మీరు చూడని ఆండ్రాయిడ్ అప్లికేషన్ : సైన్ ఈజీ

మీరు చూడని ఆండ్రాయిడ్ అప్లికేషన్ : సైన్ ఈజీ
HIGHLIGHTS

ప్రింట్ అవుట్ అండ్ స్కానింగ్ అవసరం లేకుండా.. e - సిగ్నేచర్ చేస్తుంది.

దీని పేరు Sign Easy. గూగల్ ప్లే స్టోర్ లో ఈ లింక్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేయగలరు. ఆండ్రాయిడ్ 4.0 నుండి ఉన్న os వెర్షన్ లపై రన్ అవుతుంది. దీని సైజ్ 25 mb. అంటే 2g ఇంటర్నెట్ స్పీడ్ లో 20 నిమిషాలు పడుతుంది డౌన్లోడ్ చేయటానికి. 4.1 స్టార్ రేటింగ్ ఉంది ప్లే స్టోర్ లో. ios యూసర్స్ ఈ లింక్ లో చూడండి. ఈ లింక్ లో డెస్క్టాప్ సదుపాయం కూడా ఉంది.  బ్లాక్ బెర్రీ యూజర్స్ ఇక్కడ డౌన్లోడ్ చేయగలరు.

ఇది ఏమి చేస్తుంది :

1. ఇది డిజిటల్ సిగ్నేచర్ యాప్. అంటే మీ డాక్యుమెంట్స్ పై సంతకాలు చేస్తుంది సైన్ ఈజీ. ఇలాంటి అప్లికేషన్స్(SignNow, DocuSign, Adobe eSign Manager DC) చాలా ఉన్నాయి. కాని సైన్ ఈజీ చాలా సులువుగా పని చేస్తుంది.

2. e-mail అటాచ్మెంట్స్ మరియు ఎటువంటి డాక్యుమెంట్ అయినా సరే… మీ చేతితో లేదా stylus తో ఫోన్ స్క్రీన్ పై చేస్తే చాలు, అది ఆటోమేటిక్ గా  మీ సిగ్నేచర్ అయిపోతుంది.

3. PDF, JPEG, HTML, Word, Text, Excel ఇలా చాలా ఫార్మాట్ లను సపోర్ట్ చేస్తుంది. 

4. ఒక సారి మీ సిగ్నేచర్ చేసి యాప్ లో స్టోర్ చేస్తే, దానిని ఎన్ని సార్లు అయినా వాడుకోగలరు. 

5. సిగ్నేచర్ తో పాటు దాని క్రిందన initials, text, కరెంట్ డేట్ మరియు ఇమేజ్ లను కూడా యాడ్ చేయగలరు.

6. మీరు అందించే డేటా అంతా యాప్ లోనే స్టోర్ అవుతాయి, అప్లికేషన్ సర్వర్స్ లో ఎక్కడా సేవ్ అవ్వవు.

7. దీనిలో పెన్సిల్ సైజ్ లను సెలెక్ట్ చేసుకోవటానికి ఆప్షన్ ఉంది. సో చేతితో చేసినా సన్నగా వస్తుంది సిగ్నేచర్ రైటింగ్.

ఇది ఎప్పుడూ ఉపయోగపడుతుంది :

సాధారణంగా మీరు ఇంటర్నెట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి, ఫిల్ చేసి, సిగ్నేచర్ కోసమని ప్రింట్ అవుట్ తీస్తారు. అయితే ఇప్పుడు ప్రింట్ అవుట్, fax అండ్ స్కానింగ్ లు ఏమి లేకుండా అన్నీ electornic గానే చేసి అప్ లోడ్ చేయగలరు సర్టిఫికెట్స్ అండ్ అప్లికేషన్స్. సో వెంటనే బయటకు వెళ్ళకుండానే మీ సిస్టం లోనే సైన్ చేసేసి మెయిల్ చేయగలరు. 

ఏడు రోజులు అన్నీ ఫీచర్స్ వాడిన తరువాత ఇది లిమిటెడ్ ఫీచర్స్ ను ఇస్తుంది. అయితే మనకు ఉపయోగపడేవి అన్నీ లిమిటెడ్ వెర్షన్ లో కూడా ఉన్నాయి. ప్రో వెర్షన్ లో అన్ లిమిటెడ్ సిగ్నేచర్స్ అండ్ advanced ఫీచర్స్ ఉన్నాయి.

 

Abhijit Dey

Abhijit Dey

A Star Wars fan and sci-fi enthusiast. When I'm not playing games on my PC, I usually lurk around the Internet, mostly on Reddit. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo