username, ఈమెయిలు idi, పాస్ వర్డ్ ఇచ్చి sign up అవ్వాలి ముందు. ముందు కన్ఫ్యూషన్ గా ఉంటుంది కాని అలవాటు చేసుకుంటే ఈజీగా మీరు టెక్నాలజీ పై అవగాహన కలిగిన geek person అవుతారు అనటంలో అతిశయోక్తిలేదు. ఆల్ ది బెస్ట్!